Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nara rohit increased speed

ఈ సంచికలో >> సినిమా >>

బాలయ్య సినిమా స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోగ్రఫీనా?

balakrishna recent  film biographies of the late NTR?

శ్రీవాస్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం 'డిక్టేటర్‌' సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 100వ చిత్రంగా ఒక డిఫరెంట్‌ కథతో రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి చాలా మంది డైరెక్టర్లు పరిశీలనలో ఉండడం జరిగింది. చివరికి తన నూరవ చిత్రానికి డైరెక్షన్‌ చేసే అవకాశాన్ని బాలయ్య బోయపాటి శ్రీను కిచ్చినట్లు సమాచారం. స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితగాధ ఇతివృత్తంగా ఈ సినిమా కథ ఉండబోతోందని గాసిప్స్‌ వినవస్తున్నాయి.

ఇప్పటికే బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్‌' వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. వాటిల్లో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌, ఆ ఫ్లేవర్‌తో కూడిన డైలాగ్స్‌ అభిమానుల్ని అలరించాయి. 100వ సినిమాగా చేయబోయే కొత్త కూడా అదే ఫార్మేట్‌లో పూర్తిగా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా 'సింహా', 'శ్రీరామ రాజ్యం' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నయనతారను హీరోయిన్‌గా ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్‌ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన నూరవ చిత్రానికి సంబంధించిన పూర్తి ఇన్‌ఫర్మేషన్‌ బాలకృష్ణ తెలపనున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
lovestar imitation