వార ఫలం (ఆగష్టు 23 - ఆగష్టు29) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలు కలుగుటకు ఆక్సరం కలదు. శుక్ర,శని,ఆదివారాల్లో ఆలోచనలు పెరుగుతాయి కొంత మేర అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సోమ,మంగళ వారాల్లో చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయగలరు.పెద్దల సూచనల మేర పనులలో జాగ్రత్తలు వహించుట కలిసి వస్తుంది. బంధువులతో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. బుధ,గురువారాల్లో పనులను జాగ్రత్తగా మాట్లాడుట ద్వార ముందుకు తీసుకువెళ్ళడానికి  ప్రయత్నాలు చేయండి. వారం మధ్యలో మరియు చివరలో అనుకోని ఖర్చులు కలుగుటకు ఆస్కారం కలదు సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. భయాన్ని పొందుతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధను తీసుకోండి. తలపెట్టిన పనులలో సానుకూల ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబ సభ్యుల మూలాన శ్రమను పొందుతారు అకారణంగా మాటపట్టింపులకు పోకండి. అందరి ఆలోచనలు గౌరవించుట మీకే మేలుచేస్తుంది.     

వృషభ రాశి

ఈవారం కొంత అనుకూలమైన ఫలితాలను పొందినను నిదానంగా వ్యవహరించుట మంచిది. శుక్ర,శని,ఆదివారాల్లో తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికంగా బాగనే ఉంటుంది,బంధవుల నుండి సంతోషకరమైన వార్తను వినే అవకాశం కలదు. సోమ,మంగళ వారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో జగ్రత్తగా ఉండుట మేలుచేస్తుంది. అధికమైన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు నిదానంగా ప్రయత్నం చేయుట ఉత్తమం. బుధ,గురు వారాల్లో ధాన్యసంవృద్దిని కలిగి ఉంటారు. ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం కలదు వారితో చర్చలలో పాల్గొంటారు. అధికారులతో మాత్రం నిదానంగా నడుచుకొనుట మేలుచేస్తుంది ఓపికను ప్రదర్శించుట మేలు. ధర్మసంభంద పనులలో పాల్గొనుట వలన మేలుజరుగుతుంది. క్రిందిస్థాయి ఉద్యోగుల మూలాన లాభంను పొందుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు.  

మిథున రాశి
ఈవారం నూతన ఆలోచనలు కలిగి ఉంటారు చేసేపనులలో వేగం వద్దు. శుక్ర,శని,ఆదివారాల్లో నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.  సోమ,మంగళ వారాల్లో అనుకున్న సమయానికి తలపెట్టిన పనులను పూర్తిచేయుటకు ఆస్కారం కలదు. ఏమైనా నూతన పనులను ఆరంభించుటకు ఈ సమయం అనుకూలమైనదిగా భావించి ముందుకు వెళ్ళండి. బంధవుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు వారిని కలువడానికి చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. బుధ,గురువారాల్లో మాత్రం అనుకోని ఖర్చులు కల్గుతాయి వినోదాలలో పాల్గొంటారు. సంతానమూలక సౌఖ్యంను కలిగి ఉండే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి కాకపోతే ఆలోచన కలిగి ఉండుట మేలుచేస్తుంది. చేడుస్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. క్రయ,విక్రయాల మూలాన లాభంను పొందుతారు. కుటుంభంలో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో తొందరపాటు కూడదు.
 

కర్కాటక రాశి
ఈవారం పనిలో మొదట్లో ఉన్న ఉత్శాహంను చివరివరకు కొనసాగించే ప్రయత్నం చేయండి. శుక్ర,శని,ఆదివారాల్లో అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. పనులలో ఆలస్యం అయ్యే అవకాశం కలదు. కుటుంభానికి సంభందించిన విషయాల్లో నిదానం అవసరం అవతలి వారి మాటను వినే ప్రయత్నం చేయుట మంచిది. సోమ,మంగళ వారాల్లో ప్రయత్నాలకు అనువైన సమయం ముందుకు వెళ్ళండి. బుధ,గురువారాల్లో ప్రయత్నాలలో మంచి ఆలోచనలు చేయుట మూలాన లాభంను పొందుతారు. అనుకున్న పనులను పూర్తిచేయుటకు అవకాశం కలదు. కొన్ని విషయాల్లో మనస్తాపంను పొందుటకు అవకాశం కలదు నిదానంగా ఉండండి. వాహనముల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం అవసరమైతేనే ప్రయణం చేయుట మంచిది. బంధువులతో కలిసి పనిచేయునపుడు నిదానం అవసరం సర్దుకుపొండి ఫలితాలను ముందే ఆశించుట వద్దు. శుభకార్యములను చేపట్టుట చేత ఖర్చును కలిగి ఉంటారు ప్రయాణాలు చేస్తారు. వ్యతిరేక వర్గం నుండి తిప్పలు తప్పక పోవచ్చును జాగ్రత్త నిదానంగా వ్యవహరించుట మేలు.    

సింహ రాశి
ఈవారం శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి చేపట్టిన పనులలో కొంత రక్షణాత్మక దొరని ఉండుట మేలు. శుక్ర,శని,ఆదివారాల్లో అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో ప్రత్యేకశ్రద్ధను తీసుకోండి మేలుచేస్తుంది. సోమ,మంగళవారాల్లో ముఖ్యంగా పనులకు సంభందించిన విషయాల్లో తొందరపాటు వద్దు. కుటుంభంలో వచ్చు చిన్న చిన్న సమస్యలకు అతిగా స్పందించక పోవడం మేలు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. బుధ,గురువారాల్లో ధనాదాయం బాగుంటుంది. మంచిపనులను చేపట్టుట ద్వార గౌరవాభివృ ద్దిని కలిగి ఉంటారు. పనులకు సమయాన్ని కేటాయించి పూర్తిచేయుట ఉత్తమం. బంధువులతో కలిసి చేపట్టు పనులలో అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చును నిదానంగా వ్యవహరించుట మేలు. ఉద్యోగస్థానంలో భాధ్యతాయుతంగా నడుచుకోండి సమయపాలన అవసరం. నిదానంగా ముందుకు వెళ్ళడం చేత ఒక్కొక్క సమస్యను అధిగమిస్తారు. ఈవారంలో వస్త్రలాభంను పొందు అవకాశం కలదు. మీ ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు.
 

కన్యా రాశి
ఈవారం సరైన ఆలోచనలు చేయుట మూలాన పనులలో అలాగే వ్యాపారంలో లాభంను పొందుటకు అవకాశం కలదు. శుక్ర,శని,ఆదివారాల్లో కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్తారు లభంను పొందుటకు అవకాశం ఉంది. సోమ,మంగళ వారాల్లో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. అజీర్తి మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలో కొంత శ్రమను కలిగిఉంటే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. బుధ,గురువారాల్లో వారంలో అనుకోని ప్రయాణాలు చేయవలసి రావోచ్చును వాటి మూలాన కొంత ఇబ్బందికి గురవుతారు. కుటుంభంలో నూతన ఆలోచనలు చేయకండి. గట్టిగా ప్రయత్నం చేయుట మూలాన పనులలో విజయంను పొందుతారు. ధనం సర్దుబాటు అవడం చేత ఇబ్బందులు కలుగకపోవచ్చును. భయాన్ని పొందుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి, పనులు మొత్తం మీద నిదానంగా సాగుతాయి.

తులా రాశి
ఈవారం ప్రతివిషయంలోను అవగాహనతో మెలగండి తప్పక అనుకూలమైన ఫలితాలను పొందుతారు శ్రమను కలిగి ఉండుట సూచన. శుక్ర,శని,ఆదివారాల్లో కుటుంభంలో మంచి మార్పులు కలుగుటకు అవకాశం ఉంది అలాగే అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే సంప్రదాయబద్దంగా నడుచుకొనుట మంచిది. సోమ,మంగళ వారాల్లో కొంత ఇబ్బందికరమైన వార్తను వినే అవకాశం కలదు. చేపట్టిన పనులు ముందుకు సాగకపొవచ్చును నిదానం అవసరం. బుధ,గురువారాల్లో పనులలో సరైన ఆలోచనలు చేయకపోవడం మూలాన ఆలస్యం అయ్యే అవకాశాలు కలవు. మనోవిచారంను పొందుతారు. శుభకార్యములలొ పాల్గొంటారు మధురపదార్థములయందు యందు ఆసక్తిని కలిగి ఉంటారు. సంచారం చేయుట మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును.గృహంవిషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు గట్టిగా ప్రయత్నం చేయుట ఉత్తమం. వస్తువులను పోగాట్టుకొనే అవకాశం ఉంది జాగ్రత్త,వృత్తిలో ఆటంకాలు కలుగుతాయి.  

వృశ్చిక రాశి
ఈవారం మంచిఫలితాలను పొందాలని ఆలోచన చేయుటకంటే సరైన ఆలోచనల వైపు అడుగులు వేయుట మంచిది. శుక్ర,శని,ఆదివారాలలో ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలు రాకపోవడం మూలాన ఆందోళనకు గురయ్యే అవకాశం కలదు. బంధుమిత్రులతో అకారణంగా వివాదములు కలుగుటకు అవకాశం ఉంది కావున మీ జాగ్రత్తలో మీరు ఉండండి. సోమ,మంగళ వారాలలో మంచి ఫలితాలు కలుగుటకు అవకాశం కలదు,పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకోండి నిదానంగా ప్రయత్నించుట మంచిది. బుధ,గురువారాలలో ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని అవకాశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. నూతనపనులను చెపడుతారు. కుటుంభంలో కలిగిన మార్పులు సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఇతరులకు సేవచేయాలనే తలంపును కలిగి ఉంటారు. స్థానచలనంకు అవకాశంకలదు భోజనం విషయంలో శ్రద్ధను వహించుట మంచిది. చేపట్టిన పనులలో ఉత్సాహంను కోల్పోతారు కావున ప్రయత్నం అవసరం. కోపంను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మీ హద్దులో మీరు ఉండుట మంచిది. కీర్తిని పొందాలనే కాంక్ష ఉంటుంది దానికి తగ్గ ఆలోచనలు అవసరం. 

ధనస్సు రాశి
ఈవారం కొంత ప్రతికూలమైన వాతావరణంను ఎదుర్కొంటారు. శుక్ర,శని,ఆది వారాలలో చేపట్టిన ప్రయత్నాలలో ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బాగాఆలోచించి పనులను చేపట్టుట మేలు తొందరపాటు కూడదు. సొమ,మంగళ వారాల్లో అశుభవార్తను వింటారు. ఆశించిన ఫలితాలు రాకపోవడం మూలాన కొంత బాధను పొందుటకు అవకాశం ఉంది. మానసిక ఆందోళనను కలిగి ఉంటారు. బుధ,గురువారాల్లో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్తారు. వారంలో కొంత వరకు అనుకోని ఖర్చులను పొందుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావోచ్చును స్వల్ప ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు. మీ ఆలోచనలను తోటివారు వ్యతిరేకిస్తారు వారిని ఇబ్బందిని కలిగించే నిర్ణయాలను తీసుకుంటారు. ఇష్టమైన పనుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. వ్యతిరేకవర్గం విషయంలో జాగ్రత్తగా నడుచుకోండి వారితో నిదానంగా వ్యవహరించుట సూచన.  

మకర రాశి
ఈవారం మీరు ఆలోచనలు అమలు చేయు విషయంలో నిదానంగా మరియు జాగ్రత్తగా వ్యవహరించుట ఉత్తమం. శుక్ర,శని,ఆదివారాల్లో ఇష్టమైన పనులను చేపట్టి పూర్తిచేస్తారు. నచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడిపే అవకాశం కలదు. ధనలాభంను పొందుటకు అవకాశం ఉంది. సోమ,మంగళ వారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. బుధ,గురువారాల్లో ప్రయత్నాలు అనుకూలించక పోవచ్చును. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వ్యతిరేక వర్గం నుండి ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి పనిభారంను పొందుతారు. కుటుంభంలో కలుగు చిన్న చిన్న సమస్యల విషయంలో చూసి చూడ నట్లు నడుచుకొనుట మేలు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. అధికారులతో వారికి అనుగుణంగా నడుచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. గురువుల యెడల భక్తిని కలిగి ఉంటారు. మంచి ప్రవర్తనతో అందరిని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు. నూతన వస్త్రప్రాప్తిని కలిగి ఉంటారు. 

కుంభ రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలు వస్తాయి పనులలో నిదానం అవసరం. శుక్ర,శని,ఆదివారాల్లో ఇతరులతో కలిసి పనిచేయునపుడు నిదానం అవసరం. అనారోగ్యసమస్యలు వేదిస్తాయి జాగ్రత్త అవసరం. సోమ,మంగళ వారాలలో కొంత బాగుంటుంది. చేపట్టిన పనులలో ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. బుధ,గురు వారాల్లో ప్రయత్నాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుట వలన మేలుజరుగుతుంది. అనవసరపు ఆందోళన పొందుతారు. కుటుంభంలో ఒకరికి కలుగు అనారోగ్యం ఒకింత బాధకు గురిచేస్తుంది. చేపట్టిన పనులలో సాధారణంగా ఉత్సాహంను కోల్పోయే అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. అధికారుల వలన స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి నిదానంగా అవసరం. అనుకోని ఖర్చుల మూలాన ధననష్టం అవుతుంది జాగ్రత్త. కుటుంభంలో కలుగు మార్పులు స్వాగతించుట మేలు. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు విందులకు అవకాశం ఉంది పల్గొంటారు. నూతన అవకాశాలు కలుగుతాయి పెద్దవాళ్ళను కలుస్తారు.    

మీన రాశి
ఈవారం అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. శుక్ర,శని,ఆదివారాల్లో సంతోషంను పొందుతారు. భోజనసౌఖ్యం ఉంటుంది మృష్టాన్న భోజనప్రాప్తి కలుగుతుంది. ధనం విషయంలో సంతృప్తిని పొందుతారు. సోమ,మంగళ వారాల్లో అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది. తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. బుధ,గురువారాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. ఇష్టమైన వారిని కలుస్తారు వారితో చర్చలలో పాల్గొంటారు. ప్రయత్నాలలో విజయంను కలిగి ఉంటారు. ధనధాన్య సంవ్రుద్దిని కలిగి ఉంటారు. నూతన అవకాశాలకు చేయుప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. చర్చలలో పాల్గొన్నపుడు మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. విద్యాసంభందమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. వినొదముల కోసం సమయన్ని కేటాయిస్తారు. ప్రయణం చేయవలసి రావోచ్చును. స్థానచలనం ఉంది. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. కోపంను కలిగి ఉంటారు అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో సాధారణంగా ఉంటుంది అందరిని కలుపుకొని వెళ్ళుట ఉత్తమం.   

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం