Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
natya bharateeyam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం ( ఫిబ్రవరి 20నుండి ఫిబ్రవరి26 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీదబాగుంటుంది గత కొంతకాలంగా అనుకుంటున్నపనులను పూర్తిచేసే అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి అలాగే విదేశీప్రయాణాలు చేయాలనుకొనే వారు కాస్త గట్టిగా ప్రయత్నం చేయుట వలన ఆశించిన ఫలితాలు కలుగుతాయి.  పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయుట  మంచిది. విందులలో పాల్గొంటారు అలాగే శుభాకార్యక్రమాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపించే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది.ధనమునకుసంభందించిన విషయంలోఅనుకోని ఖర్చులకు అవకాశం కలదు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది.

వృషభ రాశి : ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు అలాగే అధికారులతో మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో లేక వృత్తిస్థానంలో నలుగురితో మంచిసంభందాలు కలిగి ఉంటారు. ఆశించిన విధంగా ఫలితాలు రావడం చేత సంతోషాన్ని పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది.  నూతన పనులను చేపట్టుటలో ఆసక్తిని కలిగి ఉంటారు.కుటుంభంలో సంతానం మూలాన సమస్యలు తప్పకపోవచ్చును కొన్ని కొన్ని కటినమైన నిర్ణయాలు తీసుకొనే  అవకాశం ఉంది. కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది సోదరులతో చర్చల్లో పాల్గొంటారు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం వారం చివరలో ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త.  

మిథున రాశి : ఈ వారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాలకు అధిక సమయం ఇచ్చే ఆస్కారం కలదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి చాలావరకు చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోవడం మంచిది. ఆర్థికపరమైన విషయంలో బాగుంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి, వ్యాపారంలో నూతన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టుటకు అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అధికారులతో కలిసి ప్రయత్నం చేసిన ఫలితాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. కుటుంభంలో కొంత వ్యతిరేక వాతావరణం కలిగి ఉండే అవకాశం ఉంది కావున కొంత ఈ విషయంలో నిదానం అవసరం. సమయానికి భోజనం చేయుట నిద్రకు సరైన సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది.   

కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద కుటుంబసభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళుట మంచిది.ఊహించని విధంగా కొన్ని విషయాల్లో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు స్వల్ప సమస్యలు ఎదుర్కొంటారు వీలయితే వాయిదా వేయుట సూచన. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం సూచన.పెద్దలతో కలిసి పనిచేసే సమయంలో చాలావరకు తీసుకొనే నిర్ణయాల విషయంలో నిదానం అవసరం తొందరపాటు వద్దు. ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళండి వివాదాలకు అవకాశం ఇవ్వకండి. స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆక్సరం కలదు కావున తగిన జాగ్రతలు తీసుకోవడం మంచిది. వ్యాపరసంభందమైన విషయల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి గతంలో చేసిన ఆలోచనలకే ప్రాధాన్యం ఇవ్వడం సూచన కొంత వేచిచూసే దొరని అవసరం.     

సింహ రాశి : ఈ వారం మొత్తంమీద నలుగురికి ఉపయోగపడాలనే తలంపును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేయుట మంచిది. ఉద్యోగంలో అధికారులతో మాటపట్టింపులు రావడానికి అవకాశం కలదు కావున సర్దుబాటు అవసరం నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు ఈ విషషయంలో  కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.  స్వల్ప అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంభంలో సర్దుబాటు విధానం అవసరం అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు.

కన్యా రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటవి కాకపోతే వారంచివరలో ఊహించని ఖర్చులు పొందుతారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది మిశ్రమఫలితాలు సూచితం. స్వయంకృతాపరాధం చేసే అవకాశం ఉంది దానిమూలాన నలుగురికి సమధానం చెప్పవలసి రావోచును. ప్రయాణాలకు సమయం ఇస్తారు. నూతన ప్రయత్నాలు చేయునపుడు పెద్దల సూచనలు అలాగే సలహాలను పాటించుట మంచిది. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది అకారణంగా వివాదాలకు మూలకేంద్ర బిందువు మీరే అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను ఎదుర్కొనే అవకాశం కలదు. దైవపూజలకు సమయం ఇవ్వడం అన్నివిధాల మంచిది.

తులా రాశి : ఈ వారం మొత్తంమీద నూతన ఆలోచనలకు దూరంగా ఉండుట సూచన. గతంలో చేపట్టిన పనులను ముందుకు తీసుకు వెళ్ళు [ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయల్లో మిశ్రమఫలితలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. పెద్దల నుండి వచ్చిన సూచనలు,సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు ఊహించని ఇబ్బందులకు అవకాశం కలదు కావున వాటిని వాయిదావేయుట సూచన. మిత్రులతో మాటపట్టింపులకు పోకండి స్వల్ప వివాదాలకు అవకాశం కలదు జాగ్రత్త. కుటుంభసభ్యులతో చర్చలకు అవకాశం ఇవ్వకండి చాలావరకు స్రడుబాటు విధనం మంచిది. దైవసంభందమైన పూజలమూలాన ప్రశాంతత లభిస్తుంది. మీయొక్క మాటతీరు మార్చుకొనే ప్రయత్నం చేయండి.  

వృశ్చిక రాశి  : ఈ వారం మొత్తంమీద ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు అనవసరమైన ఆందోళనలు పొందుతారు. తలపెట్టిన పనులను కాస్తఆలస్యంగా పూర్తిచేసే అవకాశం కలదు కావున ప్రణాళికా బద్దంగా ముందుకువెళ్ళుట మంచిది. సంతానపరమైన విషయల్లో కొంత ఆందోళన తప్పక పోవచ్చును కావున మానసికంగా దృడంగా ఉండుట మంచిది. ఒకవార్త మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది అలాగే, పనులలో శ్రమ తప్పకపోవచ్చును నిదానంగా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన.తలపెట్టిన పనులను వారం చివరలో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంటుంది. కుటుంభంలో ఊహించని దానికన్నా అధికమైన సహాకారం లభించే అవకాశం కలదు. దైవసంభందమైన పూజలకు సమయం ఇస్తారు వాటికి సమయాన్నిఇస్తారు. అనారోగ్యసమస్యలు కలుగుతాయి జాగ్రత్త. 

   ధనస్సు రాశి  : ఈ వారం మొత్తంమీద నూతన అర్తిపరమైన ప్రయత్నాలు మొదలు పెడతారు. తలపెట్టిన పనుల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.  కుటుంభంలో స్వల్ప మార్పులు కలుగుటకు అవకాశం ఉంది .ఉద్యోగంలో అధికారులతో గుర్తింపును పొందుతారు వారికి అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు అలాగే వారితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు కొన్ని కొని విషయాల్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది దానిమూలాన ఒత్తిడిని పొందుతారు. కుటుంభంలో తల్లితరుపు బంధువులతో చర్చలు చేస్తారు వారిప్రయాణాల గురుంచి మీరే నిర్ణయం తీసుకొనే అవకాశం కలదు. శ్రమతప్పక పోవచ్చును కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. కోపం పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త సర్దుబాటు అవసరం.

మకర రాశి : ఈ వారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయల్లో నిదానంగా వ్యవహరించుట సూచన వివాదాలకు దూరంగా ఉండుట మేలు. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఊహిచిన దానికన్నా అధికమైన ఖర్చులను పొందుతారు. పెద్దలతో పరిచయాలు అవుతాయి.విదీశీప్రయాణాలు కలిసి వస్తాయి వాటికోసం చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది.వీసా పరమైన పనులను ఆరంభించుట లబ్దిని కలుగజేస్తుంది. నూతన ప్రయత్నాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ఉద్యోగంలో సమయపాలన అవసరం పనిఒత్తిడి ఉంటుంది నిదానంగా వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయండి బద్ధకం పెరుగుటకు ఆస్కారం కలదు. వ్యాపరసంభందమైన విషయల్లో నూతన ఆలోచనలకు అవకాశం ఇవ్వకపోవడం అనేది తెలివైన నిర్ణయం.    

కుంభ రాశి : ఈ వారం మొత్తంమీద  నూతన పరిచయాలకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయల్లో నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవడం అనేది సూచన. ప్రయాణాలు కలిసి వస్తాయి చర్చల మూలాన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. కుటుంభంలో ఊహించని మార్పులకు అవకాశం ఉంది కావున నిదానంగా జరుగుతున్నా మార్పులను గమనించుట సూచన.  ఆర్థికపరమైన విషయంలో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు . వ్యాపారపరమైన విషయల్లో సంప్రదాయ ఫలితాలు పొందుతారు అనగా ఎప్పటిలాగే ఉంటుంది. బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు అనుభవజ్ఞుల సూచనల మేరనడుచుకోండి మేలుజరుగుతుంది.   


మీన రాశి :  ఈ వారం మొత్తంమీద ఆరంభంలో ఒత్తిడి కలిగి ఉంటారు చేసే ప్రతి పని విషయంలో పూర్తిస్థాయి అవగాహన అవసరం లేకపోతే ఇబ్బందులు పొందుతారు. మీయొక్క ఆలోచనలు కొన్ని విస్మయాన్ని కలుగాజేసేవిగా ఉండే అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు.  ఉద్యోగంలో మీవైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు పనిభారం తప్పక పోవచ్చును. ఇష్టమైన పనులకు సమయం కేటాయిస్తారు నచ్చిన పనులకు సమయం ఇవ్వడం సూచన. కుటుంభంలో పెద్దల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి స్రడుబాటు విధానం మంచిది. మిత్రులతో సమయాన్ని గడుపుతారు.     .  

టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
jyoti patham