Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Junior NTR Likes Music

ఈ సంచికలో >> సినిమా >>

100 కోట్లు ఖర్చు సమంజసమేనా?

Baahubali - 100 Crores Budget

తెలుగు సినిమా రేంజ్‌ ఎంత.? ‘మగధీర’ సినిమా డెబ్భయ్‌ కోట్లు దాటి వసూలు చేస్తే, దాన్ని ఇప్పటిదాకా ఇంకో సినిమా టచ్‌ చేయలేదు. రాజమౌళి డైరెక్షన్‌, మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ హీరోగా నటించడం, ఆ సినిమాలోని కంటెంట్‌.. సినిమాని అల్లు అరవింద్‌ నిర్మించడం.. ఇవన్నీ ఆ సినిమాని ఆ స్థాయిలో నిలబెట్టాయి.


సో, యాభై కోట్లు ఖర్చుపెట్టి లాభాలు ఆశించడమంటే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు అత్యాశే అని చెప్పుకోవాల్సి వుంటుంది. ఇటీవలి కాలంలో వచ్చిన భారీ సినిమాలు సక్సెస్‌ అయినా నిర్మాతలకు కాసులు మిగల్చని పరిస్థితి వుంది మరి.


కానీ, ‘బాహుబలి’ సినిమాని 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారన్న వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఒకరకంగా రిస్క్‌ అనే చెప్పొచ్చు. అయితే ప్రభాస్‌ మార్కెట్‌,రాజమౌళి బ్రాండ్‌.. ఇవన్నీ వర్కవుట్‌ అయితే 100 కోట్లు పెద్ద ఇబ్బందేమీ కాకపోవచ్చు నిర్మాతకి.


ఇప్పుడున్న పరిస్థితులకైతే ఎంత రాజమౌళి బ్రాండ్‌ వున్నా 100 కోట్లు ఖర్చు చేయడం చాలా రిస్క్‌. టిక్కెట్‌ రేట్లు పెరగడం కొంత ఊరటగానే చెప్పొచ్చేమో. తెలుగు,తమిళ, హిందీ సినీ పరిశ్రమల్ని టార్గెట్‌ చేస్తోన్న రాజమౌళి, ప్రీ రిలీజ్‌ హైప్‌ ఏ రేంజ్‌లో తీసుకురాగలుగుతారన్నదానిపైనే సినిమా భవిష్యత్‌ ఆధారపడి వుంటుంది.
ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, మ్యూజిక్‌.. ఇవన్నీ కలిసొస్తే, 100 కోట్లు ఖర్చు చేసేయొచ్చు నిర్భయంగా.

మరిన్ని సినిమా కబుర్లు
mm sreelekha proud of telugu people