Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు` - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈవారం ( 11/10-17/10 ) మహానుభావులు

జయంతులు

అక్టోబర్ 11
శ్రీ వడ్డె రమేష్ : వీరు అక్టోబర్ 11, 1947 న యలమర్రు లో జన్మించారు. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత.  ఆయన తెలుగులో నిర్మించిన తొలి చిత్రం పాడవోయి భారతీయుడా. అలాగే హిందీలో తొలి చిత్రం 'సున్హేరా సంసార్' నిర్మించారు.ఆయన నిర్మించిన బొబ్బిలిపులి చిత్రం తెలుగు నాట ఘన విజయం సాధించింది. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే రమేశ్ నిర్మించిన అనేక చిత్రాలు విశేషాదరణను చూరగొన్నాయి...

అక్టోబర్ 13
డాక్టర్. కాసరనేని సదాశివ రావు :  వీరు అక్టోబర్ 13, 1923 న రామచంద్రపాలెం లో జన్మించారు. దాదాపు అర్ధ శతాబ్దం పాటు వైద్యవృత్తిలో కొనసాగారు. మంచి హస్తవాసిగల డాక్టరుగా పేరు తెచ్చుకొన్న సదాశివరావు పేద ప్రజల పట్ల ఉదారంగా వ్యవహరించేవాడు. వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవారు

శ్రీ చిట్టిబాబు :  వీరు అక్టోబర్ 13,  1936 న కాకినాడ లో జన్మించారు.  ప్రముఖ వీణా వాద్యకళాకారుడు.. కర్ణాటక సంగీత సంగీతజ్ఞులలో చెప్పుకోదగ్గవారిలో వీరొకరు. తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరితార్థుడు కావడం. వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డారు. ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీతకళాజగతిలో సుస్థిరస్థానాన్ని పొందారు. ఆయన 'కోయిలా గీతావిన్యాసం తప్పక చెప్పుకునే అంశం. ఆయన వీణా వాదన విన్యాస కళపై లఘుచిత్రం 'కళాకోయిలా అన్నది కూడా మరువలేని సాక్ష్యం కొన్ని చిత్రాలకు చిట్టిబాబు సంగీత దర్శకత్వం కూడా వహించడం విశేషం.

అక్టోబర్ 14
డాక్టర్. సూరి భగవంతం :  వీరు అక్టోబర్ 14, 1908 న అగిరిపల్లి లో జన్మించారు. ప్రముఖ శాస్త్రవేత్త. దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. వీరు డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ.) అధిపతిగా చేరి ఎంతో ప్రగతి సాధించారు. భారతదేశమంతా ఇరవైకి పైగా ప్రయోగశాలలను ప్రారంభించి యుద్ధ రంగానికి అవసరమైన క్షిపణులు, విమానాలు, ట్యాంకులు, రాడార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన అనేక విషయాలలో విజయం సాధించారు.

అక్టోబర్ 17
శ్రీ చిలుకూరి వీరభద్రరావు : వీరు అక్టోబర్ 17, 1872 న రేలంగి లో జన్మించారు. పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. 1909-1912 మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల ఆంధ్రుల చరిత్ర రచించారు.


వర్ధంతులు
అక్టోబర్ 12
శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు :   ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. ఆయన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో  నిష్ణాతులు. . తెలుగు కథానిక మీద పరిశోధన చేసేరు. అనేక కథానికలు వివిధ పత్రికలలో ప్రచురించబడినాయి. సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి.
వీరు అక్టోబర్ 12, 2012 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 14
శ్రీ జాలాది రాజారావు :  ప్రముఖ తెలుగు రచయిత. ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించారు. ఈయన పలు సాంఘిక నాటకాలు రచించారు. 1000 దాకా కవితలు రాశారు. కనులు తెరిస్తే ఉయ్యాల ... కనులు మూస్తే మొయ్యాల అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పిన కవి. వీరు అక్టోబర్ 14, 2011 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 15
శ్రీ నిడదవోలు వేంకటరావు :  సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. సాహిత్య విమర్శకులు, ప్రాచీన గ్రంథ పరిష్కర్త, అసాధారణ పరిశోధకులు.  ‘తెలుగు కవుల జీవితలు’ ‘తెలుగు సాహిత్యం లో దాక్షిణాత్య సంప్రతయము’ ఇంగ్లీష్ అనువాద వివరణలతో కూడిన 32 తెలుగు గద్య పద్య శాసనాలు, ద్రావిడ భాషలు తారతమ్యాలను గురించిన్ సంపుటాలలో తెలుగుకు సంబంధిచిన సంపుటం “  వీరి ప్రముఖ రచనలు.
వీరు అక్టోబర్ 15, 1982 న స్వర్గస్థులయారు.

2. శ్రీమతి తురగా జానకీరాణి :  రేడియో లో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేసి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించారు. వీరు అక్టోబర్ 15, 2014 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
karnataka  viharayatralu