కొమర్రాజు లక్ష్మణ రావు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కొమర్రాజు లక్ష్మణ రావు.

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు.(మే18 వతేది జయంతిసంధర్బంగా)

బాషా భూషణుడు, విజ్ఞాన చంద్రికా మండలి స్ధాపకుడు, విజ్ఞాన నిపుణుడు మాతృభాషాభిమాని అయిన లక్ష్మణరావుగారు ఆంధ్రరచయితలలో, ఆంధ్రా చెరిత్రోధారకుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు. వీరు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో 1876/ మే /18న కొమర్రాజు వెంకటప్పయ్య గంగమాంబల ప్రధమ సంతానంగా జన్మించారు. బాల్యంలో తండ్రిని కోల్పోయారు. ప్రాథమిక విద్య దేవరకొండలోనూ, అనంతరం తన మేనమామ సోదరి అచ్చమాంబ భర్త బండారు మాధవరావు ఇంటివద్ద ఉంటూ బి.ఏ. పూర్తిచేసారు.

అప్పుడే మరాఠి భాషపై పట్టు సాధించి 'సమాచార్' - 'వివిధ జ్ఞానవిస్తార్' వంటి పత్రికలకు తన రచనలను పంపేవారు. అనంతరం కలకత్తాలో ఎం.ఏ. ఉత్తీర్ణత సాధించారు. అలా ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం, గుజరాతీ, హిందీ, పాళీ, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో విషేష పరిజ్ఞానం సంపాదించారు.

1901/సెప్టెంబర్ /1వతేదిన 'శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషానిలయం' స్ధాపనకు ముఖ్యకారకులు అయ్యారు. తద్వారా నాయని వెంకట రంగారావు, రావి చెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు మోదలగువారి ప్రోత్సాహించి తెలంగాణాలో గ్రంథాలయోధ్యమానికి వైతాళికుడు అయ్యారు. వరంగల్లులో 'రాజ రాజ నరేంద్ర గ్రంథాలయం స్ధాపించి నాటి నిజాం పాలనలో తెలుగువారిని అందరిని సమైక్యపరచి చైతన్యం కలిగిస్తూ తెలుగుభాషా స్వేఛ్ఛకు, అభివృధ్ధికి నిర్విరామ కృషి చేసారు.

భారతదేశంలో రాజకీయాలు 'వందేమాతరం' ఉద్యమం 1907 నాటికి తీవ్రరూపం దాల్చాయి. అదే సమయంలో లక్ష్మణరావుగారు రాజకీయ సభలకు ఆహ్వానింపబడ్డారు. అలా సభల ఆహ్వాన సంఘ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. మద్రాసులో తెలుగువారిని చైతెన్య పరచడానికి
'బిపిన్ చంద్రపాల్' గారి రాజకీయ ప్రసంగాన్ని ఏర్పాటుచేసి ఆంధ్రోధ్యమానికి నాంది పలికారు. గాడిచర్ల సర్వోత్తమరావు, అయ్యదేవర కాళీశ్వరరావు వారిని ప్రోత్సహించి సామాజిక సంస్కరణలు, రాజకీయోధ్యమాలవైపు నడిపించారు. చిలుకూరి వీరభధ్రరావు, మల్లెంపల్లి సోమశేఖర శర్మలకు చరిత్ర రచనలో తర్పిదు ఇచ్చి తెలుగు వారి చరిత్ర రాయడానికి సుగమనం చేసారు.

తను స్వయంగా 'హిందూ మహా యుగం' - 'మహ్మదీయ మహా యుగం' అనే గ్రంధాలను తెలుగులో రచించారు. తెలుగు భాషా సంస్కృతులను ప్రోత్సహించడం నుంచి 'విజ్ఞాన చంద్రికా పరిషత్తు' ను స్ధాపించి తెలుగు భాషలో పరిశోధక గ్రంధాలకు శ్రీకారం చుట్టారు. 1912/మే/ 15/16 వ తేదిలలో జరిగిన 'ఆంధ్ర సాహిత్య పరిషత్ సభ' కు అద్యక్షత వహించారు. పచ్చయప్పస్ కళాశాలలో జరిగిన ఈ పండిత పరిషత్ లో తెలుగు భాషా సిధ్ధాంతాలను సమర్ధిస్తూ 'ఏ మెమొరాండం ఆన్ తెలుగు ప్రెస్' అనే నివేదికను మద్రాసు ప్రభుత్వానికి అందజేసారు.

1916 లో అనంతపూర్ లోనూ,1921లో మదనపల్లిలో జరిగిన రాజకీయ మహా సభల్లొ అధ్యక్షకునిగా ఉపన్యసించారు. గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారిచే 'అబ్రహం లింకన్' చరిత్రననూ, కందుకూరి వారి స్వియ చరిత్ర రెండు భాగాలు, రావిచెట్టు రంగారావు గారి జీవిత చెరిత్రను, అర్ధశాస్త్రం రెండుభాగాలు, కట్టమంచి రామలింగా రెడ్డిగారితో 'జీవశాస్త్రం' అచంట లక్ష్మిపతి వారితో 'రసాయన శాస్త్రం' వేమూ విశ్వ నాథ శర్మగారిచే 'వ్యవసాయ శాస్త్రం' రాయించి విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి తరుపున ప్రచురించారు. తెలుగు జాతి విధ్య విజ్ఞాన వికాశాలు పెంపోందించడమే లక్ష్యంగా అలుపు ఎరుగని సేవలు అందించిన వీరు తన 46 ఏట 1923/ జూలై/13న తెలుగు తల్లి ఒడిలో శాశ్విత నిద్రలో ఒరిగి పోయారు.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు