Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

14-06-2019 నుండి 20-06-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో ఒకింత ఆందోళన తప్పక పోవచ్చును. ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చును. మిత్రులతో మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం చాలావరకు మేలుచేస్తుంది. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

 ఈవారం మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో రావల్సిన ధనం సమయానికి చేతికి అందుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత అనుకూల మైన మరపు ఉంటుంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది.

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే విషయంలో తోటివారి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం వారం చివరలో చేతికి అందుతాయి. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం సూచన. కోపం తగ్గించుకోవడం వలన అనుబంధాలు నిలబడతాయి, లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. తల్లితరుపు బంధువులను కలుసుకుంటారు,చర్చలు చేస్తారు.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని శ్రధగా గడుపుటకు ఆస్కారం ఉంది. మీ నిర్ణయాల వలన అధికారులకు దగ్గరయ్యే అవకాశం ఉంది, మంచి గుర్తింపును పొందుతారు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో అలాగే పెట్టుబడుల విషయాల్లో మాత్రం ఏమాత్రం తొందరపాటు వద్దు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. తండ్రితరుపు బంధువుల నుండి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. చర్చల్లో నిదానం అవసరం.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తిచేసే విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. బంధువులతో విభేదాలు రాకుండా సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యక్రమాల గురుంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం కలదు.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకింత తడబాటు ఉంటుంది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది, అలాగే అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. కుటుంబంలో కాస్త నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది. విదేశీ ప్రయాణప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

 ఈవారం సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను మీదైన ఆలోచనలతో పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. తండ్రితరుపు బంధువులతో ఊహించని విధంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వండి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. అధికారులనుండి మంచి గుర్తింపును పొందుతారు.

 

.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

 ఈవారం ఆరంభంలో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. చేపట్టు పనుల విషయంలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన పరిచయాలు ఏర్పడుతాయి, వారితో సరదాగా ఉంటారు.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారితో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. సంతానం విషయాల్లో గతంలో ఉన్న ఆందోళన తగ్గుటకు అవకాశం కలదు.
 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తండ్రితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. పెద్దల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలను అశ్రద్ధ చేయకపోవడం మంచిది.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి. సంతానమ్ విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత తగ్గుముఖం పడుతాయి. పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం ఆరంభంలో ఒకింత ఇబ్బందులు తప్పక పోవచ్చును, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పూజాదికార్యక్రమాల్లో  పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గుముఖం పడుతుంది. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం సూచన. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.  

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
Dharmam