Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

అఖిల్‌ సినిమా సస్పెన్స్‌ వీడేదెప్పుడంటే.?

akhil movie suspence

అక్కినేని అందగాడు అఖిల్‌ మూడో చిత్రంపై సస్పెన్స్‌ ఇంకా అలాగే ఉంది. అయితే ఈ ఉగాదికి ఆ సస్పెన్స్‌కి శుభం కార్డు వేయనున్నారనీ తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో అఖిల్‌ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. ఇప్పటికే అఖిల్‌ పలు స్టోరీలు వింటున్నాడు. అయితే లాంఛింగ్‌, రీ లాంఛింగ్‌ మూవీస్‌ రెండూ నిరాశపరచడంతో, మూడో చిత్రం విషయంలో అఖిల్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. ఈ సారి వచ్చే సినిమా ఖచ్చితంగా హిట్‌ కొట్టాలనే కసితో అఖిల్‌ ఉన్నాడట. అయితే మెగా డైరెక్టర్‌ అయిన వినాయక్‌ హ్యాండ్‌ అఖిల్‌కి కలిసి రాలేదు. ఆల్రెడీ 'మనం' సినిమాతో ఫ్యామిలీ సక్సెస్‌ అందుకున్న విక్రమ్‌ కుమార్‌ హ్యాండ్‌ కూడా అఖిల్‌కి కలిసి రాలేదు. 'హలో' కాన్సెప్ట్‌ బాగున్నా, ఎందుకో, ఎక్కడో తేడీ కొట్టేయడంతో, అనుకున్న రిజల్ట్‌ని అందించడంలో ఫెయిలైంది. కానీ ఈ సినిమా కోసం అఖిల్‌ చాలా కష్టపడ్డాడు. సక్సెస్‌ కొట్టేదాకా ఎంత కష్టమైనా భరించడానికి అఖిల్‌ సిద్ధంగా ఉన్నాడు.

అయితే అఖిల్‌ నెక్ట్స్‌ డైరెక్టర్‌ ఛాయిస్‌ ఎవరికిస్తాడనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిందిప్పుడు. యంగ్‌ డైరెక్టర్స్‌ సింపుల్‌గా వచ్చి బిగ్‌ సక్సెస్‌ అందుకుంటున్నారు. అలా యంగ్‌ డైరెక్టర్స్‌ని ట్రై చేద్దామా అంటే, ఆ లిస్టులో ప్రెజెంట్‌ ఉన్న డైరెక్టర్‌ వెంకీ అట్లూరి. ఇటీవల 'తొలిప్రేమ' సినిమాతో ఊహించని హిట్‌ అందుకున్నాడీ యంగ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌. దాంతో ఇప్పుడీ డైరెక్టర్‌ అక్కినేని దృష్టిలో పడ్డాడనీ తెలుస్తోంది. నాగార్జున, వెంకీ అట్లూరితో సంప్రదింపులు చేస్తున్నాడనీ సమాచారమ్‌. మరో పక్క పూరీ జగన్నాధ్‌ కూడా నాగ్‌ లిస్టులో ఉన్నాడు. ఏది ఏమైనా అఖిల్‌కి ఓ మంచి హిట్‌ ఇవ్వాలనే తపనతో ఉన్నాడు నాగార్జున. మరి ఏ డైరెక్టర్‌తో అఖిల్‌కి హిట్‌ కళ ఉందో అనే విషయం అర్ధం కాని స్థితిలో ఉన్నాడు. ఏది ఏమైనా అఖిల్‌ మూడో చిత్రంపై ఈ ఉగాదికి ఓ క్లారిటీకి వచ్చే అవకాశాలున్నాయనీ తాజాగా అందుతోన్న సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
anupama parameswaran taste so good