Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
This is the Ileana Breakup reason

ఈ సంచికలో >> సినిమా >>

మళ్లీ బాంబ్‌ పేల్చిన హాట్‌ బ్యూటీ.!

Hot Beauty bomb blosted again

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో గ్లామర్‌ దాడి చేసి, కుర్రకారు గుండెల్లో బాంబులు పేల్చేసింది ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌. డెబ్యూ మూవీ అయినప్పటికీ, బోల్డ్‌గా కనిపించడంలో ఏమాత్రం రాజీ పడలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాతో అమ్మడికి అలాంటి క్యారెక్టర్సే క్యూ కట్టాయట ఆ తర్వాత. కానీ, 'నేనలాంటి దాన్ని కాదు..' అంటూ వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించిందట పాయల్‌ రాజ్‌పుత్‌. అయితే, ఈ బోల్డ్‌ బ్యూటీ తాజాగా నటిస్తున్న చిత్రం కూడా ఇంచుమించుగా ఆ తరహాలోనిదే అని పోస్టర్స్‌ ద్వారా సంకేతాలు పంపుతున్నారు. ఇంతకీ అది ఏ సినిమా అంటే, టైటిల్‌ 'ఆర్‌డీఎక్స్‌'. తెలిసిందే కదా.. అంటారా.? ఈ సినిమా కంటెంట్‌ బోల్డ్‌ కంటెంట్‌ కాదంట. కానీ, ప్రమోషన్‌ మాత్రం పక్కా బోల్డ్‌గానే చేస్తున్నారండీ బాబూ. పోస్టర్స్‌ మీద పోస్టర్స్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

కళాపోషకుల కడుపు నింపేస్తున్నారు. ఒకదాన్ని మించిన పోస్టర్‌ ఇంకోటి. మసాలా అంచెలంచెలుగా పెంచేస్తున్నారు. ఈ పోస్టర్స్‌ బాగోతం చూస్తుంటే, 'ఆర్‌డీఎక్స్‌'లో పాయల్‌ రాజ్‌పుత్‌ ఏమంత తక్కువ చేసినట్లు లేదు. తాజాగా విడుదల చేసిన పిక్‌లో పాయల్‌ మరీ రెచ్చగొట్టేస్తోంది తన ఘాటు ఘాటు అందాలతో. ఇదో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ. మంచి విషయమున్న కథ ఇది అని చెబుతున్నారు. కానీ, కథలో విషయం ఎవరికి కావాలి చెప్పండి. హీరోయిన్స్‌లో గ్లామర్‌ ఉందా.? లేదా.? అదే చూస్తున్నారిప్పుడు చిన్న సినిమాల్లో. అందుకే ఆ రూట్‌నే ఫాలో చేస్తున్నారు మన 'ఆర్‌డీఎక్స్‌' టీమ్‌. వాస్తవానికి ఇదో రొమాంటిక్‌ సస్పెన్స్‌ లవ్‌ స్టోరీ అని తెలుస్తోంది. మరోపక్క పాయల్‌, విక్టరీ వెంకటేష్‌ సరసన 'వెంకీ మామ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని సినిమా కబుర్లు
'Valmiki' deals with gangleader