Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naneelu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

సినిమా థియేటర్లకి వెళ్ళి , గుండెలు బేజారిత్తే అదేదో Dolby Sound  తో హింసించబడకుండా, టీవీ ల్లో మాయదారి యాడ్లు భరించకుండా, సినిమాలు హాయిగా కంప్యూటర్ లోనే చూసే సదుపాయం ధర్మమా అని, డబ్బులుకి డబ్బులూ, ప్రశాంతతకి ప్రశాంతా అందుబాటులోకి రావడం మాత్రం చాలా బావుంది. కొంతమంది అనొచ్చు—అదేదో బిగ్ స్క్రీన్  మీద చూసినప్పుడే పూర్తిగా ఆస్వాదించొచ్చూ.. కంప్యూటర్ లో చూస్తే మజా ఏమిటీ అని… ఎవరిష్తం వాళ్ళదీ.. ఇదివరకటి రోజుల్లో సినిమాలు శతదినోత్సవాలు చేసుకునేవి, కొన్నైతే సిల్వర్ జూబిలీలు కూడా.. ఇప్పుడో మహా అయితే ఓ వారం పదిరోజులు..

ఎలాగూ టీవీలో ఏదో ఒక చానెల్ లో వచ్చేస్తుందీ త్వరలో, అనుకుని దానికే సెటిలైపోయారు కొందరు. అదీ కొంతవరకూ పరవాలేదు, కానీ ఓ 45 నిముషాలు దిక్కుమాలిన ప్రకటనలు భరించాలి.. రెండుమూడేళ్ళ క్రితం వరకూ అలాగే ఉండేది… కానీ  కొంతకాలం క్రితం రంగంలోకి వచ్చిన  Netflix, Amazon,  Eros Now, ZEE 5, HOTSTAR  etc..  ధర్మమా అని, టీవీ చానెళ్ళ హింస తగ్గింది. అన్ని భాషల్లో సినిమాలూ హాయిగా చూడొచ్చు. వివిధ భాషల్లో వచ్చే సీరియళ్ళ బాధ మాత్రం వదల్లేదు.. జీడిపాకం లా సంవత్సరాలకి సంవత్సరాలు సాగుతూనే ఉంటాయి. వీటన్నిటినీ  entertainment  పేరుతో మన నెత్తిమీద రుద్దుతున్నారు. ఆమధ్య ఎప్పుడో  TRAI  వాళ్ళు, మనకి కావాల్సిన చానెళ్ళకి మాత్రమే డబ్బు కట్టేట్లా అదేదో చేసారు.. అలాగని  చానెళ్ళలో అస్సలు మంచి కార్యక్రమాలు లేవనీ కాదూ.. ప్రతీ చానెలూ ఉంచుకుంటే డబ్బులవుతాయే… పైగా వీటికి అదేదో  SD, HD  చానెళ్ళుట.. ఒకదాంట్లో వచ్చింది రెండో దాంట్లో రాదూ… ఏమిటో అంతా గందరగోళం.

కొత్తగా రంగంలోకి వచ్చిన ఎమజాన్, నెట్ ఫ్లిక్స్  లలో మొదటిది చవకే, కానీ రెండోది మాత్రం ఖరీదే.. సినిమాల విషయం ఎలా ఉన్నా, వాళ్ళు నిర్మించే  Webseries ,  చాలా పాప్యులర్ అయిపొయాయి. పైగా వీటిలో నటించే నటులు కూడా కొత్తవారు—మీడియా ధర్మమా అని సెలెబ్రెటీస్ గా మారిన రకాలు కాదు. తమ నటనా కౌశలాన్ని వ్యక్తపరుస్తున్నారు… ఇలాటి వారిని మీడియా పట్టించుకోదుగా.. కానీ, కొద్దిగా వీటికి కూడా, సెన్సారింగ్ లాటిదుంటే బావుంటుందేమో అనిపిస్తూంటుంది..  అందులో చూపించే దృశ్యాలూ, మాట్టాడే భాషా , ఫామిలీ తో కలిసి చూడ్డానికి అంత బావుండడం లేదు. కానీ వాటిలో  content, action మాత్రం చాలా professional  గా ఉంటున్నాయి. కొత్త సినిమాలు కూడా చాలా తొందరగానే వస్తూన్నాయి. పైగా   ఎటువంటి పబ్లిసిటీలూ లేని కొన్ని మంచి సినిమాలు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి.

వీటికి సాయం, కొత్తసినిమాలు  రిలీజైన రోజునే చూసే అదృష్టం కూడా ఉంటోంది, కొన్ని సైట్లలో… వీటివల్ల సినీనిర్మాతలు నష్టపోతున్నామని గొడవైతే చేస్తున్నారనుకోండి, కానీ వాటిని నియంత్రించలేక పోతున్నారు.

మల్టి ప్లెక్స్ లు వచ్చి, సింగిల్ స్క్రీన్ థియేటర్ల నోట్లో మట్టి కొట్టినట్టే, ఈ కొత్తగా వచ్చిన అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఈరోస్ లాటివి, మల్టిప్లెక్స్ ల ప్రాణానికి వచ్చాయి. చూడాలి ఎంతదాకా వెళ్తుందో ఈ వ్యవహారం. జియో ఫైబర్ వాళ్ళైతే మరో అడుగు ముందుకు వేసారు… రీకీజైన రోజునే కొత్త సినిమాలు టీవీ లో చూడొచ్చని.. పైగా అదేమీ పైరసీ కూడా కాదుట. మొత్తానికి టెక్నాలజీ ధర్మమా అని, సినిమా నిర్మాతలు కూడా , మరీ కోట్ల లోకాకుండా, తక్కువఖర్చులో సినిమాలు తీయగలిగితే, అందరూ సుఖపడతారేమో కదూ…

వెబ్ సీరీస్ లో మరో సద్గుణం ఏమిటంటే, ఓ పది ఎపిసోడ్లతో సీజన్ ముగించడం.. కావాల్సొస్తే మరో సీజన్ మొదలెట్టడం. దీనివలన జీడిపాకం టీవీ సీరియల్స్ బెడద తప్పింది.

మొత్తానికి టీవీ సీరియల్స్ లో కూడా సంస్కరణలు మొదల్య్యాయని ఆశిద్దాం …

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu