స్క్రీన్ టైం - రవిశంకర్ అవధానం

Screen TIme

"పిన్ని గారు, నేను పిల్లల్ని తీసుకొని  డిడి - కాలనీ డాక్టర్ దగ్గరికి వెళుతున్న, రఘు వస్తే కాస్తా కీస్ ఇస్తారా"అంది రాజి గుమ్మం ముందు నిలపడి.

"అంతా ఒకే నా? డాక్టర్ దగ్గరకి దేనికి అంది శకుంతల, రాజీ ఇస్తున్న కీస్ తీసుకుంటూ.

"బాబుని , కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళుతున్నా పిన్ని" అంది రాజి.

"లాస్ట్ వీకే గా వెళ్ళావ్?" అంది శకుంతల.

"అది పాప ని చూపించడానికి, జీతాలన్నీ వీటికే సరిపోతోంది పిన్నీ " అంటూ రాజి వెళ్ళి పోయింది.

"ఇంత చిన్న వయసులో పిల్లల కంటికి అద్దాలు పాపం, అంటూ కీస్ని గోడకున్న హుక్కుకు తగిలించింది.

45 ఏళ్ళ దినచర్య, డైరీ రాస్తున్న నరసింహం, శకుంతల మాటలకు స్పందిస్తూ

" టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని డిజిటల్ ఈ రోజుల్లో. ఇవి చాలదన్నట్టు ప్రతిఒక్కరి చేతుల్లో, పెద్దా-చిన్నా తేడా లేకుండా స్మార్ట్ ఫోన్స్. ఇవ్వన్నీ అయ్యాక ఫ్యామిలీ టైం అంటూ టీవీ చూడటం డైలీ రొటీన్ అయింది. ఇంత స్క్రీన్-టైం అలవాటై అది  కళ్ళూ , వళ్ళు అన్నిటి మీద ప్రభావం చూపుతోంది. కంటికి అద్దాలు, వంటికి ఒబేసిటీ ఇంకా ఎన్నో " అన్నాడు నరసింహం డైరీ మూస్తూ.

"నిజమేనండి, ఛానెళ్ల సంఖ్య 300 పైచిలుకే. ఇవి చాలదన్నట్టు, నెట్ఫ్లిక్స్న ,అమెజాన్, ఆహా, ఓహోలు.

ఈ ఛానెళ్లలో ఏది లేక పోయిన అదొక ప్రిస్టేజ్ ఇష్యూ లాగ అయిపొయింది ఈ సమాజం లో " అంది శకుంతల.

" శకుంతల, నీకో విషయం చెబుతా విను. సగటు వ్యక్తి రోజుకు 6 గంటల 58 నిమిషాలు స్క్రీన్లను చూస్తూ గడుపుతాడు. అది రోజులో పావు వంతు కంటే ఎక్కువ! వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్లు, రిమోట్ స్కూలింగ్ స్క్రీన్టైం వినియోగాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా కోవిడ్ అప్పుడు ఈ ట్రెండ్ మరీ పెరిగింది. ఒక సరదా వాస్తవం ఏమిటంటే, ఒక వ్యక్తి రోజుకు 6 గంటల పాటు నెట్ఫ్లిక్స్ని చూడటం ప్రారంభించినట్లయితే, ప్లాట్ఫారమ్లో ఉన్న ప్రోగ్రామ్స్ చూడటం పూర్తి చేయడానికి 36 సంవత్సరాలు పడుతుంది!" అన్నాడు నవ్వుతూ.

"అలాగైతే, యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ అంతా చుడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతిందో, ఊహ కే అందదేమో " అంది శకుంతల.

"ఫోన్కి దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అసౌకర్యంగా అనిపించిందా? దీనిని నోమోఫోబియా అంటారు ("నో-మొబైల్-ఫోన్-ఫోబియా"), స్మార్ట్ఫోన్ వ్యసనంతో ముడిపడి పెరుగుతున్న పైత్యం ఇది. ప్రపంచ జనాభాలో దాదాపు 66% మంది నోమోఫోబియా సంకేతాలను చూపుతున్నారట, అదీ కాకుండా 58% మంది తమ ఫోన్లను చెక్ చేయకుండా ఒక గంట కంటే ఎక్కువ సమయం గడపలేరట. అంటే సగటు వ్యక్తి స్మార్ట్ఫోన్ను రోజుకు 344 సార్లు లేదా దాదాపు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి చూస్తాడు.

సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో 2 గంటల 31 నిమిషాలు గడుపుతాడు, ఇంస్టాగ్రామ్ ,ఫేసుబుక్ , టిక్-టాక్ వంటి యాప్లు అధికంగా చూసే వాటిల్లో ఉన్నాయి.

"నిజమేనండి, అదీ కాకుండా, స్క్రీన్ లైట్ వల్ల రాత్రి, మన నిద్రకు భంగం కలిగిస్తుంది. నీలి కాంతికి గురికావడం వల్ల నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ 85% వరకు అణిచివేస్తుందని రోహన్ కూడా ఎప్పుడూ అంటూంటాడు. 71% మంది పెద్దలు తమ ఫోన్ను తమ పక్కన లేదా దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నారని, ఇది వారి నిద్రను మరింత ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి అంటాడు వాడు.

8 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ప్రతిరోజూ సగటున 4 గంటల 44 నిమిషాలు స్క్రీన్లపై గడుపుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి, అయితే టీనేజ్ (13 నుండి 18 సంవత్సరాల వయస్సు) వారు రోజుకు 7 గంటల 22 నిమిషాలు గడుపుతున్నారు" అంది శకుంతల.

"అందుకే పిల్లలకు బూతద్దాలో సోడా బుడ్డి అద్దాలో వస్తున్నాయి" అన్నాడు నరసింహం నిట్టూరుస్తూ!

"అర్రే రే! టైం 7 అయినట్టుంది,” అంధకారం” సీరియల్ టైం " అంటూ రిమోట్ అందుకుంది శకుంతల.

" రామాయణం అంతా విని రిమోట్ ఎక్కడ అంటావేంటే! అంటూ టీవీ రిమోట్ అందించాడు నరసింహం తన అహోబిళ మఠం ఈవెనింగ్ వాక్ కి కుర్చీ నుంచి లేస్తూ.

 

మరిన్ని వ్యాసాలు

సిని నారదులు .11.
సిని నారదులు .11.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Ott
వ్యాసావధానం - OTT
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.10.
సిని నారదులు.10.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు 9
సిని నారదులు 9
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు 8.
సిని నారదులు 8.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.7.
సిని నారదులు.7.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.6.
సిని నారదులు.6.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు