Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
no rush forglamour

ఈ సంచికలో >> సినిమా >>

Happy Deepavali

శృతిహాసన్‌ గుడ్‌ డెసిషన్‌

srutihasan good decision

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌. తమిళ, తెలుగు సినిమాలనే కాదు, చాలా భాషల్లోని సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన ఘనుడాయన. నటనలో మేటి. తనకు తానే సాటి అనిపించుకున్న కమల్‌హాసన్‌ కుమార్తె శృతిహాసన్‌ కూడా నటనలో తక్కువేం కాదు. కాని శృతిహాసన్‌ పెర్ఫామెన్స్‌ ప్రదర్శించి నటిగా పేరుతెచ్చుకున్నదానికన్నా, గ్లామరస్‌ నటిగానే ఎక్కువ పేరు సాధించింది.ఎప్పుడూ గ్లామరస్‌ పాత్రలేనా? అని బోర్‌ ఫీలింగ్‌ వచ్చిందో ఏమో శృతిహాసన్‌ మనసు మార్చుకుని, ఇకపై నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించాలనే నిర్ణయానికి వచ్చానంటోంది. గుడ్‌ డెసిషన్‌ అని ఆమెను అభినందించాల్సిందే.

సినిమాలో గ్లామర్‌ తప్పదు కాబట్టి, అప్పుడప్పుడూ గ్లామర్‌ పండిస్తూనే, నటనకు ఎక్కువ ఆస్కారం ఉండే సబ్జెక్ట్స్‌ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తానని శృతి చెప్పింది.కొంచెం గ్లామర్‌ ఎక్కువైందన్న భావన తనకు కూడా కలిగినందున, గ్లామర్‌ డోస్‌ కొంచెం తగ్గించి, పెర్ఫామెన్స్‌ డోస్‌ పెంచుతానంటున్న శృతిహాసన్‌, నటిగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని, నటనలో తండ్రిని మించిన తనయ అనిపించుకోవాలని ఆమెకు బెస్ట్‌ విషెస్‌ అందిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam