Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Orey Buzziga ..' Rajtarun

ఈ సంచికలో >> సినిమా >>

సైలెన్స్‌' వీడిన జేజమ్మ.!

Silence 'gone jijamma.!

జేజమ్మ అనుష్క ప్రస్తుతం 'సైలెన్స్‌' అనే బైలింగ్వల్‌ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదో డిఫరెంట్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ మూవీ. అనుష్క పాత్ర చాలా కొత్తగా ఉంటుందనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఇకపై తెర పడింది. ఈ సినిమాలో అనుష్క లుక్‌ని రివీల్‌ చేసింది చిత్ర యూనిట్‌. షార్ట్‌ హెయిర్‌ స్టైల్‌లో ప్లెజెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపిస్తున్న అనుష్క ఓ చిత్రకారిణి. బొమ్మలు గీస్తూ కనిపించింది. అయితే, ఆమె మాట్లాడలేదు. అంటే మ్యూట్‌ ఆర్టిస్ట్‌ అన్న మాట. తాను మాట్లాడలేదు. కానీ, తన మనసులోని భావాన్ని చిత్రాల ద్వారా సుస్పష్టంగా చూపించగల ప్రతిభ ఉంది. ఆమె పాత్ర చిత్రీకరణతోనే ఈ సినిమాలో అనుష్క పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. ఇక సినిమా విషయానికి వస్తే, ఎలాంటి బొమ్మనైనా అవలీలగా వేసేసే అనుష్క విపరీతమైన సమస్యల్లో ఇరుక్కోవల్సి వస్తుందట.

ఆ సమస్య ఏంటీ.? ఆ సమస్య నుండి మూగదైన అనుష్క ఎలా తప్పించుకుంది.? అనేదే సినిమా కథ. ఎక్కువ భాగం ఈ సినిమా షూటింగ్‌ అమెరికాలోనే జరిగింది. నిర్మాణ పరంగా సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారట. ఇంగ్లీష్‌తో పాటు, తెలుగు, తమిళ తదితర నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలవుతుండడం విశేషం. మాధవన్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కథకి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్‌ తెలియాలంటే, టీజర్‌ రావాల్సిందే. త్వరలోనే టీజర్‌ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
Valmiki: Varun Tej