యూట్యూబ్‌లో పాపులర్ అయిన త్రీడీ యానిమేటెడ్ క్యారెక్టర్ లవ్ స్టార్ మరో కొత్త కాన్సెప్ట్‌తో నెటిజన్లను అలరిస్తోంది. 18 మంది ప్రముఖుల్ని అనుకరిస్తూ మూడు నిమిషాల పాటు సాగే కొత్త పెప్పీ నెంబర్ 'దేఖో దేఖో ముజే దేఖో..' అంటూ సందడి చేస్తోంది. తెలుగు ప్లేబ్యాక్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి స్వరమాధుర్యం ఈ సాంగ్‌కి హైలైట్‌గా నిలిచింది. నరేష్ రావుల రెండరిగ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ మరియు పలు ఇతర ప్రాంతీయ భాషల్లో లిరిక్స్ రూపొందించారు.
మల్టీ లింగ్వల్ లిరిక్స్, 'దేఖో దేఖో ముజే దేఖో'కి అదనపు ఆకర్షణ. 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వచ్చిన ఈ కొత్త సాంగ్‌లో లవ్ స్టార్, పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్, రజనీకాంత్, అల్లు అర్జున్, హృతిక్‌రోషన్, పవన్‌కళ్యాణ్ చిరంజీవి, సల్మాన్‌ఖాన్, షారుఖ్, అమీర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, మహేష్‌బాబు, ధనుష్, సంజయ్‌దత్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌లను అనుకరించడం చాలా చాలా గొప్ప విషయం. బూరుగుపల్లి సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సాంగ్ రూపొందించబడింది.
|