Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sakshyam movie become sensation

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా ఆడోళ్లంటే అంత లోకువా

cinema actress nothing less

ఓ ఎమ్యెల్యే 'సినీ పరిశ్రమలోని ఆడోళ్లంతా మొగుళ్లను ఈజీగా మార్చేస్తారు' అనేశాడు. సీనియర్‌ దర్శకుడు నిర్మాత, తమ్మారెడ్డి భరద్వాజ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. శ్రీరెడ్డి తాను తప్పు చేశానని ఒప్పుకుంటూ సినిమా స్టూడియోల్ని బ్రోతల్‌ హౌస్‌లుగా అభివర్ణించింది. ఆమె తప్పు చేశానని ఒప్పుకోవడం ఆమె ఇష్టం. అలాంటిది టోటల్‌ ఇండస్ట్రీనే తప్పు పట్టేస్తే ఎలా? సినిమా స్టూడియోల్ని పవిత్ర దేవాలయాల్లా భావిస్తుంటారు సినిమా రంగంలో. ఒకరిద్దరు తప్పు చేస్తే, సినీ పరిశ్రమకు ఆ తప్పును ఆపాదించేస్తారా? ఇదే విషయం నటి, నిర్మాత, దర్శకురాలు అయిన జీవితా రాజశేఖర్‌ నిలదీసింది.

శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచిన సంధ్య అనే మహిళ తానొక మహిళని అనే విషయం మర్చిపోయి సాటి మహిళ అయిన జీవితనుద్దేశించి బ్రోకర్‌ అని అభివర్ణించింది. తీవ్ర మనస్తాపానికి గురైన జీవిత, సంధ్యపై పోలీసులకు పిర్యాదు చేసింది. సినీ పరిశ్రమలో ధైర్యంగా నిలబడే వారికి ఎలాంటి లైంగిక వేధింపులు ఉండవు. దానికి నేనే సాక్ష్యం. హీరోయిన్‌గా సినిమాలు చేశాను. దర్శకురాలిగా, నిర్మాతగా పలు చిత్రాలు చేశాను, చేస్తున్నాను. అలాగే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిలై ఇద్దరు ఆడపిల్లలకు తల్లినయ్యాను, త్వరలోనే నా పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఈ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు నేను గర్వపడతాను అని జీవిత అన్నారు. అయితే ఇంత జరుగుతున్నా, సినీ పరిశ్రమ తరుపున పెద్దలు మాట్లాడకపోవడం బాధ కలిగించిందని జీవిత వాపోతున్నారు. జీవిత మాటలు అక్షర సత్యం. సినీ నటిని అని చెప్పుకునే శ్రీరెడ్డి అన్నం పెట్టిన ఆ సినీ పరిశ్రమనే బజారుకీడ్చింది. ఆ సినీ పరిశ్రమ కారణంగా ఎదిగిన జీవిత సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచింది. 

మరిన్ని సినిమా కబుర్లు
kalyan ram with double heroines