Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kajal agarwal act in  nene raju nene mantri movie

ఈ సంచికలో >> సినిమా >>

బన్నీతో బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసిన బ్యూటీ

anu emmanuel got lucky chance

అల్లు అర్జున్‌ తాజాగా 'డీజె - దువ్వాడ జగన్నాధమ్‌' సినిమాతో సెన్సేషనల్‌ హిట్‌ కొట్టాడు. 'రేసుగుర్రం' నుండీ వస్తోన్న బన్నీ సక్సెస్‌ ఫార్ములాని ఈ సినిమాతోనూ కొనసాగించాడు. హిట్ల మీద హిట్లు కొడుతూ బన్నీ రేసు గుర్రంలాగే దూసుకెళ్లిపోతున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ మజాని ఆస్వాదిస్తూనే బన్నీ తన కొత్త సినిమాకీ రంగం సిద్ధం చేసేశాడు. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో బన్నీ కొత్త సినిమా ఉండబోతోన్న సంగతి తెలిసిందే. మాటల రచయితగా పాపులర్‌ అయిన వక్కంతం వంశీ మెగా ఫోన్‌ పట్టి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టారు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఎంపిక చేసుకున్నారు.

'మజ్ను' సినిమాతో టాలీవుడ్‌ని పలకరించిన ఈ బ్యూటీకి అస్సలు గ్యాపే లేకుండా వరుసగా ఆఫర్లు దక్కించేసుకుంటోంది ఈ మలయాళ బ్యూటీ. ఆ ఆఫర్లు కూడా అర కొరా కాదండోయ్‌. ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసిందంటేనే అమ్మడి అదృష్టం అంతా ఇంతా కాదు అనుకున్నారు. అదలా ఉండగానే తాజాగా బన్నీ సినిమాలో ఛాన్స్‌ అంటే అమ్మడు లక్కు తోక తొక్కినట్లే అనుకోక తప్పడం లేదు. 'మజ్ను' తర్వాత 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాలో నటించిన ఈ బ్యూటీ, గోపీచంద్‌తో 'ఆక్సిజన్‌' సినిమాలోనూ నటిస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌లో అతి కొద్ది మంది బిజీయెస్ట్‌ హీరోయిన్స్‌లో అనూ కూడా చేరిపోయిందని చెప్పక తప్పడం లేదు.

మరిన్ని సినిమా కబుర్లు
nani so   busy