Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movies trend

ఈ సంచికలో >> సినిమా >>

3డి టీవీ కొంటారా?

will people buy 3D tvs

'యాక్షన్‌ త్రీడీ' సినిమా వచ్చింది. 'ఓం త్రీడీ' వస్తోంది. ఇంకా ఇలాంటి సినిమాలు చాలానే రాబోతున్నాయి. ఇంగ్లీషులో చాలా సినిమాలు త్రీడీ ఫార్మాట్‌లోకి మారుతున్నాయి. దాంతో టీవీల్లోనూ త్రీడీ సినిమాలు ఎక్కువగా చూసే రోజులు వస్తాయి. అతి సాధరణ విషయంగానూ త్రీడీ సినిమాలు బుల్లితెరపై చూడ్డం జరగవచ్చు.

త్రీడీ టీవీలు కూడా విస్తారంగా మార్కెట్‌లోకి వస్తున్నా, వాటి ఖరీదు చాలా ఎక్కువగా వుంటోంది. అన్నీ త్రీడీ ప్రోగ్రామ్స్‌ మాత్రమే వుండవు కదా. త్రీడీ టీవీలో రెండిటికీ తగ్గట్టు ఆప్షన్‌ వున్నా, త్రీడీ టీవీల సేల్స్‌ అంతగా పెరగడంలేదంటే వాటి ఖరీదే అందుకు ప్రతిబంధకంగా మారింది.

కళ్ళజోడు పెట్టుకుని సినిమా చూడాలని ఎవరికైనా సరదాగా వుంటుంది. పిల్లల్లో ఈ సరదా ఎక్కువ. టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి వస్తే, ఆటోమేటిగ్గా త్రీడీ టీవీల ధరలు తగ్గుతాయి. ఆ తర్వాత త్రీడీ సినిమాలు.. త్రీడీ టీవీ ప్రోగ్రామ్స్‌ కూడా వచ్చేయొచ్చు. అప్పుడు త్రీడీ టీవీల కొనుగోళ్ళు కూడా పెరుగుతాయి.

మరిన్ని సినిమా కబుర్లు
not thinking about acting