Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

కాజల్‌ దశ అలా తిరగనుందా.

Will the Kajal phase turn around

చందమామ అందం కాజల్‌ అగర్వాల్‌కి వయసుతో పాటు వన్నె కూడా మరింత పెరుగుతోంది. అయితే, తెలుగులో మాత్రం అవకాశాలు తగ్గు ముఖం పట్టేశాయి. తమిళంలో ఇంకా కాజల్‌ జోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మూడు తమిళ ప్రాజెక్టులు కాజల్‌ చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది కూడా. బాలీవుడ్‌ క్వీన్‌కి తమిళ రీమేక్‌గా రూపొందిన 'ప్యారిస్‌ ప్యారిస్‌' రేపో మాపో విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌తో కాజల్‌ 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా సూర్య సినిమాకి సైన్‌ చేసింది. ఇదిలా ఉంటే, వెరీ లేటెస్ట్‌గా కాజల్‌ ఓ బాలీవుడ్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

జాన్‌ అబ్రహాం హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ నటించబోతోంది. సినిమాలో హీరోయిన్‌ పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉండబోతోందట. చాలా అరుదుగా మాత్రమే హీరోయిన్స్‌కి ఇలాంటి పాత్రలు దక్కుతాయట. అలాంటి విభిన్నమైన పాత్రలో కాజల్‌ కనిపించబోతోంది. ముంబయ్‌ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. కాగా, టాలీవుడ్‌ నుండి, బాలీవుడ్‌కెళ్లిన తాప్సీ బాలీవుడ్‌లో నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ, ఏకంగా అక్కడే సెటిలైపోయింది. అలాగే, కాజల్‌కి దక్కిన ఈ అరుదైన అవకాశంతో కాజల్‌ కూడా ఇక బాలీవుడ్‌లో సెటిలైపోతుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే, కాజల్‌ కన్నా అదృష్టవంతురాలు మరొకరుండరు. సౌత్‌లో ఇప్పుడిప్పుడే కాజల్‌కి అవకాశాలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో బాలీవుడ్‌ పిలిచి మరీ ఇంపార్టెంట్‌ రోల్‌ కట్టబెట్టడం నిజంగా చందమామ అదృష్టమే.

మరిన్ని సినిమా కబుర్లు
This is the Ileana Breakup reason