జ్యోతిష్య శాస్త్రానికి నాంది పలికిన - Syamasundar Ambadipudi

జ్యోతిష్య శాస్త్రానికి నాంది పలికిన

మన పురాణాలలో వ్యాసుడి పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది భారత,భాగవతాలను రచించి వేదాలను విభజించిన మహానుభావుడిగా వ్యాసునికి మంచి గుర్తింపు ఉంది కానీ అంతటి మహానుభావుడి తండ్రి అయిన పరాశరుని గురించి చాలా మందికి చాలా తక్కువగా తెలుసు నిజానికి పరాశరుడు కూడా గొప్ప ఋషి పుంగవుడు భారతీయ విజ్ఞానానికి ‘పరాశరుడు’ అన్న పేరు ఓ మూలస్తంభం అని నిస్సందేహముగా చెప్పవచ్చు జ్యోతిష్యశాస్త్రానికి మూలపురుషుడిగా చెపుతారు బృహత్ పరాశర హోరా శాస్త్రము అనే రచన ద్వార పరాశరుడు జ్యోతిష్య శాస్త్రానికి నాంది పలికాడు బ్రహ్మ సృష్టి అయిన వసిష్టునికి అరుంధతి ద్వార శక్తి అనే కుమారుడు జన్మించాడు అతనికి అదృశ్యంతి ద్వార జన్మించిన వాడే పరాశరుడు.

పరాశరుడు జన్మించక ముందే అయన తండ్రి శక్తిని ఒక రాక్షసుడు మింగిస్తాడు జన్మించాక తల్లిద్వార విషయము తెలుసుకున్న పరాశరుడు వసిష్ఠుని సలహా మేరకు శివుని కోసము తపస్సు చేసి పొందిన వరాల వల్ల, పై లోకములో ఉన్న తండ్రిని కలుసు కొని తండ్రిని మింగిన రాక్షుడిని ఇతర రాక్షసులను అంతము చేయటానికి ఒక ,యాగము చేసి చాలా మంది రాక్షసులను అంతమొందించాడు.చివరికి పరాశరుని శాంతింపచేసేందుకు సాక్షాత్తూ అతని తాత వశిష్టుడు దిగిరావల్సి వచ్చింది ‘వ్యక్తిగత ద్వేషంతో సృష్టిధర్మాన్ని తిరగరాయద్దని’ వశిష్టుడు నచ్చచెప్పడంతో పరాశరుడు శాంతించాడు. వసిష్ఠుని మాటలతో యాగాన్ని ముగించి, యాగము లోని అగ్నిని ఉత్తర దిక్కున వదలి తీర్ధయాత్రలు చేస్తూ యమునా నది తీరానికి చేరి యమునా నదిని దాటుతు ఉండగా మొదలైన ప్రేమ కద వ్యాసుని జననానికి కారణమైంది

పరాశరుడు యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్యగంధి అనే మత్స్యకార యువతిని చూచి మోహించిగా ఆయన యింద్రియ నిగ్రహం సడలి ఆమెతో ప్రియ సమాగమం కోరుకున్నారు. జ్ఞానవర్చస్సుతో వెలిగిపోతున్న పరాశరుని చూసి సత్యవతి, సత్యవతి నిష్కల్మషమైన సౌందర్యాన్ని చూసి పరాశరుడు మోహంలో పడిపోయారు ఆయన కోరికను నిరాకరిస్తే ఆయన ఆగ్రహించి తననేమైనా శపిస్తాడేమోనని భయపడుతూనే," అయ్యా మీరు చూస్తేనేమో పెద్ద తపస్విలా ఉన్నారు నేనేమో చేపల కంపు కొట్టే మత్స్యగంధిని ",అని ఏదో వంక చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించింది.కానీ పరాశరుడు తన పట్టు విడవకుండా," సరే నీనుండి గంధపు వాసన వచ్చేలా వరమిస్తాను అని చెప్పి ఆమెను చందనగంధిగా మార్చాడు ఆమెనే మనం మహా భారతంలో సత్యవతిగా చెప్పుకుంటున్నాము. ఐనను ఆమె అంగీకరింపక తటపటాయిస్తుంటే పరాశరుడు,"నా తపశ్శక్తినీ,యింతవరకు నేనాచరించిన బ్రహ్మ చర్యాన్నీ అర్పించి నీకు సద్యోగర్భమున మంచి సంతానమిస్తాను. అతడు రాబోవు కాలమున అనేక విషయాలకి కారణభూతుడై నీకు మంచి పేరు తెస్తాడు"ఆని వరము ఇచ్చి యమునా నది ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో రమించాడు. అలా పుట్టిన వాడే వేద వ్యాసుడు. తరువాత వ్యాసుని ద్వారా సత్యవతి కోరికమేరకు అంబికకు, అంబాలికకు సద్యోగర్భమున దృతరాష్ట్రుడు, పాండురాజు, మరియు విదురుడు పుట్టారు.అలా పరాశరుడు కౌరవ పాండవులకు పూర్వికునిగా నిలిచాడు.

పరాశరుడు మిగిలిన జీవితమంతా మానవుల కోసం అనేక రకాల గ్రంథములను రచించారు. వ్యవసాయం కొరకు వృక్షాయుర్వేదం అనే కృషి పరాశరవృక్ష శాస్త్రం, పరాశర ధర్మ సంహిత అనే జ్యోతిష్యశాస్త్ర గ్రంథం, వైద్యంకోసం సాంప్రదాయ భారతీయ వైద్యం అనే గ్రంథాలు రచించారు వేదాల మీద మంచి పట్టు ఉన్న పరాశరుడు స్వయంగా కొన్ని మంత్రాలను కూడా రచించినట్లు తెలుస్తోంది రుగ్వేదంలో అగ్నిదేవుడు, సోమదేవులకి సంబంధించిన కొన్ని సూక్తులు పరాశరుడు రాసినట్టుగా పేర్కొనబడ్డాయి. పరాశర మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ జ్యోతిషశాస్త్రానికి ఒక భూమికను ఏర్పరిచినవాడు పరాశరుడు. ‘పరాశరహోర’ పేరుతో ఆయన రచించిన గ్రంథాన్ని ఇప్పటికీ భక్తితో అనుసరించేవారు ఉన్నారు.విష్ణుపురాణంలోనూ పరాశరుని ప్రస్తావన కనిపిస్తుంది. ఇక పరాశరుడు ‘కృషి పరాశర’ పేరుతో వ్వవసాయం గురించీ, ‘వృక్షాయుర్వేద’ పేరుతో వృక్షాల గురించీ అపూర్వమైన గ్రంథాలు రచించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వ్యాసాలు

జైనమతంలో శ్రీరాముడు .
జైనమతంలో శ్రీరాముడు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నైమిషారణ్యం .
నైమిషారణ్యం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అష్టాదశ పురాణాలు .
అష్టాదశ పురాణాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వాల్మీకి .
వాల్మీకి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బుడబుక్కలవారు.
బుడబుక్కలవారు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు