ఆత్మసాక్షాత్కారం - సి.హెచ్.ప్రతాప్

Aatmasakshatkaaram


దుర్లభమైన నిర్వికల్ప సమాధిని ఆత్మదర్శనం లేదా స్వస్వరూప దర్శనం అంటారు. పరబ్రహ్మ సాక్షాత్కారం లేదా ఆత్మసాక్షాత్కారం పొందడమే నిజమైన పరమానందం. ఈ స్థితిలో సర్వం బ్రహ్మమయంగా అనిపిస్తుంది. ఉన్నది ఆత్మతత్వం తప్ప రెందవది లేని స్థితి కలుగుతుంది. ఈ అంశంపై భగవాన్ శ్రీ రమణమహర్షి తమ బొధలలో అద్భుతంగా విసదీకరించారు. భగవన్నామము’, ‘ఆత్మ’ ఒకటేనని చెప్పేవారు . ఆత్మసాక్ష్త్కారానికి ధ్యానం తొలి మెట్టు కింద ఉపకరిస్తుంది.సాధన తొలిదసలో భగవంతుని నామజపం ధ్యానానికి ఏకాగ్రతకు ఉపయుక్తంగా వుంటుంది. సాధకులు పవిత్ర హృదయంతో, నిశ్చల మనస్సుతో, సర్వశ్య శరణాగతి భావంతో భగవంతును నామంపై నమ్మకముంచితే ఆ భగవన్నామం మనసు విడువకుండా మనతో ఉంటుంది. భగవన్నామజపం మనలో నిరంతరం కొనసాగుతుంటే ఇతర విషయములపైకి మనసు పరిగెత్తకుండా, నిశ్చలవౌతుంది. అప్పుడు మనిషి తన నిజస్థితి (ఆత్మతత్వం)లో ఉంటాడు. ప్రయత్న పూర్వకంగా ధ్యాన జపాదులచేత మనస్సు ఇతర విషయాలపైకి మరలక నిశ్చలమై నిలిచినచో ఇక మిగతాది స్వస్వరూపమే! అంటారు శ్రీ రమణమహర్షి. చిత్తవృత్తులను నిరోధిస్తే పురుషుడు స్వస్వరూప జ్ఞానం పొందుతాడు అని పతంజలి యోగసూత్రాలలో స్వస్వరూప దర్శనం గురించి వివరించారు.దుర్లభమైన నిర్వికల్ప సమాధిని ఆత్మదర్శనం లేదా స్వస్వరూప దర్శనం అంటారు. పరబ్రహ్మ సాక్షాత్కారం లేదా ఆత్మసాక్షాత్కారం పొందడమే నిజమైన పరమానందం. చిత్వ దర్శనం తత్వ దర్శనం అంటోంది శాస్త్రం అంటే మనల్ని అనుక్షణం ఆందోళనలకు, అశాంతికి గురి చేసే చంచలమైన మన మనసును.. కనిపించే అన్ని వస్తువుల వెంట పడనీయక, దాన్ని ఆత్మ యందు (తనయందే) నిలిపి ఆత్మ స్వరూపాన్నే అనుసంధానం చేస్తూ.. తాను చిత్‌ (జ్ఞాన) స్వరూప ఆత్మను అని తెలుసుకున్నట్టయితే అదే తత్వ దర్శనం (ఆత్మసాక్షాత్కారం) అని దీని భావం.దృశ్య వారితం చిత్తం ఆత్మనః’ అంటే దృశ్యం వెంట పరుగులు తీసే మనసును వారించి తనయందే (తన ఆత్మ యందే) నిలపాలి. దృశ్యం ఉన్నంతవరకూ మనసు పరుగులు తీస్తూనే ఉంటుంది. ఏ వస్తువును చూసినా, ఎవరిని చూసినా ఏదో ఒక ఆలోచన వస్తుంది. దాని వెంట ఆలోచనల పరంపర కొనసాగుతుంది. తత్ఫలితంగా వికారాలు పుట్టూకొస్తాయి. మనస్సులో కామ, క్రోధాది అరిషడ్వర్గాలు విజృంభింస్తాయి. ఆత్మ సాక్షాత్కారమైన వారికి పునర్జన్మ లేదని, మోక్షము పొందుదురని, ఆత్మసాక్షాత్కారము కాని వారు వారి కర్మననుసరించి మరల మరల జన్మిస్తారని చెప్పబడినది.

యోగవాశిస్టంలో ఆత్మ సాక్షాత్కారం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వబడింది. " ఆత్మ సాక్షాత్కారమను యత్నముచే చిత్తమను బాలుడు, మిథ్యయగు సాంసారికపదార్థ సముదాయము నుండి తొలగింపబడి, ఆత్మ స్వరూపమును సత్యవస్తువు యందు నియోజితుడై జ్ఞాన యుక్తుడు గావింపబడి రక్షింపబడుచున్నాడు.

ఉత్తమ ఫలదాయకమగు సమాధియను సత్కర్మ యందు మనస్సు నుపయోగించి, అట్టి సమాధి ద్వారా చిదాత్మ తోటి మనస్సు నైక్యపరచవలెను. ఆత్మసాక్షాత్కార సాధ్యమగు మనోనాశముచే (మనోనాశమంటే, మనస్సును ఆలోచనలు లేకుండా చేయటం) కామాది శత్రురహితమై ఆద్యంతరహితమగు స్వరాజ్య సుఖము నీదేహముండగనే సంపాదింపుము. ఆత్మసాక్షాత్కారముచే సంకల్పములను, అనర్థములను నిర్మూలన మొనర్చుటచే ప్రశాంత మగు జీవన్ముక్త స్థితి లభించును. మనుజదేహధారి, అధికారియగు జీవునకిద్దాని యందు క్లేశమేమి కలదు? "