హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కి ఈ మధ్య లక్కు కలిసి రావడం లేదు. మొదట్లో ఫుల్ జోష్ మీదున్న రాజ్‌తరుణ్ కెరీర్ ఇప్పుడు చాలా స్లో అయిపోయింది. ప్రస్తుతం 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాలో నటిస్తున్నాడు రాజ్‌తరుణ్. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, తాజాగా మరో సినిమాని ఓకే చేశాడు. ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం నితిన్‌తో 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమా తెరకెక్కించిన కొండా విజయ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 'కళ్యాణ వైభోగమే' ఫేమ్ మాళవికా నాయర్, రాజ్‌తరుణ్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. అన్నింటికీ మించి ఈ సినిమాకి భలే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.
'ఒరేయ్ బుజ్జిగా..' అనే టైటిల్‌ని ఈ సినిమాకి కన్‌ఫామ్ చేశారు. టైటిల్ చూస్తుంటే, సినిమా రాజ్‌తరుణ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందని అర్ధమవుతోంది. సీనియర్ నటి వాణీ విశ్వనాధ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 10 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సో ప్రజెంట్ రాజ్‌తరుణ్ చేతిలో రెండు సినిమాలున్నట్లే. ఇటీవల కారు యాక్సిడెంట్ విషయమై రాజ్‌తరుణ్ వివాదాల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆ వివాదాల నుండి రిలీఫ్ అయ్యి, కూల్ అండ్ కామ్‌గా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయాడు మన 'బుజ్జిగాడు'.
|