రామాయణానికి ముందు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

రామాయణానికి ముందు.

అందరికి మప్పిదాలు...

రామయణం గురించి నాలుగు మాటలు...

పాఠకులు కు తెలియని విభిన్న రామాయణాలు ఉన్నాయి.వాటిలోని విషేషాలను సమగ్రంగా తమకు తెలియజేయడానికి ' రామాయణానికి పూర్వం ' అనే ధారావాహిక రాస్తున్నాను. ఈ రచనలను ప్రచురణకు స్వీకరించిన గోతెలుగు నిర్వాహకులకు ధన్యవాదాలు...

అసలు రామాయాణాలు ఎన్ని? మూలం వాల్మికి వారి ఆదికావ్యం రామాయణం.వాల్మికి కవి 24 వేల శ్లోకలలో దీన్ని రాసాడట. అనంతరం పలుభాషలలో రామాయణాలు రచింపబడినవి.వేయికి పైగా ఉన్న రాబమాయణాలు చైనా,జపాన్ ,లావో,మలేషియా,శ్రీలంకా,ధాయ్ లాండ్ ,టిబెట్ ,బాలి,కాంబోడియా ...భారత్ వంటి దేశాలలో సాహిత్యపరంగా, ప్రదర్శనాపరంగా వృసృతంగా ప్రచారంలో ఉన్నాయి.రామకథలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదంటాడు గోస్వామి తులసి దాసు ,తన " రామ చరితమానస "లో ! జైనులు రాసినవి,విదేశియులు రాసిన రామకథలు కోకోల్లలు. ఎవరి కథ వారిదే ,ఎవరి కథనం వారిదే !

సీతాదేవి రావణుని కుమార్తె అని ,మండోదరికి జన్మించిన తనయి అని చెప్పుకొచ్చేకథలు ఇలాపుట్టుకొచ్చినవే! రావణుడు తుమ్మినప్పుడు అతని ముక్కునుండి సీతాదేవి కథ కూడా ఉంది.

సంస్కృత భారతంలో రామోపాఖ్యానం :

రామాయణం మహభారతం కన్నా ముందా ?అన్న విషయం పైన పండితులకు ఏకాభిప్రాయం లేదు.మహభారతంలో పలుచోట్ల రామాయణ

ప్రస్తావన కనిపిస్తుంది.

రామాయణ రచన ఎప్పుడు జరిగింది అన్న విషయం పైన పలువురి అభిప్రాయాలు.

1) డా. జాకోబీ. క్రీ.పూ. 6 - 8 శతాబ్దాల మధ్య కాలంలో.

2) హెచ్ .జాకోబీ . క్రీ.పూ. 1 -2 శతాబ్ధాల మధ్య కాలంలో.

3) యం. వింటక్నిజ్ .క్రీ.పూ. 3 శతాబ్దం.

4) ఎ.వెబర్ క్రీ.శ. 3 - 4. శతాబ్దకాలం.

5) ఎ.ఏ.మెక్డోనేల్ క్రీ.పూ. 7 వ శతాబ్దం.

6) ఎ.బి.కెయత్ క్రీ.పూ. 3 వ శతాబ్దంకన్నా కొద్దిగా ముందుగా.

మహభారతంలో ధర్మరాజుకు మార్కండేయుడు చెప్పిన రామోపాఖ్యానంలో కొన్ని అంశాలు పరిశీలిద్దాం!

1.దశరధుడు సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేయలేదు.

2.సీతదేవి జనకుడి కుమార్తే కాని భూమి దున్ను తున్నప్పుడు దొరకలేదు.

3 . గుహుడు,అత్రి మహర్షుల ప్రస్తావనలేదు.

4. కైకేయి మూడువరలు కాదు ఒకవరమే కోరుకుంది.

5 .విరధుడు,అగస్యుడు,శబరి కథలు ఇందులో లేవు.

6 . వాలి సుగ్రీవుల యుధం ఒక పర్యాయం మాత్రమే జరిగింది.

7 .లక్షణుడు కుంభకర్ణుని చంపాడు.

8.ఇంద్రజిత్తు శక్తి ఆయుధం లక్ష్మణుని తాకి అతను మూర్చపోలేదు.

9 . హిమాలయాలనుండి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తేలేదు.

10.శీల నిరూపణకు సీత అగ్ని ప్రవేశం చేయలేదు.

11.శాంతి పర్వంలో రజకుడు సీత శీలం గురించి లోకువగా మాట్లాడిన సంఘటన కనిపిస్తుంది.

12.అరణ్య,శాంతి,స్వర్గారోహణ పర్వాలలో రామావతార ప్రస్తావన కనిపిస్తుంది.

బుధ్ధుని అనంతరం బౌధ జాతక కథలు వెలువడ్డాయి.పాళీభాషలో ఈకథలను ప్రొఫెసర్ ఇ.బి.కోవెల్ ,డబ్ల్యు.హెచ్ .డిరూస్ లు ఆంగ్లంలోనికి అనువాదించారు. దశరధుడి జాతక కథకూడా అందులో ఉంది.ధర్మపాద,సుత్తాను పాద గ్రంధాల ఆధారంగా డా"వెబర్ ఈదశరధ జాతక కథలోని దశరధుడు క్రీ.పూ.5 శతాబ్దివామడుగా విశ్వసించాడు.

రామాయణ కథకు సంబంధించి - అనామకజాతకం,దశరధజాతకం,దశరధకథనం అనే జాతక కథలు ఉన్నాయని వాటిలో దశరధ జాతకం ప్రముఖమైనదని కొందరు అంటారు.

బౌధజాతక కథలో దశరథుడు కాశీరాజు. ఆయనకు రామ పండితుడు,లక్ష్మణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.సీత అనే కుమార్తె ఉన్నది. పదహరు వేల మంది భార్యలలో ఆయనకు మెదటి భార్యద్వారా వీరు కలిగారు. మొదటి భార్య మరణించగా మరో వివాహం చేసుకున్నాడు.ఆమెకు భరతుడు కలిగాడు. ఆభార్యకు వరం ఇచ్చాడు దశరథుడు. భరతునికి ఏడేళ్ళు వచ్చాక దశరథునికి తన వరం తెలిపింది. ఆమెకు ఇచ్చిన వరంకొరకు ,మొదటిభార్య సంతతిని అరణ్యాలకువెళ్ళి తన మరణానంతరం రమ్మంటాడు దశరథుడు. జ్యోతిష్యులు తను పన్నెండేళ్ళు జీవిస్తానని చెప్పడంతో వారిని అప్పుడే తిరిగి రమ్మంటాడు. చెల్లెలు సీతతో రామలక్ష్మణులు హిమాలయాలకువెళ్ళి జీవిస్తారు. దశరథుడు తొమ్మిదేళ్ళకే మరణించడంతో ,రాణి భరతునికి పట్టాభిషేకం చేయమన్నది.కాని,రాజపురోహితులు అందుకు సమ్మతించలేదు. భరతుడు అన్నగారిని తీసుకు రావడానికి వెళతాడు.

10 .తండ్రి 12 రమ్మన్నారుకనుక తాను రానంటాడు రామపండితుడు.

11 .తన పాదుకలు ఇచ్చి వాటితో పరిపాలన చేయమంటాడు.

12 . పాదుకలు సింహసనం పై ఉంచి పాలన చేసాడు భరతుడు.

జైన రామాయణంలో విరుధ్ధ విషేషాలు.

జైన రామాయణాలు రెండు ఉన్నాయి. ఒకటి విమలసూరి రాసిన 'పద్మ చరితం ' రెండవది గుణభద్రుడు రాసిన ' ఉత్తర పురాణం ' వీటిలో రామ లక్ష్మణులు కూడా జైన మతస్తులే .వానరులు' విద్యాధర ' జాతికి చెందిన వారని,వారి జండాపైన కోతి బొమ్మ మద్రించి ఉందని,జైన రామాయణాలు చెపుతున్నాయి.

రావణుని మెడలో వజ్రాల దండ వేళ్ళాడుతుందని ,ఆవజ్రాలలో నుండి రావణుడి తల పది తలలుగా కనిపించేదని ,అందుకని దశగ్రీవుడు,దశకంఠుడు అనే పేర్లు వచ్చాయట.

ఇంద్రుడు,వరుణుడు,యముడు ,జైన రామాయణాల ప్రకారం దేవతలు కారు, వీరంతా ఇరుగు పొరుగు రాజులు. ఒక 'శ్రవణుడి' చెల్లెలు 'చంద్ర నభి'

కుమార్తెను హనుమంతుడు వివాహం ఆడాడట. ఈచంద్రనభి భర్త 'ఖరుడు ' ఇతను ఖరధూషణాదులలో ఒకడైన రాక్షసుడు.అలాగే 'వాలి 'తన తమ్ముడు ' సుగ్రీవుని ' జైన మతంలో చేర్పించాడు.

దశరధునికి నలుగురు భార్యలు.నాలుగో భార్య 'సుప్రభ 'కు జన్నించిన వాడే ' శత్రుఘ్నుడు' . రాముడికి మరో ముగ్గురు భార్యలు, లక్ష్మణునికి పదకకొండు మంది భార్యలట.

మారీచ,సుబాహు పాత్రలు ఈరామాయణాలలో కనిపించవు.సుగ్రీవుని 13 మంది కుమార్తెలను రాముడే వివాహం చేసుకున్నాడట.హనుమంతుడు,రావణుడు మంచిమిత్రులట,లంకాసుందరిని హనుమంతుడు వివాహం చేసుకున్నాడట.లక్ష్మణుడు సముద్రుని కుమార్తెను వివాహం చెసుకున్నాడు.లక్ష్మణుడు నారాయణుడిగా ,రావణుని ప్రతినియకుడిగా ,రావణునీ లక్ష్మణుడు అంతమొందించాడట.రావణుడికి 8000 మంది భార్యలు,లక్ష్మణుడికి 16 000 మంది భార్యలు ఉన్నారట.

ఉత్తరపురాణం అనే జైన గ్రంధంలో రాముడు ' సబల 'కు, లక్ష్మణుడు కైకకు జన్మించారని ఉంది.పులస్యుని రావణుడు 'అమిత్వేగుడి' కుమార్తె 'మణి మతి'ని చెరచాడనీ,ఆమె మరణిస్తూ మరు జన్మలో నీకుమార్తెగా జన్మించి నీమరణానికి కారణం అవుతానని శపించినదట.

లక్షక్ష్మణుడు దీర్ఘకాలిక వ్యాధులతో మరణించి నరకానికి వెళ్ళాడట,రాముడు జైన మతం స్వీకరించి స్వర్గం చేరాడట.

' పద్మపురాణం' లో సీతాదేవి స్వయంవరానికి ఇంద్రుడు,రావణుడు వెళ్ళారట.రావణుని మరణానంతరం కుంభకర్ణుడు మరణం అని ఉంది.

' శివపురాణం 'లో తాను శివుని సలహమేరకే రామాతారం ఎత్తానని,రాముడు సతీ దేవికి చెపుతాడు. అలాగే శివునీ వీర్యం వలన హనుమంతుడు జన్మించినట్లు ఇక్కడ ఉంది. ' దేవి భాగవతంలో శ్రీరాముడు శూర్పణఖ ముక్కు,చెవులు కోసాడని ఉంది. ' నారద పురాణం 'లో రామ లక్ష్మణులు నారాయణ సంరక్షణ ఋషుల అవతారమని ఉంది.

' బ్రహ్మ వైవర్త పురాణం 'లో రావణాసురుడు అపహరించింది మాయసీతాదేవి అని చెప్పబడింది. 'అగ్నిపురాణం' లో మంధర

కూృరత్వమే సీతారాముల కష్టాలకు కారణం అని ఉంది. 'స్కంద పురాణం 'లో రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట కోసం హిమాలయాల్లో ఒకరాయిని గుర్తులు చెప్పి హనుమంతుని పంపాడట.అతను ముహుర్త సమయానికి రాక పోవడంతో ఇసుకతో చేసిన లింగాన్ని ప్రతిష్టించాడట.హనుమంతుని రుద్రుని అవతారంగానూ,ధర్మదత్తుడు దశరధుడిగాను అవతరించారట.

' కల్కి పురాణం 'లో జనకుడికి సీతాదేవితోపాటు మరో ఇద్దరు పిల్లలు అక్కడ దొరికారట. 'బృహధర్మ పురాణం' రావణుడు సీతనిలబడి ఉన్న నేలను పెకళించి తీసుకు పోయాడట.' అధ్యాత్మిక రామాయణం 'లో రాముడు శ్రీమహవిష్ణువు అవతారం అని కౌసల్య,వసిస్టుడు, ంవిశ్వామిత్రుడు లకుతెలుసునట. అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు ఉపవాస దీక్షతో గడిపాడట.' అద్బత రామాయణం 'లో సీతాదేవి మండోదరి కుమార్తేనని,పరశు రామునికి,హనుమంతునికి శ్రీరాముడు మహవిష్ణువు రూపంలోనే దర్శనం ఇచ్చాడని ఉంది. 'ఆనంద రామాయణం 'లో రావణుడు కౌసల్యను అపహరించాడట.సీతాదేవి అగ్నిలో జన్మించినదని ఉంది.సీతకు కుశుడు ఒక్కడే కుమారుడని ఉంది.

విదేశి రామాయణాలు:

టిబెట్ రామాయణం .దశరధునికి ఇద్దరు భార్యలు .మొదటి భార్యకు రాముడు,రెండో భార్యకు లక్ష్మణుడు జన్మించారు. సీతాదేవి రావణుని కుమార్తె ఆమె జాతకరీత్య తండ్రి రావణుని మరణానికి కారకురాలని ఆమెను పెట్టెలో పెట్టి సముద్రంలో పడవేస్తే జాలర్లకు లభిస్తుంది.లక్ష్మణుడు రాజ్యం ఏలగా,రాముడు అడవులకు వెళ్ళి అక్కడి వ్యవసాయదారుల వత్తిడితో సీతాదేవిని వివాహం చెసుకుంటాడు.రావణుడి బొటన వేలిలో అతని ప్రాణం ఉంటుంది.

చైనా రామాయణంలో( రామ్ కేశ )'మహరాజు నగ' అనేరాజు భూముల్లో ఒకే వరుసలో ఉన్న ఏడు చట్లను రాముడు ఒకే శరంతో ఛేదించాడట.

సియాం రామాయణం :లక్ష్మణుడు,హనుమంతుడు యుధ్ధం చేస్తారు.వారధి నిర్మాణ సమయంలో రావణుడు మారు వేషంలోవచ్చి రామునికి రావణునితో యుధ్ధం తగదు అని చెపుతాడు.రావణుడు సంజీవిని యజ్ఞం చేస్తుంటే హనుమంతుడు రావణుని రూపంలో వెళ్ళి మండోదరితో సంగమించాడట.

ఉత్తర సియాం రామాయణం:

సీతాదేవిని వివాహం చేసుకోకమునుపే రామునికి పలువురు భార్యలు ఉన్నారట.వాలి భార్య,సుగ్రీవుడి భార్యలుకూడా ఒకప్పుడు రాముని భార్యలేనట.బుధ్ధుడె శ్రీరాముడు అట.రావణుడు దేవదత్తుడు .దశరధుడు శుద్దోధనుడు.లక్ష్మణుడు ఆనందుడు.సీతాదేవి బౌధ్ధ భిక్షుకి 'ఉప్పల వన్నె ' అట.

హికాయత్ సెరిరామ్ : ఇదీ విదేశి రామాయణమే .ఇందులో దశరధుడె మాయమండోదరిని తీసుకువచ్చి ,ఆమెకు రావణుని ద్వారా సీతకలిగెలా చేసాడు.

'సంస్కృత రామాయణం'లోని విషేషాలు.

' ఉన్మత్త రాఘవం 'అనే గ్రంధంలో...భాస్కరభట్టు దుర్వాసుడి శాపం వలన సీతాదేవి ఒక లేడిగా మారిపోయిందని,ఆమెను వెదుకుతున్న రాముడు ' అగస్త్యుని సహయంతో కనుగొన్నాడనని ఉంది. 'ఆశ్చర్యచూడామణి ' అనే రామాయణాన్ని శక్తి భద్రుడు రాశాడు.ఇందులో రాముడి రూపంలో రావణుడు,అతని రధసారధి లక్ష్మణుడి రూపంలో సీతాపహరం చేసారని ఉంది.అంతకుమునుపు సీతాదేవి రూపంలో శూర్పణక రాముని వద్దకు వచ్చిందట.

' రామాభ్యుదయం 'అనే గ్రంధం యళోవర్మ రాసాడు.ఇందులో బంగారు లేడిని వెదుకుతూ లక్ష్మణుడు వెళ్ళి దాన్ని బంధించాడు. 'హా రామా 'అన్న కేక వినిపించడంతో సీతాదేవిని ఒంటరిగా వదలి రాముడు వెళ్ళినట్లు రాసాడు.జయదేవుడి ' ప్రసన్న రాఘవంలో ...,రావణుడు,బాణాసురుడు సీతాదేవి స్వయంవరానికి వచ్చినట్లు ఉంది.సీతాదేవి రాముడు స్వయంవరానికి ముందే ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్లు ఉంది.

హస్తిమల్లుడి 'మైధిలి కల్యాణం 'లో సీతాదేవి రాముడు కామదేవుని గుడిలో కలుసుకున్నట్లు ఉంది.' జానకి పరిణయం 'అనేగ్రంధం రామభద్ర దీక్షీతులు అనేఆయన రాస్తూ అందులో గొప్ప హస్య సన్నివేశాన్ని సృష్టించాడు. విరధుడు రాముని రూపంలో సీతకొరకు వస్తుండగా, శూర్పణఖ సీతాదేవి రూపంలో వస్తుంది.చివరకు విరధుడు సీతరూపంలోని శూర్పణఖను ఎత్తుకెళతాడు.

తెలుగు రంగనాధ రామాయణ విషేషాలు :

నిద్రదేవి లక్ష్మణునికి రెండు వరాలు ఇస్తుంది.ఒకటి అతని భార్యకునిద్ర ,రెండవది అరణ్యవాసంలో లక్షణునికి నిద్రరాకపోవడం.పంచవటి నిర్మాణం కొరకు వెదురుగడలు నరుకుతూ పొరపాటున శూర్పణఖ కుమారుడు ' శంబకుడు 'తల నరికివేసాడు.సీతదుతా దేవిని వదలివెళ్ళిముందు లక్ష్మణ రేఖలు గీసిన కథ ఇందులోనిదే!హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళినపుడు 'కాలనేమి' కథకూడా ఈతెలుగు రామయణసృష్టే. ఇది గోనబుద్ధారెడ్డి రచన.

మళయాళ ఆధ్యాత్మిక రామాయణ విషేషాలు:

వానరవీరుల భార్యలను చూడాలన్న సీతాదేవి కోరిక ఇందులోనిదే! ఎఝత్తాచకుడు ఈరామాయణాన్ని రచించాడు.తులసీదాసు రామాయణంలో రాముడే శూర్పణక ముక్కు చెవులు కోసి పంపమన్నాడని ఉంది.శ్రీరాముడు విష్ణువు అవతారం అనీ బ్రాహ్మణులు,బోధిసత్వుడి అవతారం అని బౌధ్ధులు,అష్టమ బ్రహ్మ దేవుడు అని జైనులు తమ మతాలకు అనుగుణంగా రామకథను మలుచుకున్నారు.

ఇలా ఎందరో మహనీయులు రామాయణాన్ని మనకు అందించారు. వారందరికి పాదాభివందనాలు చేసుకుంటూ, ' రామాయణానికి ముందు ' అనే కథలను ధారావాహికగా అందిచ బోతున్నాను. ఈకథల ప్రత్యేకత ఏమిటంటే ఈకథలలలో ఏపాత్ర పరిచయం ఔతుందో వారిగురించి వివరణ మీకు తెలియజెయబడుతుంది.

మీఅందరి ఆదరణ, సలహలు,సూచనలు కోరుకుంటూ ...

బుధజన విధేయుడు.

బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .

9884429899