Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Countdown start for Nani 'A' movie

ఈ సంచికలో >> సినిమా >>

నితిన్‌ డబుల్‌ ధమాకా!

Nitin Double Dhamaka!

'అ,ఆ..' సినిమాతో కెరీర్‌లోనే సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టి, స్టార్‌ హీరోల లిస్టులో చేరిపోయాడు నితిన్‌. అయితే గతేడాది భారీ అంచనాల నడుమ వచ్చిన 'లై' సినిమా ఆశించిన ఫలితాల్ని అందుకోకపోవడంతో కొంచెం స్లో అయినట్లుగా అనిపించాడు నితిన్‌. కానీ అస్సలు స్లో అవ్వలేదంటున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం నితిన్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌లో రూపొందుతోన్న సినిమా ఒకటి కాగా, 'శతమానం భవతి' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో మరో సినిమాలోనూ నితిన్‌ నటిస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో రూపొందుతోన్న సినిమాలో మేఘాఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా కథలో త్రివిక్రమ్‌ హ్యాండ్‌ ఉండడంతో సినిమాపై అంచనాలున్నాయి ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌ మీద ఉంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరో పక్క నితిన్‌ - సతీష్‌ వేగేశ్న కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఓ డిఫరెంట్‌ మూవీగా రూపొందనుంది. ఈ సినిమాలో నితిన్‌ సరసన నందితా శ్వేత హీరోయిన్‌గా నటిస్తోంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో నందితా శ్వేత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ నటనతో హావ భావాలతో ఆకట్టుకుంది. నితిన్‌తో చేయబోయే సినిమాలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ని దక్కించుకుందట ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే, త్వరలోనే ఈ సినిమాని కూడా పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడట నితిన్‌. ఫాస్ట్‌ ఫాస్ట్‌గా చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాడట మన యంగ్‌స్టర్‌ నితిన్‌. చూడాలి మరి ఏం చేస్తాడో!

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam