Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
smart..ismart... too smart

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాట్‌ ఈజ్‌ దిస్‌ 'బ్రేకప్‌' ఢీ.! - ..

what  is this break up dhee

ఏంట్రా లవ్‌లో పడ్డావా.? యస్‌ యస్‌ ఐయామ్‌ ఇన్‌ లవ్‌.. అంటూ సిగ్గుపడుతూ చెప్పే రోజులు పోయాయి. ఏంట్రా బ్రేకప్‌లో ఉన్నావా.? అంటే యస్‌ యస్‌ ఐయామ్‌ ఇన్‌ బ్రేకప్‌రే.. అని స్టైలిష్‌గా చెప్పేసే రోజులొచ్చాయి. అవునండీ, ఒకప్పుడు లవ్‌లో పడడాన్ని ఓ కొత్త అనుభూతిగా ఫీలయ్యేవారు యూత్‌. కానీ, ఇప్పుడు 'బ్రేకప్‌'ని చాలా కొత్తగా ఫీలవుతున్నారు. ఏకంగా బ్రేకప్‌ కోసం సెలబ్రేషన్స్‌ కూడా  చేసుకుంటున్నా రంటేనే  పరిస్థితి ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఈ ఫీలింగ్‌ని అనుభవించాలనుకుంటున్న వారిలో అతీతులు కారు. పెరిగిపోయిన నాగరికత, విచ్చలవిడితనం ఇలాంటి పాశ్చాత్య సాంప్రదాయాల్ని ఈజీగా ఆకళింపు చేసేసుకుం టున్నాయి.  మంచి అలవడాలంటే చాలా టైం పడుతుంది. కానీ, చెడు తొందరగా ఆవహించేస్తుందని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. అలా కొత్తగా దాపురించిన ఈ 'బ్రేకప్‌' జాడ్యం యువతను నిర్వీర్యం చేసేస్తోంది. లవ్‌లో ఫెయిలైతే, ఇక అంతే దేవదాస్‌లా మారిపోవడమే.. ఇది ఒకప్పుడు. కానీ, ఇప్పుడు బ్రేకప్‌ చేసుకుని ఆ ఫీల్‌ని ఎంతో ఫ్రెష్‌గా ఇంకెంతో జాయ్‌ఫుల్‌గా ఫీలవుతున్నారు. ఫ్రెండ్స్‌ని పిలిచి బ్రేకప్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నాళ్లు కలిసి మెలిసి తిరిగి, పబ్బులు, పార్టీలు అంటూ ఎంజాయ్‌ చేసి, ఇంకాస్త శృతిమించి డేటింగ్స్‌ దాకా చేరుకున్న ఓ జంట బ్రేకప్‌ని ఇంత సులువుగా చూజ్‌ చేసేసుకోవడం నిజంగా మింగుడు కాని అంశం. లవ్‌లో పడడం, కొన్నాళ్లు కలిసి తిరగడం ద్వారా, వారిద్దరూ ఒకరికొకరు అర్ధం చేసుకోవడం, అన్నీ కుదిరితే, పెళ్లి పీటలదాకా చేరడం.. చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని జీవితాంతం ప్రేమించుకోవడం అనే సాంప్రదాయానికి నేటి యువత చెల్లు చీటీ పడేసింది. యువత అంటే అందరూ అని చెప్పలేం కానీ, చాలా ఎక్కువ మందినే ఈ జాడ్యం అంటేసింది. ముఖ్యంగా ఈ మాయదారి సాంప్రదాయానికి అంకురార్పణ చేసింది మాత్రం మన ప్రియమైన సెలబ్రిటీలే అని చెప్పాలి. ఈ బ్రేకప్‌ లవ్స్‌తో సెలబ్రిటీలు సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నారు.?

సెలబ్రిటీల నుండి ఫ్యాషన్‌నీ, స్టైల్‌నీ మాత్రమే ఇమిటేట్‌ చేయడంతో ఆగడం లేదు సొసైటీ. ఇలాంటి కొత్త కొత్త సాంప్రదాయాల్లోని రుచిని కూడా ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దాంతో ఈ సమాజం ఎక్కడికి పోతుంది.? పీటల దాకా వెళ్లిన పెళ్లి ఆగిపోయిందంటే, దానికి సవాలక్ష కారణాలు. కానీ, నిన్నటి వరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి, ఈ రోజు సింపుల్‌గా బ్రేకప్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఓ మెసేజ్‌ పడేస్తున్నారు. అంతే, అది తీసుకుని, నెటిజన్లు నచ్చినట్లు వార్తల మీద వార్తలు రాసుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇదేనా జీవితమంటే. ఆ తర్వాత కెరీర్‌ ఉంటే, అక్కడ బిజీ అయిపోతున్నారు. లేదా, మరో బాయ్‌ఫ్రెండ్‌తో కొత్త రిలేషన్‌ షిప్‌కి వెల్‌కమ్‌ చెప్పేస్తున్నారు. రీసెంట్‌గా ఇలియానా, శృతిహాసన్‌ వంటి ముద్దుగుమ్మలు తమ ప్రియులకు ఇలాగే బ్రేకప్‌ చెప్పేశారు. వారిని ఆదర్శంగా తీసుకున్న యువత కూడా ఇదే తీరులో పయనిస్తూ, చెడు బాట పడుతోంది. ఈ కొత్త ఒరవడిని అడ్డు కట్ట వేయడం ఎలా.? ఈ కొత్త ట్రెండ్‌కి చరమ గీతం పాడాలంటే, ఉన్నంతలో తల్లి తండ్రులు, తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించడం తప్ప మరో మార్గం లేదు. ఇక మిగిలిన ఒకే ఒక్క మార్గం సవ్యమైన మార్గం.. స్వతహాగా యువత ఈ విషయంలో కొంత విచక్షణతో వ్యవహరించాల్సిన ఆవశ్యకతను పెంపొందించుకోవడమే. యువత తలచుకుంటే సాధించలేనిది ఏముంది చెప్పండి.

మరిన్ని శీర్షికలు
naneelu