Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Krish started  'Manikarnika'

ఈ సంచికలో >> సినిమా >>

నాని 'అ' సినిమాకి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

Countdown start for Nani 'A' movie

నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో వస్తోన్న చిత్రం 'అ'. 'అ' అంటే ఆశ్చర్యం. అంతటి ఆశ్చర్యం కలిగించేలానే ఈ సినిమా ప్రమోషన్స్‌ మొదట్నుంచీ ఆకట్టుకుంటున్నాయి. టైటిల్‌ రిలీజ్‌ దగ్గర నుండీ, పాత్రల పరిచయం వరకూ ప్రేక్షకుల దృష్టితో పాటు ఇండస్ట్రీ దృష్టిని కూడా ఆకర్షించిందీ సినిమా. భారీ కాస్టింగ్‌తో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరెక్కుతోన్న చిత్రమిది. కాజల్‌ అగర్వాల్‌, రెజీనా, నిత్యామీనన్‌ అవసరాల శ్రీనివాస్‌, ప్రియదర్శన్‌, ఈషా రెబ్బ, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ప్రశాంత్‌ వర్మ అనే యంగ్‌ డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

నాని ఈ సినిమాలో కనిపించడు కానీ వినిపిస్తాడు. ఓ చేప పాత్రకి నాని వాయిస్‌ ఇస్తున్నాడు. అలాగే సీనియర్‌ నటుడు రవితేజ కూడా ఈ సినిమాలో వినిపిస్తాడు. ఓ చెట్టు పాత్రకు తన వాయిస్‌ ఇస్తున్నాడు రవితేజ. ప్రతీ ఒక్కరి పాత్ర చాలా కొత్తగా డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌. పాత్రల డిజైనింగ్‌తోనే డైరెక్టర్‌ క్రియేటివిటీ ఏంటో అర్ధమైపోతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతీ పాత్రధారి ఇంతకు ముందు సినిమాల్లో ఎప్పుడూ కనిపించనంత కొత్తగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా రెజీనా, కాజల్‌ పాత్రలు చాలా కొత్తగా ఆశక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్‌ రాక ముందు రెజీనాది నెగిటివ్‌ రోల్‌ అని భావించారంతా. కానీ ట్రైలర్‌ వచ్చాక కాజల్‌ పాత్రలో నెగిటివ్‌ షేడ్స్‌ కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఊహకందని సరికొత్త కథా, కథనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందన్న సంగతి స్పష్టమవుతోంది. కానీ సస్పెన్స్‌ మాత్రం అలాగే ఉంది. ఆ సస్పెన్స్‌ వీడాలంటే ఈ నెల 16 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే, 'అ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఆ రోజే కాబట్టి. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ!

మరిన్ని సినిమా కబుర్లు
Nitin Double Dhamaka!