Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
samanyudi asahanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వృక్షములు - జీవసంరక్షకులు - హైమా శ్రీనివాస్

vrukshamulu - jeeva samrakshakulu

నింబ వృక్షం --వేప చెట్టు. 

భారతీయ సంస్కృతిలో వేపచెట్టును లక్ష్మీ  దేవిగా భావించి ,రావిచెట్టును విష్ణు మూర్తిగానూ రెండు చెట్లూనూ పూజిస్తారు. అసలు వృక్షాలవల్లనే కదా మనకు ఆక్సిజన్ లభిస్తున్నది, వాటివల్లే మనకు ఆహారం, ఫలాలు అందుతున్నాయి. మనకు జీవనాధారమైనవన్నీ  అందించే వృక్షాలు దేవుళ్ళుకాక మరే మవుతాయి. అందునా వేప చెట్టు సంపూర్ణంగా  అన్నిభాగాలు వైద్యపరంగా ఎంతో  విలువలు కలిగి ఉన్నాయి . ఆకునుండీ, వేరు వరకూ అన్నీ మానవులకేకాక పంటలకు చీడపీడల నుండీ రక్షణ కలిగించే లక్షణాలు కలిగి ఉన్నందున వేపను మన భాంధవిగ అభావించాలి.

వేపచెట్టు ఆంధ్రప్రదేష్[ ఉమ్మడి] రాష్ట్రానికి  రాష్ట్ర వృక్షం గా ఉంది. వేపచెట్టు మెలియేసి కుటుంబానికి చెందినది. – వేపచెట్టు  వృక్ష శాస్త్ర నామం: అజాడిరక్టా ఇండికా . మహోగని కుటుంబానికి చెందినది వేపచెట్టు భారతదేశంలోనే   పుట్టినట్లు చెప్తారు. వేప ఉష్ణ ప్రాంతంలో పెరిగే  సతతహరిత వృక్షం.  4 వేల సంవత్స రాలనుండి ఆయూర్వేద వైద్యంలో వేప చెట్టుకు చెందిన భాగాలన్నీ వాడుతున్నారు. వేపచెట్టు బెరడు, ఆకులు, వేరు, పండ్లూ, వాటినుంచీ తీసే వేపనూనె అన్నీ  చాలా ఔషధ గుణాలను కలిగి వున్నాయి. . వేపచెట్టు అని తెలుగులో నూ, తమిళం లో - వేప్పమరమ్‌-అనీ ,కన్నడం లో బేవు, బేవినమర అని, సంస్కృతం లో నింబ వృక్షమనీ , ఆంగ్లం లో ‘ నీం ’ అనీ - పర్షియ భాషలో అజాద్ డిరఖ్త  అనీ , నైజీరియా లో- డొగొన్ యార్లొ అనీ, మళ యాళం లో   ఆర్య వెప్పు అనీ ,  పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికా లో దీనినే మ్వారోబైని -కిస్వాహిలి- అంటారు. అంటే   వేప ' నలభై వివిధ వ్యాధుల ' ను నయం చేస్తుందని అర్ధంఅంటారు. ‘ అజాడి రక్త ‘కుటుంబా నికి చెందిన వేప  సమ శీతోష్ణ దేశాలైన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్ మార్ ,  పాకిస్తాన్ ల లో పెరుగుతుంది.  

వేప చెట్టులోని వేప ఇగురు,వేపాకు, వేపపూత , వేప కాయ,వేపవేరు, వేపచెక్క , వేప నూనె ఇలా వేపచెట్టు నుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్య పరిరక్షణ లో సంపూర్ణంగా ఉపయోగిస్తుంది. మానవజాతికే కాక జీవరాసులన్నింటికీ  జీవించను కావల్సిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని కూడా.చెట్లకు ,చేలకు చీడపడితే వేపాకు వేసి కాచిన నైరు, వేప నూనె చల్లితే చీడ నశిస్తుంది.ఇంటికి వాడే ద్వారబంధాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు , కుర్చీలు ఇంకా తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు కాండంనుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాం. అలాగే వేపాకు లను కూడా అనేక రకాల వైద్యానికి ఉపయోగిస్తారు.

భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా మనం పూజిస్తాం. వేపపువ్వు ను హిందువులు ఆంధ్రులు, కన్నడిగులు, మహా రాష్ట్రులు ఉగాది పచ్చడి లో కలుపుతారు.తెలుగు సంవత్సరాది 'ఉగాది' పండుగ రోజు వేపపూత , బెల్లం ,చింతపండు, ఉప్పు, చెఱకు ముక్కలు, మామిడి పిందెలముక్కల  తో కలిపిన చేదు, తీపి, వగరు ,కారము, ఉప్పు ,పులుపు షడ్రుచుల వేప ప్రసాదం తినాలని శాస్త్రాలు చెపు తున్నాయి. అంటే  బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది. ఇలా వేపపూత వలన జలుబు, దగ్గు వంటివి రావు. ఇలా లో ఎన్నో ఆరోగ్యకరమైన విలువలు వేపలో దాగి ఉన్నాయి.అందువల్ల ఇది మానవు ల కే కాక జీవరసులందరికీ ఎంతో ఉపయోగకరమైన చెట్టు. వేపలోనే ఆరోగ్య సరిగా ఉంచే తీపిదనం దాగుంది. వేములా వెయ్యేళ్ళు బ్రతుకు అని పెద్దలు దీవిస్తారు. వేప ఎదుగుదల చాలా త్వరగా జరుగుతుంది. 15 నుంచి 20 మీటర్ల వరకూ , కొన్ని చెట్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగ గలిగే చెట్టు వేప.  పచ్చదనంతో ఎప్పుడూ కళకళలాడు తుంటుంది  వేప , అందుకే లక్ష్మీ దేవితో పోల్చుతారు.  

మన దేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో నూ,గృహవైద్యంలో నూతరతరాల నుండి ఉపయోగి స్తు న్నాం.వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అంటుంది.యదర్ధంగా అని నూటికి నూరుపాళ్ళూసత్యం. ఒక విధంగా ఆయుర్వేదం వేపను సంపూర్ణంగా వాడు కుంటుందనవచ్చు.ఆయుర్వేదం లో పిత్త- ప్రకోప లక్షణాలను పోగొట్ట ను వేపాకును ఉపయోగిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో'చరకుడు '..."ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు".అని చెప్పాడు .ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా పూజించ డం ధర్మం కదా!అభివర్ణించవచ్చు. రైతులు  తమ పొలాల్లో వేపచెట్లు పెంచుతారు, ఆ వేపగాలులకీ ,వేపాకు పొలా ల్లో వేయటం లేక పొలాలదగ్గరగా ఉన్నపుడు  వాటిలో రాలడం వలనా చీడ పీడలు అంటవు. పొలం పని చేసి అలసిపోయి, మధ్యాహ్నం భోజనం తర్వాత వేపచెట్టు కింద నడుం వాల్చు తారు రైతులు.   వేపచెట్టు మన సంస్కృతి లో ఒక ప్రధాన భాగ మయింది.

భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తాతలకాలం నుండి వాడు తున్నా రు. వేపకొమ్మకుండే పుల్లతో  పళ్ళు తోముకుంటారు, దానివలన పళ్లవ్యాధులేరావు, పళ్ళుగట్టిపడతాయి.నోత్ళో ఏవిధమైన క్రిము లూ చేరవు.నోరు ఫ్రష్ గాఉంటుంది.వాసనరాదు.

వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకుమందు కు వేపనూనె మంచి మదుగ అపనిచేస్తుంది. ఈ నూనెను వేపగింజల నుండి తయారు చేసే వేపనూనె ను క్రిమిసంహారి గా మనం వాడుతున్నాం, వేపాకునూ ఆవాలాకునూ కలిపి కాల్చి పొగపెడితే దోమలు రవు. వంటికి వేపనూనె రాచుకున్నా దోమలు కుట్టవు.

అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసా యంలో ఉపయోగిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ లభించే మహత్తరమైన ఔషధ నిధి వేప. కాలుష్యాన్ని నివారించగలదు. వేప సౌందర్య సాధనంగానూ పనికొస్తుంది. చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులు, మధు మేహం వంటి వాటి కి ఇది ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ వేప ఇగురును ఉప్పువేసి ఉండలు చేసి ఉదయాన్నే అంతా మింగుఇతే ఏవిధమైన పేగు సంబంధ వ్యాధులూ, అజీర్తి రానేరాదు, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

నేటి ఆధునిక కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. కొబ్బరి నూనెలో వేప బెరడును, ఆకులను వేసి రెండు రెట్లు నీళ్లు పోసి, సన్న సెగ మీద నీటి భాగం ఆవిరైపోయేలా మరిగించాలి. ఇలా మరిగించినాక  ఆ మిశ్రమాన్ని వారానికి ఒకసారి చొప్పున తలకు పట్టించి, కొంతసేపు నానాక తలస్నానం చేయాలి.ఇలాచేస్తే  చుండ్రు ఉండనేఉండరు. రాదుకూడా..  వైరల్ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి  తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. నులిపురుగులతో బాధ పడే వారు ఒక స్పూన్  వేపాకు రసానికి అర స్పూన్  తేనె కలిపి  తింటే తగ్గిపోతాయి . ఆయుర్వేదిక్ ఉపయోగాలు రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపా కులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడుక్కుం టూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు వస్తుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి  దురదలు, దద్దుర్లు ఉన్నచోట రస్తే తగ్గుతాయి. వేపనూనెకున్న ఔషధగుణం వల్ల  సబ్బులు తయారు చేయటానికి దీన్ని ఎక్కువగా వా డుతున్నారు.  వేపనూనెతో చేసిన సబ్బుకు ఎక్కువ గా నురగ వస్తుంది . మార్గో వంటి వేపనూనె సబ్బులు వాడితే మనశరీరంశుభ్రంగానూ, నున్నగానూ వస్తుంది.ఇది దురదలను దూరం చేస్తుంది. 

ఇంకా ఆయుర్వేద వైద్యుల సలహాలమేరకు అనేక రకాలుగా వేప భాగాలను వైద్యానికి ఉపయోగిచి ఉపశమనం పొందవచ్చు.
వృక్ష సంబంధ ఉత్పత్తుల్లో వేప మందులకు అధిక ప్రాధాన్యత ఉంది. వేప మందులు సుమారు మూడువందల రకాల రైతు శత్రువులైన  పురుగుల్ని నాశనం చేస్తాయి. రైతు మిత్ర పురుగులకు ఎలాంటి హాని చేయవు. రైతులు అవసరాన్ని బట్టి వీటిని ఇతర మందులతో కలిపి పొలాల్లో పిచికారీ చేస్తారు. వేపచేదు ఘాటువలన ఈ మందులు పిచికారీ చేసిన పొలం నుంచి కీటకాలు పారిపోతాయి. వేప గింజల్లో ఉన్న అజాడిరాక్టిన్ అనే చేదు పదార్థం వల్ల పురుగులు అక్కడ ఉండలేవు.

ఇది ఘాటైన  వాసనకలిగి ఉంటుంది. వేప మందుల వాడకం ద్వారా పురుగులను  అదుపు చేయవచ్చు. ఐతే రసాయనిక మందు ల్లా ఈ మందుల ప్రభావం వెంటనే కన్పించదు. క్రమేపీ సత్ ఫలితాన్ని ఇస్తుంది.ఆయుర్వేద,సిధ్ధ, యునాని ,హోమి యోపతి,హెర్బో- మినరల్ మెడిసెన్స్ లలో మందుల తయారీలో ఉపయోగిస్తారు. వేపనూనె కీళ్ళనొప్పుల నివారణకు మర్దనా చేస్తారు. పేల నివారణకు వేపనూనె  చాలా బాగా పనిచేస్తుంది .రాత్రి తల వెంట్రుకలకు లోపలివరకూ వేపనూనెను బాగా దట్టం గా పట్టించి, తలచుట్టూ గట్టిగా ఒక గుడ్డ కట్టాలి.గాలి ఆడక వేప ప్రభావానికి పేలన్నీ తెల్లారికి చనిపోయి ఉంటాయి.ఇది మన కంటికెలాంటి హామీ చేయదు. పైగా కళ్లకు చలువచేస్తుంది వేప నూనెను రైతులు ఎక్కువగా క్రిమి సంహారకం గా వాడు తున్నారు. దీనివలన పర్యావరణానికి ఎలాంటి ముప్పూ వాటిల్లదు.భూమి, నీరు, గాలి పొలూట్ కాదు. ఈ వేప మందులు వాడిన పంట, పండ్లు కూర లు భుజిస్తే మానవులకు ఎలాంటి ఆరోగ్య హానీ కలుగదు.   

వేపకాయంత వెర్రి అనే సామెత కూడా ఉంది, ఇంకాస్త రాస్తే ఆసామెత నాకే  అన్వ ఇస్తారని భయానికి ఆపేస్తున్నాను క్రింది స్లోగన్ తో ఇంటింటా వేపమొక్కను పెంచుదాం ఇంటివారందరి ఆరోగ్యాన్నీ కాపాడుదాం.

 

మరిన్ని శీర్షికలు
sahiteevanam