'బాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన చాకులాంటి కుర్రాడు నారా రోహిత్. తొలి సినిమాతోనే తనలో విషయం ఉందని నిరూపించుకున్నాడు. కానీ ఇంత వరకూ అదృష్టం దక్కలేదు. 'సోలో' సినిమాతో నటనలో తనేంటో ప్రూవ్ చేసకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో తన రూటే సెపరేటు అంటూ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న 'సావిత్రి', తుంటరి' సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదల డేట్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి.
త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇవి కాక నారా రోహిత్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తుంటరి' సినిమా మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నారా రోహిత్‌కు జోడీగా లతా హెగ్దే నటిస్తోంది. కుమార్ నాగేంద్ర దర్శకుడు. ఏదేమైనా, ఈ ఏడాదంతా క్షణం తీరిక లేకుండా వరుస సినిమాల రిలీజ్‌లతో బిజీ బిజీ అయిపోనున్నాడట నారా వారబ్బాయ్. చాలా సినిమాలు క్యూలో ఉన్నా, కొత్త కథలు వినడంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అవకాశాలు దక్కించుకుంటున్న నారా రోహిత్‌కి ఈ ఏడాది కలిసి రావాలని ఆశిద్దాం.
|