పంచామృతం (సత్య! పంచపదుల సంపుటి) - దినవహి సత్యవతి

పంచామృతం (సత్య! పంచపదుల సంపుటి)

సాహితీ ప్రియులకు,పాఠకులకు
నమస్కారాలు.ఆధునిక సాహిత్యంలో అనేక సాహితీ ప్రక్రియలు ఆవిర్భవించి,వేటికవే ప్రత్యేకతను చాటుకుంటూ, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ వన్నె తీసుకు రావడం అభినందనీయం..

ఈ నేపథ్యంలో ఎంతోమంది కవులు లఘు కవితా రూపాలను రూపొందించి,వాట్సప్ గ్రూపుల ద్వారా ప్రోత్సహిస్తున్నారు.
అటువంటి ప్రక్రియల్లో శ్రీ కాటేగారు పాండురంగ విఠల్ గారు రూపొందించిన "పంచపది" ప్రత్యేకమైనది ఎన్నో మంచి అంశాలను సులభంగా రాయగల ఈ ప్రక్రియ కు ఎందరో ఆకర్షితులై చక్కటి పంచపదులు,పంచపది సింగిడీలు, బాల పంచపదులను అందిస్తున్నారు. అనేకమంది సాహిత్యాభిలాషులు విభిన్న అంశాలలో పంచపదులు రాస్తూ పాఠకులను మెప్పిస్తున్నారు.

"సత్య! పంచపదులు" పేరిట పంచపదుల సంపుటి శ్రీమతి దినవహి సత్యవతి గారు అపూర్వముగా తీర్చిదిద్ది పాఠక లోకానికి అందివ్వడం అభినందనీయం.

ఇందులో పంచపదులు, అంత్య ప్రాస పంచపదులు, చిత్రమునకు పంచపదులు, సప్తవర్ణ సింగిడీలు,
అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు సత్యవతిగారు.
ఒక్కొక్క పంచపది ఒక్కొక్క ఆణిముత్యమని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
కొన్ని పంచపదులు ప్రముఖుల గురించి విసదీకరిస్తుంటే, మరికొన్ని జీవిత సత్యాలను బోధిస్తూ, ఇంకొన్ని

ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.
అద్భుతమైన రచనా శైలిలో రచించిన ఈ "సత్య పంచపదులు" ప్రతి ఒక్కరినీ అలరిస్తుందనడంలో
ఎటువంటి సందేహం లేదు.
దినవహి సత్యవతి గారు మున్ముందు మరిన్ని సంపుటులు సాహితీ లోకానికి అందిస్తారని ఆశిస్తూ,ఆ దేవదేవుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ....

ఆశీస్సులతో
డా.మరుదాడు అహల్యా దేవి
హైదరాబాద్

9848238453