పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే పాత ప్రేమికులను వదులుకోవాల్సిందే! - సదాశివుని లక్ష్మణరావు

పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే పాత ప్రేమికులను వదులుకోవాల

యవ్వనంలో ప్రేమ వ్యవహారాలు- పెళ్ళికి ప్రతిబంధకాలా? పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే పాత ప్రేమికులను వదులుకోవాల్సిందే! **** నేటి యువతీయువకులలో పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు జరపడం సర్వసాధారణం అయింది..అది సహజం కూడా..ఇది తప్పు అని పెద్దలకు..చాంధసులకు అనిపించవచ్చు. కానీ యువతీయువకులలో ముఖ్యంగా కాలేజీలలో చదువుకోసం వేరే ఊళ్ళలో..హాస్టళ్ళలో ఉండే వారిలో బాయ్ ఫ్రెండు/గర్ల్ ఫ్రెండు ఉండడం ప్రెస్టీజ్ గా ఫీలవుతారు..ఒక కాస్ట్లీ మొబైల్ ఫోన్ కొనడం ఎలాగనో అలాగే మంచి బాయ్ ఫ్రెండు/గర్ల్ ఫ్రెండు ఉండడము కూడా స్టేటస్ సింబల్ ..అతి కొద్దిమంది ధనవంతులలో పబ్ లకెళ్ళడంకూడా స్టేటస్ సింబలే..ఇది అందరు పెద్దలు అయిష్టంగా నైనా ఆహ్వానించవలసినదే.తప్పదు. అయితే *ప్రేమికుడు/ప్రేమికురాలిని కాకుండా* వేరేవ్యక్తిని పెళ్ళిచేసుకొనాలనుకునే ముందు ..పాత ప్రేమవ్యవహారాలన్నీ తెగతెంపులు చేసుకోవాలి. అప్పుడే పెళ్ళి పదికాలాలపాటు నిలుస్తుంది. లేకపోతే పేకమేడలా కూలిపోతుంది. పాత ప్రేమవ్యవహారాలన్నీ తెగతెంపులు చేసుకోవడం విషయంలో గమనించవలసిన విషయమేమిటంటే.. అబ్బాయిలు అదే బాయ్స్ అయితే వారి గర్ల్ ఫ్రెండ్స్ ని అత్యంత తేలికగా వదిలించుకోగలగడం మనం చూస్తున్నాం. ఎక్కువ శాతం గర్ల్ ఫ్రెండ్స్ కూడా పాత బాయ్ ఫ్రెండుని వదిలించుకోవాలనే చూస్తారు..మరో కొత్త బాయ్ ఫ్రెండయితే తనకోసం ఎక్కువ ఖర్చుపెడతాడని..అందుకే అబ్బాయిలు వారి గర్ల్ ఫ్రెండుని వదిలించుకోవడం సులభం..పాత ప్రేమ వ్యవహారాలకు పూర్తిగ ఫుల్ స్టాప్ పెట్టి పెళ్ళి తరవాత జీవితం సజావుగ సాగించుకోవచ్చును. అయితే అదే అమ్మాయిల విషయంలో అది చాలా కష్టం. తన బాయ్ ఫ్రెండుని వదిలించుకోవడం చాలా కష్టం..ఎందుకంటే బాయ్ ఫ్రెండు తనకోసం అప్పటికే ఎంతో ఖర్చుపెట్టి ఉంటాడు..అందుకని తన గర్ల్ ఫ్రెండుని అస్సలు వదలడు..ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చినా వదలడు. అతనితో అమ్మాయి గడిపిన క్షణాలన్నీ ఫోటోలు ప్రూఫులతో రెడీగా ఉంటాడు. గర్ల్ ఫ్రెండుకి వేరే వ్యక్తితో పెళ్ళి అవుతుందంటే ఊరుకోడు..నానా రభస చేస్తాడు..అమ్మాయి జీవితం సజావుగ సాగనివ్వడు..దీనితో చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడడం చూశాం. పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలెంత నిజమో..ఇలాంటి దారుణాలూ అంతే నిజం. అమ్మాయిలు పాత బాయ్ ఫ్రెండుని అంత సులభంగా వదలడం జరగదు. పెళ్ళికిముందు..పెళ్ళపుడు..పెళ్ళితరవాత..పిల్లలు పుట్టాక ఎపుడైనా సరే ఇబ్బంది పెట్టడానికి వెనుకాడరు తన బాయ్ ఫ్రెండు.. 1) అందుకని అమ్మాయిలు పెళ్ళికి ముందు ప్రేమవ్యవహారాలు నడపకూడదు.( సమానహక్కుఉన్నాసరే ) 2) బాయ్ ఫ్రెండులు ఉండకూడదు. 3) ఒక వేళ ఉన్నట్టయితే..బాయ్ ఫ్రెండుకి పెళ్ళిఅయిపోయిన తరవాతనే అమ్మాయి పెళ్ళిచేసుకోవాలి (వయసు ఎంత లేటయినా సరే ) అప్పుడే వివాహాలలో సమస్యలు రావు. *ఇది అమ్మాయిలు తప్పక గ్రహించాలి*. లేకపోతే ముందు తన ప్రాణానికి..తదుపరి చేసుకున్న భర్త ప్రాణానికి..తదుపరి అత్తవారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు..ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందన్నది మరవకూడదు. మరొక ముఖ్యవిషయం గమనించవలసినది..మొబైల్ ఫోనులో ఉన్న ఫోటోలు మెసేజ్ లు పూర్తిగా డిలీట్ చేసినా ఎన్నిసంవత్సరాలతరవాతైనాసరే వాటన్నిటినీ తిరిగి తెచ్చే యాప్ లు కూడా వచ్చాయి..కాబట్టి ఒకసారి మొబైల్ ఫోనులో రికార్డు అయితే అది డిలీటయినా తిరిగి పొందవచ్చు..దీనిని చాలామంది ప్రేమికులు బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుతున్నారు. దీనివలన ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయాయికూడా.. అందుకని గుడ్డిగా ఫోన్ లో డిలిట్ చేస్తే అన్నీ పోతాయి అనుకోకండి..కాబట్టి ఫోనులో ఫోటోలుగాని..మాటలుగాని..వీడియోగాని ఏదీ రికార్డు చేయకుండా ప్రేమికులంతా ముందే జాగ్రత్తపడండి ..ఫోన్ కి దూరంగా ఉండండి. పరువు ప్రతిష్టలగురించి అస్సలు ఈ వ్యాసంలో చర్చించడం జరగలేదు..ఎందుకంటే అవి చాలా చిన్న విషయాలు అయిపోయాయి కాబట్టి..ముఖ్యవిషయాలుగా చాలామంది భావించడం లేదు కాబట్టి. *పిల్లల ప్రేమ వ్యవహారాలు 99 శాతం వారివారి తల్లిదండ్రులకు తెలియవు..పిల్లలు చాలా సీక్రెటుగా ఉంచుతారు.ఇది వాస్తవం* సర్వే జనాః సుఖినో భవంతు శీఘ్రమేవ సత్సంప్రదాయ జీవితభాగస్వామి ప్రాప్తిరస్తు సత్సంతాన ప్రాప్తిరస్తు. సదాశివుని లక్ష్మణరావు విశాఖపట్నం 20-6-2022

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు