Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sonalichouhan so lucky

ఈ సంచికలో >> సినిమా >>

బన్నీ ఇంకో 50 కొడతాడా?

can bunny hits more 50

అల్లు అర్జున్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాలతో సూపర్‌ హిట్స్‌ సాధించాడు. రెండూ చెరో యాభై కోట్లు వసూలు చేసిన చిత్రాలే. ‘రేసుగుర్రం’ అత్యధికంగా 59 కోట్లు వసూలు చేయగా, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ 53 కోట్లు పైన వసూలు చేసింది. చాలా రేర్‌ ఫీట్‌ ఇది. బాగానే వుంది, బాగా లేదు అనే టాక్‌తో ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ మంచి హిట్‌ సాధించడం బన్నీ స్టామినాకి నిదర్శనం.

‘రేసు గుర్రం’ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’లో ఉంటే, ఖచ్చితంగా అల్లు అర్జున్‌ 60 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయేవాడే. టాలీవుడ్‌లో ఇప్పటిదాకా హయ్యస్ట్‌ వసూళ్ళు ‘అత్తారింటికి దారేది’ చిత్రం పేరు మీద ఉన్నాయి. ఆ తర్వాతి ప్లేస్‌ ‘మగధీర’ కాగా, మూడోది ‘గబ్బర్‌సింగ్‌’. నలభై కోట్ల పైన ప్రతి సినిమాతోనూ వసూళ్ళు సాధిస్తున్న హీరోగా (తొలి సినిమా చిరుత, మూడో సినిమా ఆరెంజ్‌ మినహా) రామ్‌చరణ్‌ రికార్డులకెక్కాడు. అల్లు అర్జున్‌ వెను వెంటనే రెండు సినిమాలతో చెరో యాభై కోట్లు కొల్లగొట్టడంతో మూడో సినిమాతోనూ 50 పైన కొడితో ఇది ఇంకో రికార్డ్‌ అవుతుంది. ఆల్‌ ది బెస్ట్‌ టు అల్లు అర్జున్‌.

మరిన్ని సినిమా కబుర్లు
no words on bahubali..