Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

Happy Deepavali

చిత్రసమీక్ష : ఒక లైలా కోసం

Movie Review - Oka Laila Kosam

చిత్రం: ఒక లైలా కోసం
తారాగణం: నాగచైతన్య, పూజా హెగ్దే, అలీ, సుమన్‌, షయాజీ షిండే, రోహిణి, మధు, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, పోసాని కృష్ణమురళి తదితరులు.
చాయాగ్రహణం: ఆండ్రూ
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్‌
దర్శకత్వం: విజయ్‌ కుమార్‌ కొండా
నిర్మాత: అక్కినేని నాగార్జున
విడుదల తేదీ: 17 అక్టోబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
గోల్డ్‌ మెడల్‌ సాధించిన మెరిట్‌ స్టూడెంట్‌ కార్తీక్‌ (నాగచైతన్య), చదువు పూర్తయ్యాక ఓ ఏడాదిపాటు ఎంజాయ్‌ చెయ్యాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి నందు (పూజ) పరిచయమవుతుంది. అయితే నందు, కార్తీక్‌ని అపార్థం చేసుకుంటుంది. అనుకోకుండా కార్తీక్‌, నందులకు పెళ్ళి ఫిక్స్‌ అవుతుంది. తాను ధ్వేషించే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి చేసుకోకూడదుకుంటుంది నందు. ప్రేమించిన నందునే పెళ్ళాడాలనుకుంటాడు కార్తీక్‌. కార్తీక్‌, నందు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారా? నందు, కార్తీక్‌పై పెంచుకున్న ధ్వేషం తగ్గుతుందా? తానేంటో నందుకి కార్తీక్‌ చెప్పుకుని తన క్లీన్‌ ఇమేజ్‌ని కార్తీక్‌ నిరూపించుకున్నాడా? అన్నవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
సరదా సరదా సన్నివేశాల్లో నాగచైతన్య బాగా రాణించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కొంచెం డల్‌ అయ్యాడనిపిస్తుందిగానీ ఓవరాల్‌గా సినిమాలోని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడతడు. లవ్‌ స్టోరీస్‌ చేసేటప్పుడు డిఫరెంట్‌ లుక్‌తో కన్పిస్తున్న నాగచైతన్య, అదే ప్రత్యేకతను ఈ సినిమాలోనూ చాటుకున్నాడు. పూజా హెగ్దే క్యూట్‌గా, అందంగా వుంది. సహజమైన అందం ఆమె సొంతం. నటన పరంగానూ ఆకట్టుకుంది. మంచి ఫ్యూచర్ వుందామెకు అన్పిస్తుంది ఆమెను చూడగానే. అలీ బాగా నవ్వించాడు. సుమన్‌, షయాజీ షిండే, రోమిని మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పరిధి మేర నటించారు.

బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావుంది. పాటలు బాగానే వున్నాయి. ఎడిటింగ్‌ సెకెండాఫ్‌లో ఇంకాస్త బాగుండి వుండాల్సింది. ఫస్టాఫ్‌ వరకూ ఎడిటింగ్‌ ఓకే. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమాని రిచ్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ పనితనాన్ని అభినందించాల్సిందే. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి సహజత్వాన్ని తెచ్చాయి.

రొమాంటిక్‌ స్టోరీ లైన్‌ ఎంచుకున్న దర్శకుడు, కథనం విషయంలోనూ జాగ్రత్తగా డీల్‌ చేశాడు. అయితే ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆకట్టుకుంటుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ ఫస్టాఫ్‌కి బాగా కుదిరాయి. సెకెండాఫ్‌ మాత్రం కొంచెం డల్‌గా సాగుతుంది. ఎమోషనల్‌ సీన్స్‌ డామినేట్‌ చేశాయి సెకెండాఫ్‌లో. అయినప్పటికీ యూత్‌ని మెచ్చే చిత్రంగానే సినిమాని ఓవరాల్‌గా చూడొచ్చు. ఈ తరహా సినిమాకి రాజపోషకులు యూత్‌ గనుక, యూత్‌ని మెచ్చేలా సినిమా వుంది గనుక, బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా మంచి విజయాన్నే అందుకునే అవకాశాలున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే : ఈ లైలా.. యూత్‌ని మెప్పిస్తుంది.

అంకెల్లో చెప్పాలంటే : 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with naga chaitanya