Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

నాన్న: ఆ అమ్మాయిని చేసుకోవా? ఎందుచేత ?
కొడుకు: నాకు నచ్చలేదు. ఆ అమ్మాయినీ, నన్ను పక్క పక్కన చూస్తే మమ్మల్ని తల్లీ కొడుకులనుకొంటారు  ఎవరైనా!
నాన్న: ఐతే నేను చేసుకొంటాను పో!!

మొగుడు: నీ తల్లోని పేలన్నీ నా తల్లోకెక్కాయ్!
పెళ్ళాం: ఏం కాదు లెండి. విగ్గే కదా. తీసి ఎండలో పెట్టండి. పేలు చస్తాయ్!

కొడుకు: నేను అమెరికా వెళతాను నాన్నా.
తండ్రి: ఒద్దురా బాబు. అక్కడికి నువ్వు తిరిగి రావు.
కొడుకు: ఉద్యోగం కుదిరాక, వస్తాను నాన్నా! మిమ్మల్ని తీసుకెళ్తాను. 
తండ్రి: అక్కడ నేనుండలేనురా! నువ్వు జాబ్ కెళ్ళి పోతే నేను బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా ఉండాలి. 
కొడుకు: నీకు తోడుగా ఒక 'నానీ' ని ఏర్పాటు చేస్తాను నాన్నా.  
తండ్రి: ఐతే పద! ఇప్పుడే అమెరికా పోదాం పద!

కుంతి: బకాసురుడ్ని చంపావ్ సరే! తోలుకెల్లిన ఆ బండెడు భోజనం ఏం చేశావ్ రా?
భీముడు: నేను తినేశానమ్మా!
కుంతి: ఒక్కడివి మొత్తం తినేశావా?
భీముడు: మొత్తం కాదమ్మా... దున్నపోతులూ, బండినీ వెనక్కి తోలుకోచ్చానుగా!!

భార్య: లైటు తీసెయ్యండి. నాకు సిగ్గేస్తుంది.
భర్త: ఈ కొంపలో అది కూడానా? నెల్లాళ్ళనుంచి కరెంటు లేదుగా!

డాక్టర్: మీ కంటి ఆపరేషన్ తర్వాత మీ చూపు ఎలా వుంది?
పేషంట్: నాకు మొత్తం కనిపిస్తున్నాయండీ!
డాక్టర్: అమా నర్స్.... నువ్వా గదిలోకి వెళ్ళమ్మా!!


క్రికెట్ కోచ్: దృష్టి పూర్తిగా బాల మీదే వుండాలి. డ్రాప్ చెయ్యకుండా క్యాచ్ చెయ్యాలి
క్రికెట్ ప్లేయర్: అది నా చేతిలో లేదు. బెట్టింగ్ కట్టేవాడిని బట్టి, నేను బాల్ ని క్యాచ్ చెయ్యాలో, డ్రాప్ చెయ్యాలో స్పాట్ లో డిసైడ్ చేస్తాను.

రాక్షస వైద్యుడు: శాకాహారులని తిన్నావా? మాంసాహారులని తిన్నావా?
రాక్షసుడు: శాకాహారులని వైద్యా!
రాక్షస వైద్యుడు: అందుకే నీకు విరేచానాలవుతున్నాయి! ఆహార నియమాలు సరిగ్గా పాటించాలి. సరేనా?


సేవకుడు: మహారాజా, కవచాన్ని ఛాతికి పెట్టుకోక వీపుకు తగిలించుకున్నారే?
మహారాజు:  మనం పరుగు లంకించుకుంటే శత్రు బాణాలు వీపుకు తగలకుండా వుండడానికిరా, బడుద్ధాయ్!!

మగ లవర్: ప్రియామణీ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. సారీ!
ఆడ లవర్:  ఏం? ఎందుకూ?
మగ లవర్: నాకు ఎయిడ్స్ వుంది. 
ఆడ లవర్: నాకూ ఉందీ! నో ప్రాబ్లమ్!!
మరిన్ని శీర్షికలు
jotishyam small telugu story