Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
nathalia kaur

ఈ సంచికలో >> సినిమా >>

హీరో అండ్‌ విలన్‌ రాణా

Raana as Hero and Villain

‘లీడర్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన దగ్గుబాటి వారబ్బాయి రాణా, చాలామంది హీరోల్లా కేవలం హీరో పాత్రలకే పరిమితం కాలేదు. నాయక, ప్రతినాయక పాత్రలేవైనా చేస్తానని అంటున్న రాణా, అన్న మాట ప్రకారం ‘బాహుబలి’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లోకి ఎంటరైపోయాడు.


ప్రభాస్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రాణా పాత్ర అదరహో అనే రేంజ్‌లో వుండబోతోందట. మాంఛి హైటూ, దానికి తగ్గ పర్సనాలిటీ ప్రభాస్‌ సొంతం. ప్రభాస్‌కి పోటీగా.. నెగెటివ్‌ రోల్‌లో ప్రభాస్‌తో తలపడే రాణా కూడా తన బీభత్సమైన ఫిజిక్‌ని ఈ సినిమాలో ప్రదర్శించబోతున్నాడు.


ఇద్దరూ తెరపై తలపడ్తోంటే.. చూసే ప్రేక్షకులు విస్మయానికి గురవ్వాల్సిందే. విలన్‌గా ‘బాహుబలి’లో కన్పిస్తున్న రాణా, గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’లో పాజిటివ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు అనుష్కకి జోడీగా. విశేషమేంటంటే, ‘బాహుబలి’లో అనుష్క కూడా నటిస్తోంది. అంటే, ఆ సినిమాలో హీరోయిన్‌ని వేధించి, ‘రుద్రమదేవి’లో అదే హీరోయిన్‌ అనుష్కని ప్రేమించే పాత్రలో రాణా కన్పించబోతున్నాడన్నమాట.
రెండు పాత్రలూ వేర్వేరు.. రెండూ ప్రతిష్టాత్మకమైన చిత్రాలు.. ఒకదాంట్లో విలన్‌, ఇంకోదాంట్లో హీరో.. ఈ వేరియేషన్‌తో రాణా ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటాడో!

మరిన్ని సినిమా కబుర్లు
Junior NTR Likes Music