Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
RGV found rakthi in bhakthi

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా తీయాలంటే కళ్ళుండాలా?

Is eyes need to make films

సినిమా చూడాలంటే ఖచ్చితంగా కళ్ళుండాలి. సినిమానే కాదు, ఏ దృశ్యాన్ని చూడాలన్నా కళ్ళు వుండాల్సిందే. మనసుతో చూడటం అనేది వేరు. అది ఓ ప్రస్తావన మాత్రమే. మరి సినిమా తీయాలంటేనో, కళ్ళు ఖచ్చితంగా వుండి తీరాలి. అది అందరికీ తెలుసు. కానీ, దాన్ని ప్రశ్నగా చేసి ‘సినిమా తీయాలంటే కళ్ళుండాలా?’ అని ఎవరన్నా అంటే ఎలా వుంటుంది!

‘సినిమా తీయాలంటే కళ్ళుండాలా?’ అంటూ పోస్టర్లు, హోర్డింగులు వెలిశాయి. ఇవి అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. కొందరేమో ‘వాళ్ళకేమన్నా పిచ్చా?’ అనుకుంటోంటే, ఎక్కువమంది ఆసక్తిగా తిలకిస్తూ, ఆ తర్వాత చర్చించుకుంటున్నారు. పబ్లిసిటీలో ఇదో వెరైటీ.

అసలేంటీ కథ? అని ఆరా తీస్తే, అది ఓ సినిమా ప్రమోషన్ అని తెలిసింది. విలక్షణ దర్శకుడు అయోధ్యకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా పేరు ‘మిణుగురులు’. టైటిల్ కొత్తగా వుంది. అందుకే, పబ్లిసిటీ కూడా కొత్తగా ప్లాన్ చేశారు. గుడ్డివాళ్ళు సినిమా తీస్తారు.. అదే సినిమా నేపథ్యం. చాలా ఇంట్రెస్టింగ్గా వుంటుందట. అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు వస్తాయని సినిమా యూనిట్ ధీమాగా వుంది. గతవారమే ఈ సినిమా ఆడియో మధుర సంస్థ ద్వారా మార్కెట్లోకి వచ్చింది.

మరిన్ని సినిమా కబుర్లు
SIIMA awards in Sharjah