Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

డ్రీమ్‌ నెరవేర్చుకుంటోన్న అలియాభట్‌

The dream is fulfilling Aliyabhat

బాలీవుడ్‌ క్యూట్‌ అండ్‌ నాటీ గాళ్‌ అలియాభట్‌ త్వరలోనే సౌత్‌లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం అలియా భట్‌ సౌత్‌లో అడుగు పెట్టింది. ఈ సినిమాలో అలియా భట్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కి జోడీగా నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అలియా, చరణ్‌కి జోడీనే అయినా, చాలా చిన్న క్యారెక్టర్‌లో కనిపిస్తుందనీ, జస్ట్‌ లైక్‌ ఏ గెస్ట్‌ రోల్‌ అనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో అలియా స్పందించింది. అక్కడున్నది జక్కన్న. ఆయన సినిమాలో ఒక్క సెకను పాటు కనిపించినా, అది అదృష్టమే. అలాంటిది నా పాత్ర మరీ అంత తక్కువ నిడివి ఉన్న పాత్రేమీ కాదు. ఖచ్చితంగా ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రే. ఆ పాత్రలో నటించడం కాదు, జీవించాలనే ఉద్దేశ్యంతో, డైలాగుల్ని బాగా అర్ధం చేసుకుని మరీ నటిస్తున్నాను.. అందుకోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నా..' అంటూ అలియా చెప్పింది.

అంతేకాదు, బాలీవుడ్‌లో సంజయ్‌ లీలా భన్సాలీ, టాలీవుడ్‌లో రాజమౌళి తన డ్రీమ్‌ డైరెక్టర్స్‌ అనీ, ఒక్క సీన్‌ కోసమై ఆ డైరెక్టర్స్‌ సినిమాలో భాగం కావాలని కలలు కన్నాననీ, ఆ కల ఇంత త్వరగా ఈ సినిమాతో నెరవేరుతుందని అనుకోలేదనీ క్యూట్‌గా క్లారిటీ ఇచ్చేసింది అలియా భట్‌. అలియా హిందీలో నటిస్తున్న 'బ్రహ్మ్రాస్త్ర' త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్‌' వచ్చే ఏడాది జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల్లోనే అలియా, 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' షూటింగ్‌లో జాయిన్‌ కానుందట. ఇదిలా ఉంటే, అలియా భట్‌ త్వరలోనే మరో శుభవార్త చెప్పనుందనీ తెలుస్తోంది. లెట్స్‌ వెయిట్‌ ఫర్‌ దట్‌ గుడ్‌ న్యూస్‌.

మరిన్ని సినిమా కబుర్లు
Action Choreographer