Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahasam svasagaa sagipo movie review

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగులో 'బలం' చూపిస్తున్న బాలీవుడ్‌ హీరో

hrithik roshan balam  paublisity in tollywood

'బలం' అనే సినిమా టైటిల్‌కీ ఆ సినిమా కాన్సెప్ట్‌కీ సంబంధం ఏంటి? ఈ చర్చ ప్రేక్షక లోకంలో జరుగుతోందంటే ఖచ్చితంగా టైటిల్‌ సినిమా విడుదలకు ముందే విజయవంతమయినట్లు. ఇది బాలీవుడ్‌ సినిమాకి రీమేక్‌. హృతిక్‌ రోషన్‌, యామీ గౌతమ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రమిది. ఇదొక థ్రిల్లర్‌ సినిమా. ఇందులో హీరో హీరోయిన్లు ఇద్దరూ అంధులే. లోకాన్ని వీరు మనసుతోనే చూస్తారు. అలా తమదైన లోకంలో చాలా ఆనందంగా జీవిస్తున్న ఈ జంట జీవితంలో పెను ఉత్పాతం చోటు చేసుకుంటుంది. అదేమిటి? అనేది తెరపైనే చూడాలి. అంధుడు, తనకు కనిపించని శతృవుతో పోరాడుతుంటాడు.

కానీ శతృవుకి, ఇతను కనిపిస్తాడు. మరెలా? ఈ పోరాటంలో తన మనసుతోనే పైచేయి సాధిస్తాడా? అనేది తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం గుండెకు హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు సంజయ్‌ గుప్తా చెప్పాడు. ఇంటెల్లిజెంట్‌ స్క్రీన్‌ప్లేతో, అత్యద్భుతంగా రూపొందిన ఈ చిత్రాన్ని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తెలుగులో సినిమాని రిలీజ్‌ చేయడానికి కారణం సినిమాకి ఉన్న యూనివర్సల్‌ అప్పీల్‌ మాత్రమేనట. 'బలం' అనే టైటిల్‌ పెట్టడంలోనే ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నామంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. కమర్షియల్‌ హీరోగా ఎన్నో మంచి మంచి విజయాలు అందుకున్న హృతిక్‌కి ప్రయోగాలు కొత్త కాదు. ఆ బాటలో ఇది కూడా ఓ పెద్ద ప్రయోగమే. ఏదేమైనా తెలుగులోనూ 'బలం' సినిమాతో హిట్‌ కొట్టాలని చూస్తున్న హృతిక్‌ ఇక్కడ కూడా పబ్లిసిటీ దంచేయనుండడం గొప్ప విషయంగా చెప్పుకోక తప్పదు. 

మరిన్ని సినిమా కబుర్లు
sonu sood says ..No protection in shooting spot