అందం - చందం - మానస

 

పెదాల సంరక్షణ ఇలా...

ఎర్రటి పెదాలకు..!

 

కొంతమంది పెదాలు నల్లగా ఉంటాయి. కొన్ని చిట్కాల ద్వారా వాటి రంగును పోగొట్టి ఎర్రగా అయ్యేట్టు చేయవచ్చు.
 

*మెత్తగా ఉండే బ్రష్‌తో పెట్రోలియం జెల్లీని పెదవులపై రెండు నిమిషాలపాటు నెమ్మదిగా రుద్దాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కొని ఆలివ్‌ ఆయిల్‌ రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే చాలా త్వరగా పెదవులపై నల్లరంగు పోతుంది.

*తేనెలో నిమ్మరసం లేదా గ్లిజరిన్‌ లేదా పసుపు కలపాలి. ఆ మిశ్రమంతో రెండురోజులకొకసారి పెదాలను మర్దన చేసుకోవాలి.

*గులాబీ రెబ్బల్ని పాలల్లో మూడుగంటపాటు నానబెట్టాలి. ఈ పాలను పెదాలపై రాసుకొని రెండు నిమిషాలపాటు నెమ్మదిగా రుద్దుకోవాలి.

*లిప్‌స్టిక్‌ని ఎక్కువగా వాడకూడదు. అలాగే వాడే లిప్‌స్టిక్‌లో జోజోబా ఆయిల్‌, విటమిన్‌-ఇ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

*కెఫిన్‌ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడంవల్ల పళ్లు, పెదాలపై మచ్చలు ఏర్పడతాయి. అందుకని వాటిని తక్కువగా తీసుకోవడం మంచిది.

మృదువైన పెదాల కోసం..

*పెదవులు అందంగా, మృదువుగా కనిపించేందుకు రసాయనాలతో పనిలేకుండా కొన్ని చిట్కాలున్నాయి.

* బీట్‌రూట్ రసాన్ని పెదవులకి రాస్తుంటే పెదాలు ఎర్రగా మారడం ఖాయం.

* పంచదార పొడిలో వెన్న కలిపి పేస్ట్‌లా చేసి పెదవులపై సున్నితంగా మర్దన చేయాలి.

* గులాబీ పూరేకుల్లో వెన్నవేసి మెత్తటి పేస్ట్ చేసి రాసుకుంటే పెదవులు అందంగా తయారవుతాయి.

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu -  doorapu kondalu nunupu
కాశీ ప్రయాణ కథలు - దూరపు కొండలు..
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు
రామానాయుడు
- .డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.