Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
demand for the laila

ఈ సంచికలో >> సినిమా >>

Happy Deepavali

40 ప్లస్‌ ‘గోవిందుడు..’

40 plus govindudu

‘మగధీర’ తర్వాత చరణ్‌ చేసిన సినిమాల్లో ఒక్క ‘ఆరెంజ్‌’ తప్ప అన్నీ 40 కోట్లు దాటి వసూలు చేసినవే. ఆ లిస్ట్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ కూడా చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను బీభత్సం కొంతవరకు ఇబ్బంది పెట్టినా, సులువుగానే చరణ్‌ తన తాజా సినిమాతో 40 కోట్ల మైలు రాయిని మరోసారి దాటేసి తనకే సాధ్యమైన స్పెషల్‌ రికార్డ్‌ నెలకొల్పాడు. ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌ కెరీర్‌లో ‘ఆరెంజ్‌’ ఒక్కటే ఆశించిన విజయాన్నివ్వలేదు. ‘మగధీర’ ఇండస్ట్రీ రికార్డ్‌ కాగా, ‘రచ్చ’, ‘నాయక్‌’, ‘ఎవడు’ సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించాయి. డిఫరెంట్‌ జోనర్‌లో చేసిన ‘ఆరెంజ్‌’ అంచనాల్ని అందుకోలేకపోయింది. ‘మగధీర’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘ఆరెంజ్‌’ అంచనాలు అందుకోవడంలో బోల్తా పడింది.

కృష్ణవంశీ, చరణ్‌ కమర్షియల్‌ మార్కెట్‌ గురించి ఆలోచించకుండా ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించి చరణ్‌తో హిట్‌ కొట్టడం అభినందించదగ్గదే. కమర్షియల్‌ కోణంలో సినిమా చేయలేదని చెప్పిన చరణ్‌, విడుదలకు ముందే సినిమా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. చరణ్‌ జడ్జ్‌మెంట్‌ నిజమయ్యింది. చరణ్‌ ఖాతాలో మరో హిట్‌ వచ్చింది. చరణ్‌ ఏ సినిమా చేసినా ఫార్టీ ప్లస్‌ క్రోర్స్‌ మినిమమ్‌.. అనే నమ్మకాన్ని ‘గోవిందుడు అందరివాడేలే’ నిలబెట్టింది.

మరిన్ని సినిమా కబుర్లు
stars moved for