Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ramajogayya shastry patience

ఈ సంచికలో >> సినిమా >>

ఈ అందగాడి భవిష్యత్తు

future of this handsome

'కర్మ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అడవి శేష్‌ మల్టీ టాలెంటెడ్‌. మంచి మ్యూజిక్‌ సెన్స్‌ వుందాయనకి. నటనా ప్రతిభకు కొదవ లేదు. సంగీతంపై పట్టున్న అడవి శేష్‌ ప్రస్తుతం 'కిస్‌' సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్నాడు. పాటలు కూడా రాయగలడితడు.

పవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన 'పంజా' సినిమాలో యంగ్‌ విలన్‌గా కన్పించి, తనదైన స్పెషల్‌ బాడీ లాంగ్వేజ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మోడ్రన్‌ యాక్సెంట్‌లో అతను చెప్పే డైలాగ్స్‌ సూపర్బ్‌గా వుంటాయి. పైగా అందగాడు. నెగెటివ్‌ రోల్‌ అయినా, హీరో రోల్‌ అయినా అతనికి కొట్టిన పిండి. ఇప్పుడితడు పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

'బాహుబలి' సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు అడవి శేష్‌. దర్శకత్వంపైనా అవగాహన వున్న అడవి శేష్‌, 'కిస్‌' సినిమాతో సత్తా చాటుకోవడానికి సిద్ధమయ్యాడు. మల్టీ టాలెంటెడ్‌ అడవి శేష్‌ భవితవ్యం 'కిస్‌' సినిమా తేల్చనుంది. టైటిల్‌ సాంగ్‌ ఆల్రెడీ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

మరిన్ని సినిమా కబుర్లు
why sharwanand ignored his business