Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
future of this handsome

ఈ సంచికలో >> సినిమా >>

శర్వానంద్‌ ఎందుకు పట్టించుకోలేదో?

why sharwanand ignored his business

సెలబ్రిటీలకీ రెస్టారెంట్‌ బిజినెస్‌లకీ ఏదో అవినాభావ సంబంధం వున్నట్టుంది. క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు కూడా రెస్టారెంట్‌ బిజినెస్‌లపై ఆసక్తి చూపుతారు. సినీ ప్రముఖులూ ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా ఈ ట్రెండ్‌ నడుస్తోంది.

టాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత కూచిపూడి వెంకట్‌ హైద్రాబాద్‌లో స్థాపించిన ఉలవచారు రెస్టారెంట్‌ తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ సుపరిచితమైపోయింది. ఆ రెస్టారెంట్‌లో కొన్ని ఐటమ్స్‌కి తెలుగు సినీ ప్రముఖులు ఫిదా అయిపోయారు. జిహ్వచాపల్యం ఎక్కువ వున్న మామూలు వారికీ ఈ రెస్టారెంట్‌ ఫేవరెట్‌గా మారిపోయింది.

తెలుగు హీరో శర్వానంద్‌ కూడా ఓ రెస్టారెంట్‌ స్థాపించాడు. 'బీన్జ్‌' దాని పేరు. అయితే దాన్ని సరిగ్గా పాపులర్‌ చేయలేకపోయాడు శర్వానంద్‌. రెస్టారెంట్‌ బిజినెస్‌ చేయాలంటే దానికి పెద్ద ప్లానింగ్‌ కావాలి. కూచిపూడి వెంకట్‌లో ఆ ప్లానింగ్‌ వుంది. శర్వానంద్‌లో అది లోపించింది. ఎన్ని బిజినెస్‌లు వున్నా, రెస్టారెంట్‌ బిజినెస్‌ ఇచ్చే కిక్కే వేరు.. అంటారు. రెస్టారెంట్స్‌కి వున్న క్రేజ్‌ అలాంటిది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam