Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: అమర్‌ అక్బర్‌ ఆంటోనీ 
తారాగణం: రవితేజ, ఇలియానా, వెన్నెల కిషోర్‌, షయాజీ షిండే, లయ, శ్రీనివాస్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, తనికెళ్ళ భరణి, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, సత్య, భరత్‌ రెడ్డి, రవిప్రకాష్‌, ఆదిత్య మేనన్‌ తదితరులు. 
సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌ 
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి దిలీప్‌ 
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై, మోహన్‌ చెరుకూరి 
దర్శకత్వం: శ్రీను వైట్ల 
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌ 
విడుదల తేదీ: 16 నవంబర్‌ 2018

కుప్లంగా చెప్పాలంటే.. 
రెండు కుటుంబాలు కలిసి ఓ వ్యాపారం నిర్వహిస్తుంటాయి. ఆ వ్యాపార సంస్థలో భాగస్వాములుగా చేరిన నలుగురు వ్యక్తులు, ఆ అత్యాశకు పోయి, ఆ రెండు కుటుంబాల్ని తుదముట్టించేస్తారు. ఈ క్రమంలో ఆ రెండు కుటుంబాలకు చెందిన అమర్‌ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా) మాత్రం తప్పించుకుంటారు. చిన్నతనంలో తమవారిని కోల్పోయిన అమర్‌, ఐశ్వర్య చెరో దిక్కుకు వెళ్ళిపోతారు. కానీ, తమ కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేసిన ఆ నలుగుర్ని అంతమొందించాలనే కసితో పెరుగుతారు అమర్‌, ఐశ్వర్య. అమర్‌ సరే, అక్బర్‌, ఆంటోనీ.. ఎవరు? అమర్‌, ఐశ్వర్య ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? అసలు అమర్‌ - ఐశ్వర్య చిన్నప్పుడే ఒకరికొకరు దూరమైపోయి, మళ్లీ ఎలా కలిశారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే.. 
ఎన్నిసార్లు రవితేజ గురించి మాట్లాడుకోవాలన్నా, ముందుగా అతని ఎనర్జీ లెవెల్స్‌ గురించే స్టార్ట్‌ చెయ్యాలి. ఇందులోనూ రవితేజలో ఎనర్జీని అభిమానులు ఆశించడం మామూలే. ఫుల్‌ ఎనర్జీతో కన్పించడానికి రవితేజ ప్రయత్నించాడుగానీ, మూడు పాత్రలూ కన్‌ఫ్యూజ్‌ చేయడంతో, ఆ కన్‌ఫ్యూజన్‌ ఎఫెక్ట్‌ రవితేజ మీద కూడా పడినట్లు అన్పిస్తుంది. వున్నంతలో ఈ సినిమా భారాన్ని పూర్తిగా తన భుజాన మోసేందుకు రవితేజ కష్టపడ్డాడు.

చాలాకాలం తర్వాత ఇలియానా మళ్ళీ తెరపై కన్పించింది. బొద్దుగా, అందంగానే కన్పించిందిగానీ.. నటన పరంగా ఆమెకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సునీల్‌, వెన్నెల కిషోర్‌, సత్య, రఘుబాబు, గిరి.. ఇలా కామెడీ గ్యాంగ్‌ చాలానే వుంది. ఆ కామెడీ గ్యాంగ్‌ కొంతవరకు నవ్వులు పూయించేందుకు ప్రయత్నించింది. కానీ, సీరియస్‌ మూవీకి ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ కొంత ఇబ్బందికరంగా అన్పిస్తుంది. ఓవరాల్‌గా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేర మెప్పించడానికి ప్రయత్నించారు.

కథ పరంగా చెప్పుకోవాలంటే, ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. ఇందులో హీరోకి ఓ డిజార్డర్‌ పెట్టి, ఇంట్రెస్టింగ్‌గా పాయింట్‌ని తయారు చేసుకున్న దర్శకుడు, కథనంలో మాత్రం సత్తా చాటలేకపోయాడు. పరమ రొటీన్‌ కథనం బోర్‌ కొట్టిస్తుంది. డైలాగులు ఓకే. ఎడిటింగ్‌కి ఇంకా చాలా పని చెప్పాల్సి వుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది.

శ్రీనువైట్ల సినిమాలంటే అందులో చాలా పాత్రలుంటాయి. ఎన్ని పాత్రలున్నా, చాలా సెటిల్డ్‌గా సినిమాని నడిపించేవాడు ఈ దర్శకుడు. కానీ, ఈ సినిమా విషయంలో తడబడ్డాడు. దర్శకుడి కన్‌ఫ్యూజన్‌ ఎఫెక్ట్‌, హీరో రవితేజ మీద కూడా పడటం ఆశ్చర్యకరం. తన ఎనర్జీని తానే పూర్తిగా వినియోగించుకోలేకపోయిన పరిస్థితి రవితేజకి ఏర్పడిందంటే, దానికి కారణం దర్శకుడు శ్రీనువైట్ల సృష్టించిన గందరగోళమే. గ్రిప్పింగ్‌గా వుండాల్సిన కథనం డీలాపడింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ కాస్తా, సినిమా మూడ్‌ని డిస్టర్బ్‌ చేసేసింది. ఓవరాల్‌గా, శ్రీనువైట్ల నుంచి మరోమారు నిరాశ ఎదురయ్యిందని చెప్పక తప్పదు. మాస్‌ రాజా రవితేజ అభిమానులూ డిజప్పాయింట్‌ అయ్యే సినిమానే ఇది.

అంకెల్లో చెప్పాలంటే.. 
2.5/5

ఒక్క మాటలో చెప్పాలంటే 
ఆకట్టుకోని అమర్‌ అక్బర్‌ ఆంటోనీ

మరిన్ని సినిమా కబుర్లు
churaka