Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'వాల్మీకి' షూటింగ్‌ అయిపోయిందోచ్‌.!

Valmiki shooting

ప్రబాస్‌ 'సాహో' కోసం నాని తన 'గ్యాంగ్‌లీడర్‌' రిలీజ్‌ డేట్‌ని త్యాగం చేస్తే, నానీస్‌ 'గ్యాంగ్‌లీడర్‌ 'కోసం, వరుణ్‌తేజ్‌ తన 'వాల్మీకి'ని త్యాగం చేశాడు. అలా పరస్పర సహకారంతో, 'వాల్మీకి' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'వాల్మీకి' టీమ్‌ ప్రమోషన్స్‌ హోరెత్తిస్తోంది. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌స్టర్‌గా డిఫరెంట్‌ రగ్గ్‌డ్‌ లుక్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పొడుగాటి జుట్టు, గెడ్డం, మెడలో రుద్రాక్షలు.. వగైరా భారీ మేకప్‌తో సింహంలా కనిపిస్తున్నాడు. కానీ, తాజా ప్రమోషన్స్‌లో భాగంగా, మరి కొన్ని కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌లో వరుణ్‌ తేజ్‌ మరో డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. అచ్చమైన పల్లెటూరి కుర్రాడిలా కూల్‌ అండ్‌ కామ్‌గా రాముడు మంచి బాలుడు అనేలా కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చాలా బాగుంది. పూజా హెగ్దే కూడా లంగా వోణీలు, రెండు జడలతో అసలు సిసలు పదహారణాల పల్లెటూరి పడుచు పిల్లను తలపిస్తోంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై లుక్స్‌ పరంగా మంచి అంచనాలున్నాయి. ఆల్రెడీ తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'జిగర్తాండ'కు రీమేక్‌ కాబట్టి, సక్సెస్‌పై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు చిత్ర యూనిట్‌. మరి వారి కాన్ఫిడెన్స్‌ నిజమవుతుందా.?  ఆశించిన రిజల్ట్‌ అందుకుంటారా.? లేదా.? అని తెలియాలంటే సెప్టెంబర్‌ 20 వరకూ ఆగాల్సిందే. ఈ సినిమాలో తమిళ హీరో అధర్వ మురళి మరో కీలక పాత్రలో కనిస్తున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
churaka