Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Action Choreographer

ఈ సంచికలో >> సినిమా >>

మూడో గది' కోసం ఉమాదేవి దిగొచ్చింది

Third room

చిన్న సినిమాగా తెరకెక్కిన 'రాజుగారి గది' సినిమా సంచలన విజయం అందుకుంది. ఆ సినిమా ఆ స్థాయిలో సక్సెస్‌ అవుతుందని తెరకెక్కించిన డైరెక్టర్‌కే తెలియదు. కానీ ఆ సినిమాకి అలా అన్నీ కలిసొచ్చాయి. విజయవంతమైంది. అదే జోష్‌తో రెండో పార్ట్‌ని తెరకెక్కించాడు. కాస్త మసాలా, స్టార్‌డమ్‌ ఫ్లేవర్‌ గట్టిగా దండించి తెరకెక్కించిన 'రాజుగారి గది 2' ఆశించిన రిజల్ట్‌ అందించలేదు. కానీ, ఏమాత్రం తగ్గని జోరుతో మూడో పార్ట్‌నీ బరిలో దించాడు డైరెక్టర్‌ ఓంకార్‌. అదే 'రాజుగారి గది 3'. ఈ పార్ట్‌ని కేవలం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌గా రూపొందించాలనుకున్నాడు. అందుకు స్టార్‌ హీరోయిన్‌ తమన్నాని లైన్‌లోకి దించాడు. షూటింగ్‌ స్టార్టయ్యాక తమన్నా హ్యాండివ్వడంతో ఓంకార్‌ ఎంత మాత్రమూ తగ్గకుండా స్టార్‌ హీరోయిన్స్‌ కోసమే వేట మొదలు పెట్టాడు.

కానీ, వర్కవుట్‌ కాకపోయేసరికి 'ఉయ్యాలా జంపాలా' ఫేమ్‌ ఉమాదేవి అలియాస్‌ అవికా గోర్‌ని తీసుకుని సింపుల్‌గా సినిమా కానిచ్చేశాడు. కామ్‌గా షూటింగ్‌ పూర్తి చేసేశాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యే వరకూ హీరోయిన్‌ అవికాగోర్‌ అన్న దానిపై పక్కా క్లారిటీ రాలేదు ఆడియన్స్‌కి. రాజుగారి మూడో గది ఓంకార్‌కి కలిసి రాలేదు. సో టోటల్‌గా ప్రాజెక్ట్‌ అటకెక్కించేశాడు అనుకున్న తరుణంలో సినిమా కంప్లీట్‌ అయిపోయిందనే న్యూస్‌ రివీల్‌ చేశాడు. ఏది ఏమైతేనేం, ఓంకార్‌ అనుకున్నది సాధించాడు. దసరాకి సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నాడు. ఓంకార్‌ సొంత బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. అశ్విన్‌బాబు హీరోగా నటించాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
wild card entry!