రామసక్కని బాలల కథలు - దుర్గమ్ భైతి

రామసక్కని బాలల కథలు పుస్తక సమీక్ష. రామసక్కని బాలల కథలు --------------------------------- రామపక్కవి గాలిపటం బాలల కథలు అనే పుస్తకం చాలా బాగుంది . ఈ కథలు ఎంతో మంది పిల్లలకు మార్గదర్శనం చేసేలా ఉన్నాయి. ఈ పుస్తకంలో అన్ని మంచి కథలే ఉన్నాయి. కథలు అన్ని చదవాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.పుస్తకం పేరులోనే మంచి ప్రేరణ కలిపిస్తుంది . " మొదటి అడుగు ' అనే కథలో రాజు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మొదటి అడుగు పడింది . అలాగే అందరు విద్యార్థులు తమ లక్ష్యం నేరవేరడానికి మొదటి అడుగుతో ప్రారంభం అవుతుంది .కాని మనం అనుకున్న లక్ష్యం నేరవేరలేదు అనుకోకూడదు. అదే మొదటి అడుగు అనుకోవాలి అనే సందేశం ఈ కథ చెబుతుంది. ' తెగిన గాలిపటం ' అనే కథలో ఒక గాలిపటం గాలిలో ఎగురుతుంటే దానికి విలువ ఉంటుంది . కాని గాలిపటం తెగి దారి తప్పి ఎక్కడైన పడితే దానికి విలువ ఉండదు. అలాగే ఒక విద్యా విద్యార్థి పాఠశాలలోచదువుకుంటేనే విద్యార్థికి విలువ ఉంటుంది . కాని పాఠశాలకు వెళ్ళకుండా తిరుగుతే ఆ విద్యార్థికి విలువ ఉండదు అనే గొప్ప ప్రేరణ మనకు ఈ కథ ద్వారా కలుగుతుంది. ' మార్పు మంచిదే ' అనే కథలో తుమ్మ చెట్టు తప్పుగా అర్థం చేసుకుంటుంది .మామిడి చెట్టు తుమ్మచెట్టుకి ఎంతో నచ్చచెప్పింది కాని వినలేదు . కొన్ని రోజులకు తుమ్మచెట్టు తన తప్పును అర్థం చేసుకొని మామిడి చెట్టును క్షమాపణ అడుగుతుంది. ఈ విధంగా మార్పు మంచిదే కాని మార్పు చెడు మార్పు కాకూడదు అనే విషయం మనం గ్రహించవచ్చు. ' పులితో ఆటలా ' అనే కథలో నీలకంఠం చెడు దారిలో డబ్బు సంపాదిస్తే అది అనుభవించకుండానే పులికి ఆహారమయ్యాడు . అందుకే ఎప్పుడు చెడు దారిలో డబ్బు సంపాదించకూడదు . డబ్బుల కోసం ఏ చెడు పని చేయకూడదు అనే నీతిని ఈ కథ తెలియచేస్తుంది. ' మెత్తని మోసం ' అనే కథలో ధర్మయ్య సహాయం అడిగిన గోపయ్యకు కాదనకుండా సహాయం చేస్తాడు . కాని గోపయ్య మోసం చేసాడు.గోపయ్యకి శిక్ష పడింది .అందుకే మనం ఎప్పుడు ఎవ్వరిని మోసం చేయకూడదు .చేస్తే మనం కూడా మోసపోతాము అని తెలుసుకుంటాము. ' ఆన్ లైన్ క్లాస్ ' అనే కథలో సెల్ ఫోన్ వాడద్దని చెప్పిన ఉపాధ్యాయుల చేతనే సెల్ఫోన్లో క్లాసులు చెప్పేలా చేసింది కరోనా : కరోనా కాలంలో మంచి విద్యార్థి ఎప్పుడు పాఠశాలలు ఓపెన్ అవుతాయి . అవి ఎదురుచూసారు.ఇలాంటి విద్యార్థులు చాలా గొప్పవారు అవుతారని చెప్పేలా ఈ కథ ఉన్నది. ' గురువు చూపిన దారి ' అనే కథలో రాజు గురువుగారు చెప్పిన మాటలను గమనించి ఆ మాటలను రాజు మనసులో పెట్టుకొని రాత్రి ఎన్ని కష్టాలు వచ్చినా చదువును వదిలి పెట్టవద్దని ఆరోజు నిర్ణయించుకున్నాడు . కొన్ని సంవత్సరాల తరువాత రాజు ఉపాధ్యాయుడయ్యాడు.ఈ కథ కష్టం విలువ చెప్పింది. ' ముసలి నాన్న ' అనే కథలో రాము వాళ్ళ అమ్మ నాన్నలు వారి ఇంట్లో నుంచి వారి తాత ను పంపించారు . కాని ముసలి నాన్నకి ఇంట్లో నుంచి పంపించిన వారి మీద కోపం లేదు . వారు అంటే ఇష్టం. ఈ కథ తాత మనవళ్ల అనుబంధం గురించి చక్కగా వివరిస్తుంది ఇంగిత జ్ఞానం ,చిన్న గుణపాఠం, సమయం విలువ,కుక్క విశ్వాసం,పాత సైకిలు లాంటి కథల్లో కూడా పిల్లలకు ఉపయోగపడే సందేశాలు చాలా ఉన్నాయి.ప్రతి కథ చదవాలని అనిపిస్తుంది. దుర్గమ్ భైతి గారు వ్రాసిన ఈ రామసక్కని పుస్తకంలో మొత్తం ఇరవై కథలున్నాయి.పిల్లలు ఈ కథలను ఎంతో ఇష్టంగా చదువుతారు.వారికి కథలు వ్రాయాలనే ఆసక్తి పెరుగుతుంది. బాలలు,మీరు కూడా ఈ కథలను చదవండి మరియు ఓ మంచి కథను వ్రాయండి. ప్రతులకు : భైతి తార రామునిపట్ల గ్రామము చిన్న కోడూరు మండలం సిద్దిపేట జిల్లా -502267 సెల్ :9959007914 పేజీలు ;64 వెల : 80 రు. ప్రచురణ :అక్షర సేద్యం ఫౌండేషన్ సమీక్ష వ్రాసినవారు : సారుగు శ్రీజ పదవ తరగతి జక్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేట జిల్లా

మరిన్ని వ్యాసాలు

గేయ రచయిత మజ్రుసుల్తాన్ పూరి .
గేయ రచయిత మజ్రుసుల్తాన్ పూరి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Vrutthi- pravrutthi
వృత్తి .. ప్రవృతి
- తోట సాంబశివరావు
నౌషాద్ అలి .
నౌషాద్ అలి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
నటుడు షమ్మికపూర్ .
నటుడు షమ్మికపూర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
నటుడు రాజకపూర్ .
నటుడు రాజకపూర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
నటుడు శశికపూర్ .
నటుడు శశికపూర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.