యమునోత్రి.చార్ థామ్ యాత్రలొ తొలి ఆలయం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

యమునోత్రి.చార్ థామ్ యాత్రలొ తొలి ఆలయం.

యమునోత్రి.చార్ థామ్ యాత్రలొ తొలి ఆలయం.
యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము. యమునా నది జన్మించిన ఈ ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది. ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయాన్ని జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్దంలో నిర్మించబడింది.పాత ఆలయం వాతావరణం, ఇతర కారణాల వలన శ్ధిలస్థితికి చేరుకున్న తరువాత జయపూరు రాణిచే ఆలయం పునర్నిర్మించబడింది. కొన్ని చిన్న చిన్న ఆశ్రమాలు, గెస్ట్‌హౌసులు కాక ఆలయసమీపంలో నివసించడానికి వసతులు తక్కువ. యాత్రీకులు సమీపంలోని రాణిచెట్టి తదితర ప్రాంతాలలో బసచేసి ఆలయానికి చేరి నదీమాతను దర్శించి వెనుతిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణకుండ స్నానం యాత్రీకుల శ్రమాంతర ప్రయాణానికి కొంత సేదతీరుస్తుంది.
సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం. వారు శని, యముడు, యమున.సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన ఛాయను తన స్థానంలో తన ఛాయను ఉంచి తపమాచరించడానికి వెళ్ళింది. ఛాయాదేవికి సూర్యుని వలన కలిగారు. తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది. ఒక రోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యా దేవి సంతానానికి ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు. ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివికా శపించింది.ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నిన కారణమడిగాడు, శని చెప్పినది విని సూర్యునికి ఛాయా దేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీవెవరు అని ఆమెను నిలదీయగా తను సంధ్యను కానని ఆమెచే నియమించబడిన ఛాయాదేవినని నిజం చెప్పింది. ఈ సంఘటన తరువాత శని యమూడు ఆప్రదేశాన్ని విడిచి పోతారు. యముడు శువునికి సహాయంగా మరణానంతరం ప్రాణులకు పాపం చేసినందుకు దండననిచ్చే నరకాధిపతి అయ్యాడు. దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడని పురాణ కథనం. అన్నదమ్ముల వియోగాన్ని సహించలేక యమున కన్నీరు మున్నీరుగా ఏడ్వగా ఆమెకన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం కొన్నిచోట్ల ప్రచారంలో ఉంది.
యమునోత్రి గుడి ముందుగా యాత్రీకులు స్నానానికి అనువుగా ఉష్ణగుండం ఉంటుంది.యాత్రీకులు ఇక్కడ స్నానాదికాలు సాగించి యమునదేవి దర్శనం చేసుకుంటారు.గర్భ గుడిలో యమునా, సరస్వతి, గంగా మూర్తులు ఉంటాయి.ఇక్కడ దర్శనం తరువాత యాత్రీకులు ఆలయం పక్కన ఉన్న చిన్న ఉష్ణ గుండంలో చిన్న బియ్యం మూటలను దారానికి కట్టి లోపల వదిలి అన్నం తయారు చేసుకుంటారు.దీనిని ప్రసాదంగా స్వీకరించకూడదు.ఇక్కడ నీటిలో ఉండే రసాయనాల కారణంగా ఇది ఆహారానికి పనికి రాదు ఆనీటిలోని వేడిని యాత్రీకులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే అన్నం వండే ప్రక్రియను చేపడతారు. తరువాత యాత్రీకులు నదీమతల్లికి పూజాదికాలు చేసి నదిలోని జలాన్ని తీర్థంగా పాత్రలు, కేనులలో నింపుకుంటారు.నదిలో పూలు, దీపం దోనెలో పెట్టి వదులు తుంటారు.పూజా ద్రవ్యం, దీపాలు సులువుగానే నదీ సమీపంలోను, దుకాణాలలో లభిస్తాయి.