Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
febuary comming

ఈ సంచికలో >> సినిమా >>

'ఖైదీ' వంద కోట్లు పక్కా లెక్క

kaidi reach 100 crores

చిరంజీవి హీరోగా సుదీర్ఘ కాలం తర్వాత వచ్చిన సినిమా 'ఖైదీ నెంబర్‌ 150'. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి వారంలోనే 100 కోట్ల టార్గెట్‌ను రీచ్‌ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మీడియా ముఖంగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇంత కలెక్షన్లు సాధించింది. అదీ కూడా ఇంత తక్కువ టైంలో ఈ ఫిగర్‌ని రీచ్‌ అయ్యిందంటే విమర్శకులు ఒకింత ఆశ్చర్యానికి గురి కాక తప్పడం లేదు. చిరంజీవి రీ ఎంట్రీకి ఇంత గ్రాండ్‌గా అభిమానులు బ్రహ్మరధం పడతారని ఊహించలేదు. ప్రపంచ వ్యాప్తంగా చిరంజీవికి ఉన్న అభిమానం వెల కట్టలేనిదని ఈ సినిమా ద్వారా ప్రూవ్‌ అయ్యింది.

అలాగే తొలి సినిమాతోనే ప్రొడ్యూసర్‌గా రామ్‌ చరణ్‌ మెగా సక్సెస్‌ని సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే, అతి తక్కువ అనుభవంతో రామ్‌ చరణ్‌ ప్రొడ్యూసర్‌గా ఒక్క సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే చిరంజీవి రెండో సినిమా కూడా రామ్‌ చరణ్‌ నిర్మాణంలోనే తెరకెక్కించాలనుకుంటున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అతి త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నారట. ఇవే కాదు వరుసగా చిరంజీవి సినిమాలు చేయనున్నారు. వాటిలో మూడో సినిమా వినాయక్‌తోనే ఉండడం విశేషం. ఈ సినిమాకి అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. 

మరిన్ని సినిమా కబుర్లు
sankranti hero sarvanand