Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Silence 'gone jijamma.!

ఈ సంచికలో >> సినిమా >>

వాల్మీకి': వరుణ్‌ తేజ్‌ విశ్వరూపం

Valmiki: Varun Tej

ఓ సామాన్య వ్యక్తి ఋషిగా ఎలా మారాడు అన్నదే వాల్మీకి కథ. ఆ వాల్మీకి పేరునే తన సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని సినిమా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ లేటెస్ట్‌గా రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌లో వరుణ్‌ తేజ్‌ రూపం, విశ్వరూపమే. నటన న భూతో న భవిష్యతి. ట్రైలర్‌ చూసిన ప్రేక్షకులకు మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. అనే రెస్పాన్స్‌ తప్ప మరోటి రావడం లేదు. హరీష్‌ శంకర్‌కి 'గబ్బర్‌ సింగ్‌' తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ దక్కలేదు. 'వాల్మీకి' ట్రైలర్‌ చూస్తుంటే, ఆ రేంజ్‌ హిట్‌ని హరీష్‌ శంకర్‌ తన పాకెట్‌లో వేసేసుకున్నట్లే అనిపిస్తోంది. గబ్బర్‌ సింగ్‌ ఫ్లేవర్‌ బాగా కనిపిస్తోంది సినిమాలో. రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తున్నాడు. అన్నట్లు మన సినిమా టైటిలే 'వాల్మీకి'. హీరో పేరు 'వాల్మీకి' కాదు.

హీరో పేరేంటనే కదా మీ అనుమానం. 'గద్దలకొండ గణేష్‌'. ఈ గద్దల కొండ గణేష్‌ అస్సలు తక్కువోడు కాదు. వీడితో పెట్టుకున్నారా.. అంతే సంగతి గజ..గజ..గజలాడించేస్తాడంతే. ఇక హీరోయిన్‌గా పూజా హెగ్దే పాత్ర సింపుల్‌గా నీట్‌గా కనిపిస్తోంది. మరో హీరోయిన్‌ మృణాళిని, సినిమాలో కీలక పాత్రధారి అయిన అధర్వ మురళికి జోడీగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
'Big' fight in Big House