గణపతికి పలు పేర్లు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

గణపతికి పలు పేర్లు .

గణపతికి పలు పేర్లు.

సర్గము .ప్రతిసర్గము.వంశము.మన్వంతరము.రాజావంశాను చరితము.అను ఐదు లక్షణాలతో కూడిన అపురూపమైన కూర్పును " పురాణం " అంటారు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను,18 పురాణాలు రచించాడు. 1 అగ్ని పురాణం 2 నారద పురాణం 3 పద్మ పురాణం 4 లింగ పురాణం 5 గరుడ పురాణం 6 కూర్మ పురాణం 7 స్కాంద పురాణం 8 మత్స్య పురాణం 9 మార్కండేయ పురాణం 10 భరత పురాణం 11 భవిష్య పురాణం 12 బ్రహ్మ పురాణం 13 బ్రహ్మాండ పురాణం 14 బ్రహ్మ వైవర్త పురాణం 15 వరాహ పురాణం 16 వామన పురాణం 17 వాయు పురాణం 18 విష్ణు పురాణం. అలాగే పలు ఉపపురాణాలు ఉన్నాయి.

హిందూమతంగా వ్యవహరింపబడే సనాతన ధర్మంలో రెండు విభాగాలు కనిపిస్తాయి. ఒక భాగంలో ద్వైతం,అద్వైతం చోటు చేసుకున్నాయి.మరో విభాగంలో ఆరు శాఖలు గోచరిస్తాయి. అవి శైవం, వైష్ణవం, శాక్తం, గణాపత్యం, కౌమారం, శౌరం కనిపిస్తాయి.ఇందులో శైవులు ఈశ్వరుడిని, వైష్ణవులు విష్ణువుని,శాక్తం వారు ఆదిపరాశక్తిని, గణాపాయ్యులు గణపతిని ,శౌరాని చెందినవారు సూర్యుడిని ,కౌమారానికి చెందినవారు కుమారస్వామిని పూజిస్తారు.విష్ణుభక్తులను ఆళ్వారులని , శివ భక్తులను నయనార్లు అని అంటారు.

పార్వతిదేవి పిండిబొమ్మను చేసి ప్రాణం పోయగా గణపతి ఉద్బవించాడని, తెలియక శివునితో పోరాడి తలకోల్పోవడంతో ఏనుగు తల అమర్చ బడింది అన్నకథ మనకు తెలిసినదే!

వామన పురాణంలో పార్వతిదేవి స్వేదబిందువు నుండి గణపతి జన్మించాడని తెలుస్తుంది.పార్వతి దేవి పుణ్యక వ్రతం ఆచరించి శ్రీకృష్ణుని తనయుడిగా కోరుకోవడంతో శ్రీకృష్ణుడు గణపతి రూపంతో ఆమెకు జన్మించాడని మరో పురాణకథ. పరశురామునితో తలపడి గణేషుడు ఏకదంతుడు అయ్యాడట. బ్రహ్మవైవర్త పురాణంలో విష్ణువే గణపతికి గజముఖం రావడానికి కారణం అని ఉంది.

వినాయకునికి ఇద్దరు భార్యలు రిద్ధి మరియు సిద్ధి ఎందుకు ఉన్నారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుదాం ! మన భారతదేశంలోని సంప్రదాయాల ప్రకారం, ఏదైనా కొత్త పనిని లేదా శుభకార్యాన్ని ప్రారంభించడానికి ముందు కచ్చితంగా తొలి పూజను గణపతి దేవునికి చేస్తారు. వివాహం, కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సైతం వినాయకుడికే తొలి స్థానం ఉంది. పురాణాల ప్రకారం, గణేశుడు పార్వతీ, పరమేశ్వరుల పుత్రుడని మనందరికీ తెలిసిందే. అయితే వినాయకుడు బ్రహ్మచారి అని.. తనకు పెళ్లి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే వినాయకుడు బ్రహ్మాచారిగా ఉండాలని కోరుకున్నాడట. కానీ వినాయకుడికి ఒకరితో కాదు ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారి పేర్లే రిద్ధి మరియు సిద్ధి. ఈ సందర్భంగా వీరిద్దరూ వినాయకుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు.. అందుకు గల కారణాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి ఆకర్షణ.. పురాణాల ప్రకారం, వినాయకుడు ఓ ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేశుడిని చూసి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు వినాయకుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఆమె బ్రహ్మచారి అని చెప్పి వినాయకుడు తన వివాహ ప్రతిపాదన తిరస్కరించాడు. తులసిని ఉపయోగించరు.. తనతో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన వినాయకుడిపై తులసి కోపంతో తనకు శాపం విధించింది. గణేశుడిని ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని శపించింది. మరోవైపు వినాయకుడు కూడా తులసికి అసురుడితో వివాహం జరుగుతుందని శపించాడు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదని పండితులు చెబుతారు. బ్రహ్మచార్యం ప్రారంభం.. మరో కథనం ప్రకారం, వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో కలత చెందిన వినాయకుడు బ్రహ్మచార్యం పాటించడం ప్రారంభించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గణేశుడు పెళ్లి జరగకుండా ఇబ్బందులను కలుగ జేసేవాడు.

మూషికం మద్దతు.. వినాయకుడు తనకు పెళ్లి జరగకపోతే.. ఇంకా ఎవరికీ వివాహం జరగకూడదని భావించాడు. ఇందుకు వినాయకుడికి మూషిక మద్దతు కూడా లభించింది. అయితే వినాయకుడి ఈ అలవాటు వల్ల దేవతలందరూ కలత చెందారు. తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మ యోగం నుండి ఇద్దరు కుమార్తెలు రిద్ది మరియు సిద్ధి కనిపించారు. వారిద్దరూ బ్రహ్మదేవుని మానస పుత్రికలు. వినాయకుని బోధనలు.. దేవతల కష్టాలు తీర్చేందుకు తన కుమార్తెలను వినాయకుడి వద్దకు బోధనల కోసం పంపారు. బ్రహ్మదేవుని ఆదేశాల మేరకు గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గర పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు, వారిద్దరూ తన ద్రుష్టిని మరల్చేవారు. ఇలా అందరూ క్రమంగా పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు. వినాయకుడి వివాహం.. ఒకరోజు అందరూ వివాహం చేసుకున్నారని, చేసుకుంటున్నారని వినాయకుడికి తెలిసిపోతుంది. దీంతో గణపతి సిద్ధి, రిద్దిపై కోపంతో శపించడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తనను అడ్డుకుంటాడు. అదే సమయంలో వారిద్దరినీ వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు. ఆ తర్వాత వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు.

వీరి పేర్లు శుభ్ మరియు లభ్.

కానీ గణపతిలో పలు రకాలు ఉన్నాయని.అందులో వారి భార్యలకు పలు పేర్లు ఉన్నాయనైతే తెలియదు.అయితే గణపతులు ఎంత మంది.వారి భార్యలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సిద్ధి గణపతి భార్య పేరు సిద్ధిబుద్ధి.

లక్ష్మీగణపతి భార్య పేరు జయలక్ష్మి.

ధూమ్ర గణపతి భార్య పేరు సిద్దలక్ష్మి.

కృష్ణ గణపతి భార్య పేరు సువర్ణా దేవి.

రక్త వర్ణ గణపతి భార్య పేరు పద్మావతి.

సువర్ణ గణపతి భార్య పేరు రజత దేవి.

విష్ణ గణపతి భార్య పేరు ప్రజాదేవి.

నిర్విఘ్న గణపతి భార్య పేరు అతి ప్రజ్ఞాదేవి.

వికట గణపతి భార్య పేరు జ్ఞానాదేవి.

బాల చంద్ర గణపతి భార్య పేరు చంద్రముఖి.

అంబర గణపతి భార్య పేరు సంహార దేవి.

భద్ర గణపతి భార్య పేరు శాంతిదేవి. లంబోదర

శుక్ల గణపతి భార్య పేరు బుద్ధి లక్ష్మి.

ఋణ విమోచన గణపతి భార్య పేరు సౌభాగ్య లక్ష్మి.

గణపతి భార్య పేరు లోకమాత.

క్ష్మీప్రద గణపతి భార్య పేరు వరలక్ష్మీ.

వక్రతుండ గణపతి భార్య పేరు నవరత్న లక్ష్మి.

చింతామణి గణపతి భార్య పేరు విజయ లక్ష్మి.

అలాగే ఏకదంత గణపతి భార్య పేరు సిద్ధిలక్ష్మి.

సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

9884429899