Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

1 -12-2017 నుండి 7-12-2017 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తం మీద నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర వారి సలహాలను తీసుకోవడం ద్వారా మేలుజరుగుతుంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులతో నూతన చర్చలు చేయుటకు  అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు , పనిభారం పెరుగుటకు ఆస్కారం కలదు. సాధ్యమైనంత మేర నిదానంగా వ్యవహరించుట సూచన.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద ఆరంభంలో కొంత సందిగ్దత ఉన్న, రాను రాను చక్కటి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. పెద్దలతో మీకున్న అనుబంధం మరింతగా బలపడే ఆస్కారం కలదు. సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకోవడం సూచన. కుటుంబపరమైన విషయంలో మీ మౌనం ఎదుటివారిని ఆలోచనలో పడవేస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి సహకారం లభిస్తుంది.

 


మిథున రాశి :ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం  సాగుతాయి. గతంలో మీకున్న పరిచయాలు లభిస్తాయి. ముఖ్యంగా రుణపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. చర్చలకు దూరంగా ఉండుట మంచిది.

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారిద్వారా నూతన అవకాశాలు లభిస్తాయి. చర్చాపరమైన విషయాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులతో చర్చలకు అవకాశం ఇవ్వకండి. రావాల్సిన ధనం కొంతమొత్తంలో చేతికి అందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బందువులకు మీ ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో ఆలోచనలు పంచుకుంటారు.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద చర్చల కన్నా కార్యసాధన పైన దృష్టిని పెట్టవలసిన అవసరం ఉంది. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉన్నను ప్రణాళిక కలిగి ఉంటె మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉన్నతఉద్యోగఅవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరులతో చేపట్టిన చర్చలు సత్ఫాలితాలు వస్తాయి. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో పెద్దలతో ఉన్న విభేదాలు తగ్గించుకొనే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తే మంచిది.
 

కన్యా రాశి :ఈవారం మొత్తం మీద మిత్రులను కలుస్తారు, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి , సర్దుబాటు విధానం మంచిది. సోదరులతో చేపట్టిన చర్చలు ఆశించిన మేర ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు. సంతానపరమైన విషయాల్లో ఒత్తిడి పొందుతారు, వారికి సమయం ఇవ్వడం మంచిది.

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో ఒత్తిడి తప్పకపోవచ్చును. మీ వ్యవహారశైలి వలన నూతన సమస్యలు రావడానికి ఆస్కారం కలదు. జీవితభాగస్వామితో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సోదరులనుండి వచ్చిన సూచనలను పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవచ్చును. సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.

 

వృశ్చిక రాశి :  ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. గతంలో తీసుకున్న రుణాల వలన సమస్యలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకన్నా గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వాటి విషయంలో మరొకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట మంచిది. అధికారులతో విభేదాలు రావడానికి ఆస్కారం కలదు, కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. ఉద్యోగంలో సమయపాలన మంచిది.

 

మకర రాశి :   ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. బంధువులతో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది , జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుస్తాయి, సర్దుబాటు అవసరం.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేసే విషయంలో నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. విలువైన వస్తువులను కాపాడుకొనే ప్రయత్నం మేలు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. 

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, వారి సూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. నూతన వ్యాపారాలను మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక అవసరం. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బాంధవుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి.

మరిన్ని శీర్షికలు
telugu-cartoons-presentation