Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sandeep kishan in&as

ఈ సంచికలో >> సినిమా >>

చీరలో అందం వెతుకుతున్న సన్నీలియోన్‌

sunny leone with saree
గతంలో పోర్న్‌ సినిమాల్లో నటించడంతో సన్నీలియోన్‌ అంటే ఒకరకమైన నెగెటివ్‌ అభిప్రాయం ఇప్పటికీ పోలేదు. ఎవరేమనుకున్నా నటిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకుంటాను అనే ఖచ్చితమైన కాన్ఫిడెన్స్‌తో సన్నీలియోన్‌ హిందీ సినిమాల్లో నటిస్తోంది. మొదట్లో అన్నీ ఆమె అందాల ప్రదర్శన కోసమే అనేట్లుగా సినిమాలు వచ్చాయి. నటిగా స్థిరపడటానికి అవి చేయాల్సి వచ్చిందని సన్నీలియోన్‌ అభిప్రాయపడుతూ వచ్చింది.

నటిగా స్థిరపడ్డాక వెరైటీ పాత్రల వైపు ఆలోచన చేస్తుంది సన్నీలియోన్‌. హిందీలోనే కాకుండా, మలయాళ సినిమాల్లోనూ, తమిళం, కన్నడ సినిమాలతోపాటుగా తెలుగులోనూ నటించడానికి సిద్ధపడుతోంది ఆమె. గ్లామరస్‌ పాత్రలు మాత్రమే అంటే చెయ్యను, కొంచెం నటనకు అవకాశం ఉండేలా అయితే కథలు వినిపించండి అని షరతుల్ని సన్నీలియోన్‌ పెడుతోన్నదంట.

సన్నీలియోన్‌ గ్లామర్‌ని క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్న నిర్మాతలు, అందాల ప్రదర్శనకు ఆమె నో చెప్పడంతో నిరాశ చెందుతోంది. గ్లామర్‌ అంటే పూర్తిగా చీరకట్టులో కూడా చూడొచ్చు.. అని చెబుతూ, ఓ పాప్‌ సాంగ్‌లో చీరతో గ్లామరస్‌గా కనిపించిన విధానాన్ని వివరిస్తోంది. భారతీయత అంతా చీరకట్టులోనే కనిపిస్తుందనీ, చీరకట్టు వల్ల భారతీయ మహిళ అందం రెట్టింపు అవుతుందని అందులోని అందాన్ని గొప్పగొప్పగా అభివర్ణిస్తుంది ఈ అందాల భామ.
మరిన్ని సినిమా కబుర్లు
gun in beauty hands